‘‘వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడమే లక్ష్యమా?’’ కూటమి సర్కార్ షర్మిల ప్రశ్న
x

‘‘వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడమే లక్ష్యమా?’’ కూటమి సర్కార్ షర్మిల ప్రశ్న

ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. అసలు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని ప్రశ్నించారు.


ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. అసలు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అనేది ఇప్పటికే అందని ద్రాక్షలా మారిందని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వైద్య విద్య అనేది ఒకటి ఉండేదట అని పేదలు మాట్లాడుకోవాల్సి వస్తుందంటూ విమర్శలు గుప్పించారు. అలా చేయాలన్నదే ప్రభుత్వం ప్లానా? అని ప్రశ్నించారామే. వైద్య విద్యను పేద విద్యార్థులకు చేరువ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వైద్య విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకోవాలని కోరారు. దాంతో పాటుగా గత ప్రభుత్వం ప్రకటించిన 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని, తద్వారా వైద్య విద్య కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఆంధ్రలోని పేద విద్యార్థులకు లేకుండా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ షర్మిల తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు.

గుజరాత్ పీపీపీ అధ్యయనం ఎందుకు?

‘‘రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ? గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారు ? జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే నోరు విప్పాలి. ప్రైవేటీకరణ పై సమాధానం చెప్పాలి. కూటమి సర్కార్‌లో భాగస్వామ్య పక్షంగా ఉండి, ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన

పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని, నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని మెడికల్ బోర్డు కి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా ? ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు. కొత్తగా 750 సీట్లు సమకూరక పోవడం మీ నిర్లక్ష్యం ఫలితమే. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారు. విద్యార్థుల ఆశలను నీరు గార్చారు.మెడికల్ సీట్లకోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి YCP సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే... ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్..ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి,ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా మెడికల్ కాలేజీలపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఏపీలోని వైద్య విద్య పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దుస్థితికి జగనే కారణం: మంత్రి

‘‘రాష్ట్రంలో 17 వైద్య కళాశాలు నిర్మిస్తామని గతంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ నానా ఆర్భాటం చేశారు. వాటిని ప్రారంభించడం అయితే ప్రారంభించారు కానీ వాటిని పూర్తి చేసే విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించారు. ఈ కాలేజీలను రూ.8,480 కోట్ల వ్యయంతో నిర్మించాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ వీటి ఆచరణ విషయంలో చతికిలబడింది. ఈ మొత్తంలో రూ.4,84 కోట్లను కేంద్రం, నాబార్డు, సీఎస్ఎస్ ద్వారా పొందాలని భావించి ఏపీ సర్కార్. కానీ తమ ఐదేళ్ల పాలనలో వాళ్లు కేవలం రూ.2,125 కోట్లతో 25శాతం పనులను పూర్తి చేయగలిగారు. అందులో రూ.1,41 కోట్ల బిల్లులే చెల్లించారు. ఇంకా రూ.674 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తమ బకాయిలు చెల్లిస్తే తప్ప నిర్మాణాలు పునఃప్రారంభించలేమని నిర్మాణ సంస్థలు తేల్చి చెప్తున్నాయి. గతంలో చెల్లించిన రూ.1,415 కోట్ల బిల్లులు మొత్తం కూడా కేంద్రం, నాబార్డు విడుదల చేసిన నిధులలోనివే. రాష్ట్ర ప్రభుత్వం వాటిలో ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించలేదు. తన సొంత నియోజకవర్గం పులివెందుల మెడికల్ కాలేజీపై కూడా ఆనాటి సీఎం వైఎస్ జగన్‌కు చిత్త శుద్ధి లేదు. ఇప్పటికి ఆ కాలేజీలు అసంపూర్ణంగానే ఉన్నాయి. సిబ్బంది విషయంలో కూడా లోటుపాట్లు ఉన్నాయి’’ అని వెల్లడించారు.

వాటి దుస్థితి మరీ దారుణం

తొలి దశలో ప్రారంభించిన మెడికల్ కాలేజీల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే.. రెండో దశలో నిర్మించాల్సిన 4 కాలేజీు, మూడో దశలో నిర్మించాల్సిన 6 మెడికల్ కాలేజీల దుస్థితి ఇంకా దారుణంగా ఉందని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. పాత మెడికల్ కళాశాలల్లో ఉన్న సిబ్బందిని కొత్త కాలేజీలకు బదిలీ చేసి పాత కాలేజీల్లోని వైద్య విద్య, వైద్య సేవల నాణ్యతను కూడా వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసింది. ఈ విద్య సంవత్సరంలో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు జరగకపోవడానికి జగన్ ఒక్కరే బాధ్యుడు. కానీ కూటమి హయాంలో 17 కళాశాలలను పూర్తి చేసి అన్నింటిలో ప్రవేశాలు చేపడతాం. రాష్ట్రంలో ఆయుష్ సేవల అభివృద్ధి కోసం కేంద్రం రూ.90.84 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.38 కట్లు మాత్రమే ఆయుష్ సేవలకు అందాయి’’ అని ఆయన వివరించారు.

Read More
Next Story