వైఎస్‌ఆర్‌ టైమ్‌లో ఇంటర్‌డ్యూస్‌ చేసినా, చంద్రబాబు హయాంలో విరివిగా ప్లాంటేషన్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత ఏపీలో వీటిని తొలగించాలని నిర్ణయించారు. ఇంతకీ ఏంటా చెట్టు? ఎందుకు తొలగించమన్నారు?


పవన్‌ కళ్యాణ్‌ అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత మొక్కల పెంపకానికి ప్రాధాన్యత పెరిగింది. అయితే ఆ చెట్టును మాత్రం తొలగించాలని అధికారులు ఆదేశించారు. అది ఆస్ట్రేలియా దేశానికి చెందిన చెట్టు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఈ చెట్టు తెలుగు ప్రజలకు పరిచయమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దీనికి బీజం పడింది. ఆస్ట్రేలియా నుంచి వీటిని తెప్పించారు. తొలుత కడప మునిసిపాలిటీ పరిధిలో వీటిని నాటేందుకు ప్లాన్‌ చేశారు. ట్రైయల్స్‌ కింద కడప టౌన్‌లోని రోడ్లకు మధ్యలో ఉన్న డివైడర్స్‌లో వీటిని నాటించారు. నాన్‌ లోకల్‌ స్పీస్‌ అయినా స్థానిక వాతావరణాన్ని తట్టుకొని ఏపుగా పెరిగింది. చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉండటం, కడప ప్రయోగం సక్సెస్‌ కావడంతో నాటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తక్కిన ప్రాంతాల్లో కూడా వీటిని ప్లాంటేషన్‌ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో వీటిని బ్రీడ్‌ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆ చెట్టు ఏంటనుకుంటున్నారా? దాని పేరు కోనో కార్పస్‌(Conocarpus). దీని శాస్త్రీయ నామం కోనో కార్పస్‌ ఎరెక్టెస్‌(Conocarpus Erectus). దుబాయి టేకు అని పిలుస్తారు.

ఈ చెట్టు ప్రత్యేకలు ఏంటంటే..

