విజయవాడ నగరంలో మాజీ సీఎం జగన్‌ పేరును చూడటానికి కూడా కొందరు ఇష్టపడటం లేదు. అంబేద్కర్‌ స్మృతివనంలో ఆయన పేరుతో రాసిన స్టీల్‌ అక్షరాను ధ్వసం చేశారు.


ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేరును వినటానికే కాదు అక్షరాల్లో చూడ్డానికి కొందరు వ్యక్తులు ఇష్టపడటం లేదు. భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనాన్ని రూ. 404.35 కోట్లతో విజయవాడ నగరం నడిబొడ్డులోని పిడబ్లు్యడీ గ్రౌండ్‌ నందు నిర్మించారు. ఆ స్మృతి వనంలో 125 అడుగుల ఎల్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం కింద భాగంలో దిమ్మెకు ‘డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సామాజిక న్యాయ మహా శిల్పం, ఆవిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి’ అని స్టీల్‌ అక్షరాలతో రాసి ఉంది. 2024 జనవరి 19న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంబేద్కర్‌ స్మృతి వనాన్ని ప్రారంభిస్తూ వనం మధ్యలో నిర్మించిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా సీఎం పేరును అక్కడ లిఖించారు.

గురువారం రాత్రి ఏమి జరిగింది?
గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్మృతి వనంలోకి ప్రవేశించారు. స్మృతివనంలోకి ఎవరు రావాలన్నా ముందుగా సెక్యూరిటీ ఉండే గేట్‌ నుంచే లోపలికి ప్రవేశించాలి. సెక్యూరిటీని నెట్టుకుని లోపలికి ప్రవేశించిన వీరు అక్కడ ఉన్న సిబ్బందిని కూడా ¯ð ట్టివేశారు. వారి దగ్గర ఉన్న సెల్‌ఫోన్స్‌ను కూడా స్విచ్‌ఆఫ్‌ చేయించారు. స్మృతివనంలో విద్యుత్‌ను ఆప్‌ చేశారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న సుత్తి, ఇనుప రాడ్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఉన్న అక్షరాలను ధ్వసం చేశారు. అంబేద్కర్‌ స్మృతి వనానికి సమీపంలోనే పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంటుంది. చుట్టుపక్కల వారు పోలీసులకు అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరుగుతున్న వ్యవహారాన్ని తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే అక్షరాలను ధ్వసం చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల నిర్లక్ష్యం ఉందా?
సంఘటన జరుగుతున్న సమయంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. వారు చూస్తుండగానే జగన్‌ పేరుతో ఉన్న అక్షరాలు ధ్వంసం చేసిన వ్యక్తులు నింపాదిగా వారి ముందునుంచే వెళ్లిపోయారని పేర్లు చెప్పడానికి నిరాకరించిన కొందరు వ్యక్తులు తెలిపారు. తమలో కొందరి నుంచి ఫోన్‌లు లాక్కున్నారని, కొందరి చేతుల్లో ఉన్న ఫోన్‌లను బలవంతంగా స్విచ్‌ఆఫ్‌ చేయించారని, కొడతామని బెదిరించడంతో తాము ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ చేశామని సిబ్బంది తెలిపారు. రాత్రి 11 గంటల వరకు అక్కడ కొందరు పోలీసులు ఉన్నారని ఆ తరువాత వారు కూడా వెళ్లిపోయినట్లు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు?
ఇంత జరిగినా అంబేద్కర్‌ స్మృతివనం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు కూడా ఫిర్యాదు చేయాలని వారిని అడగలేదు. ధ్వసం చేసింది అక్షరాలే కదా అని కొందరు పోలీసులు బహిరంగంగానే వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంబేద్కర్‌ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పోలీసులు చర్యలు తీసుకుంటారు. కేవలం అక్కడ ఉన్న కొన్ని అక్షరాలు ధ్వసం చేసి వెళ్లారు. దీనికి తామేమి చేస్తామని నిర్లక్ష్యంగా పోలీసులు అంటున్నట్లు వైఎస్సార్‌సీపీ వారు ఆరోపిస్తున్నారు.
పోలీసులు సుమోటోగా కేసును తీసుకోవచ్చు..
అక్కడ జరిగిన పరిణామాలు గమనించిన పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవచ్చు. లేదా సిబ్బంది ద్వారా ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు మొదలు పెట్టవచ్చు. అయితే శుక్రవారం మధ్యహ్నాం వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసలు అక్కడేమీ జరగలేదన్నట్లు ఉన్నారు. పోలీసులు అక్కడ ఉన్న సమయంలోనే ఈ పరిణామాలు జరిగాయని, అయినా పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నాటి ముఖ్యమంత్రి పేరును ప్రారంభం సందర్భంగా విగ్రహం కింది భాగంలో దిమ్మెకు లికించారంటే శిలాఫలకం వేసినట్లేనని, ఆ అక్షరాలను ధ్వంసం చేస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విగ్రహానికి హాని జరిగి ఉంటే?
దుండగులు జగన్‌ పేరుతో ఉన్న అక్షరాలు ధ్వసం చేసే క్రమంలో అంబేద్కర్‌ విగ్రహానికి ఏ మాత్రం హాని జరిగినా దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగేది. ఎందుకంటే ఇక్కడ నిర్మించిన విగ్రహం ఎత్తు 125 అడుగులు. దేశంలోనే అతి పెద్ద విగ్రహాల్లో ఇదొకటి. పైగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ దేశ సర్వస్వంగా చెబుతారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఎంతో మంది సంతోషంగా ఉన్నారనేది పలువురి మాట. అటువంటి మహాను భావుడి విగ్రహానికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే విజయవాడ భగ్గుమనేది. అలా కాకుండా జగన్‌ పేరుతో ఉన్న అక్షరాలు మాత్రమే ధ్వంసం చేశారు. దీంతో వైఎస్‌ జగన్‌పై ఎంత కక్ష ప్రత్యర్థులకు ఉందో అర్థమవుతోంది.
విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహం పెట్టడం కొందరికి నచ్చలేదు
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనం నిర్మాణం అమరావతి ప్రాంతంలో చేపట్టేందుకు 2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఆ తరువాత వైఎస్సార్‌సీపీ రావడంతో ఆ ప్రతిపాదనకు స్వస్తిచెప్పి విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న పిడబ్లు్యడి గ్రౌండ్‌లోని 23 ఎకరాల స్తలాన్ని అంబేద్కర్‌ స్మృతి వనానికి కేటాయించి పనులు పూర్తి చేసి జగన్‌ ప్రారంబించారు. అప్పటి నుంచి నగరంలోని ఒక వర్గం వారికి ఇష్టం లేకపోయినా భరిస్తున్నారనే ప్రచారం ఉంది.
కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్‌కుమార్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం ఉదయం పోలీసు కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసే కుట్ర జరిగిందని, విగ్రహం దిమ్మెపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఉన్న అక్షరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
స్వరాజ్‌ మైదాన్‌ (పిడబ్లు్యడీ గ్రౌండ్‌)లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహంపై కొందరు దుండగులు దాడి చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ శాసన మండలి సభ్యులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు జూపూడి ప్రభాకర్‌రావు చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక చారిత్రాత్మక ఘట్టానికి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాలన నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరున్న శిలా ఫలకాన్ని ధ్వంసం చే సిన వారిపై కఠినంగా వ్యహరించాలని కోరారు. మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులంతా ఈ సంఘటనను ఖండించాలన్నారు. తిరిగి వైఎస్‌ జగన్‌ పేరును పునఃప్రతిష్టించాలని డిమాండ్‌ చేశారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ తూర్పు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు కార్పొరేటర్లు అంబేద్కర్‌ విగ్రహాన్ని శుక్రవారం పరిశీలించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును ధ్వసం చేసిన తీరును అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. అనంతరం అక్కడ కొద్దిపేపు కూర్చుని నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పోలీసునల తీరును ఖండించారు.
Next Story