మొక్కను నాటిన అతి తక్కువ రోజుల్లోనే ఏపుగా పెరిగి పోతుంది. పచ్చదనానికి పెట్టింది పేరుగా ఉంటుంది. పెరిగిన మొక్కలు గోడ కట్టినట్టుగా అయిపోతాయి. తక్కిన చెట్ల మాదిరిగా కాకుండా ఆకులు రాలిపోవడం ప్రారంభమైన వెంటనే చిగురులు వచ్చేస్తాయి. ఆకులు రాలినట్టే అనిపించదు. అన్ని సీజన్‌లలో ఎవర్‌ గ్రీన్‌గా ఉంటుంది. అన్ని సీజన్‌లలో పచ్చదనం పరచినట్లుగా ఉండటం ఈ చెట్టు మరో ప్రత్యేకత.
ప్రతికూలతలు ఏంటంటే..
ఈ చెట్టుకు అనుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువుగా ఉన్నాయి. చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించినా, నిండైన పచ్చదనంతో ఆహ్లాదరపరచినా, కొన్ని ఇబ్బంది కరమైన ప్రతికూలతలు ఉన్నాయి. ప్రతి చెట్టుపైన ఏదో ఒక పక్షి గూడు కట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. కానీ ఈ చెట్టుపైన ఏ రకమైన పక్షి కూడా వాటి గూడు(నెస్టింగ్‌)ను చేయడం లేదు. ఆ చెట్లకు కాసే ఫలాలు కూడా తినడానికి వీల్లేకుండా ఉన్నాయి. పక్షులు, ఇతర జంతులు కూడా తినేందుకు ఇష్టపడం లేదు. మనుషులు ఎలాగూ వీటిని తినరు. అంతేకాకుండా ఫ్లవరింగ్‌ స్టేజీలో పుప్పుడి రేణువుల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కంటికి కనిపించని పరిమాణంలో ఉన్న ఆ పుప్పుడి రేణువులు గాలిలో కలిసి పోవడం వల్ల ఆ గాలిని పీల్చుకున్నప్పుడు అలెర్జీలు వస్తున్నట్లు గుర్తించారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో పాటుగా ఈ చెట్ల కింద ఎలాంటి గడ్డి కానీ, ఇతర మొక్కలు పెరగడం లేదు. ఇది ఇతర దేశానికి చెందిన స్పీస్‌(ఎగ్జోటిక్‌ టిక్‌ స్పీస్‌) కావడంతో లోకల్‌ జాతులకు చెందిన మొక్కలు, గడ్డిని ఇది పెరగనీయడం లేదు. అదే స్వదేశీ రకానికి చెందిన చెట్లు అయితే ఇక్కడున్న వాతావరణానికి బాగా అలవాటు పడుతాయి. వాటి కింద ఇతర మొక్కలు, గడ్డి వంటివి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. వీటిపైన స్థానికంగా తిరిగే సీతాకోక చిలుకలు కానీ, పక్షులు కానీ ప్యూపా, లార్వాల వంటి వాటికి నిలయాలుగా ఉంటాయి.
సైంటిఫిక్‌గా ఎగ్జోటిక్‌ స్పీస్‌ అనేది ప్రోత్సహించ దగినవి కావు. అయితే విదేశీ జాతులకు చెందిన వాటిని అప్పుడప్పుడు ట్రెయిల్‌ అండ్‌ ఎర్రర్‌ కింద తెచ్చి ప్లాంటేషన్‌ చేస్తుంటారు. అలా దీనిని కూడా తెచ్చి ప్లాంటేషన్‌ చేసినట్లు గుంటూరు అటవీ శాఖ అధికారి కే మహబూబ్‌ బాషా ‘ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’కు తెలిపారు. అటవీ శాఖ అధికారులు సంవత్సరాల తరబడి ఈ చెట్లను గమనించి, పరిశీలించి అబ్జర్వేషన్‌ చేసి, అధ్యయనం చేసిన పిమ్మట ఈ చెట్టులో ఈ రకమైన ప్రతికూలతలు ఉండటంతో ఆరోగ్య పరంగాను సరికాదని, ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్రెండ్లీ కాదని, ప్రజల్లో వీటిపైన అవగాహన కల్పిస్తున్నట్లు మహబూబ్‌ బాషా తెలిపారు.
అందుకే ఎంకరేజ్‌ చేయడం లేదు..
ఇన్ని ప్రతికూలతలు కలిగిన ఈ చెట్టును రాష్ట్ర వ్యాప్తంగా ఎంకరేజ్‌ చేయడం లేదు. నర్సరీల్లో కూడా పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో దీనిపైన అవగాహన కల్పించడంతో పాటు ఉన్న వాటిని దశల వారీగా తొలించేందుకు చర్యలు తీసుకంటున్నట్లు తూర్పు గోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి బి నాగరాజు తెలిపారు. గుంటూరు జిల్లాలోని అన్ని మునిసిపల్‌ కమీషనర్లకు, పంచయతీరాజ్‌ శాఖ అధికారులకు కమ్యునికేట్‌ చేసి, ఈ చెట్టును ఎంకరేజ్‌ చేయొద్దని, ఎక్కడా నాటొద్దని, ఒక వేళ ఇది వరకే నాటి ఉంటే వాటిని తొలగించి, బదులుగా స్వదేశీ ప్లాంట్లను నాటాలని సూచించినట్లు మహబూబ్‌ బాషా చెప్పారు. ఈ చెట్టుతో పాటు అల్‌స్టోనియా స్కొలరీస్‌(Alstonia scholaris )ను కూడా వేయొద్దని సూచించినట్లు చెప్పారు. దీనిని డెవిల్స్‌ ట్రీ(Devils Tree) అని, ఏడాకులఫల అంటారు.
చంద్రబాబు హయాంలో విరివిగా ప్లాంటేషన్‌
ఈ చెట్టును మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి టైమ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేసినా, 2014 నుంచి 2019 మధ్య కాలంలో వీటిని విరివిగా ప్లాంటేషన్‌ చేపట్టారు. ఎలాంటి సాయిల్‌లో వేసినా దానికి తగ్గట్టుగా అడాప్ట్‌ అయిపోతుంది. ఇండస్ట్రీయల్‌ బెల్ట్‌ మెయింటెయిన్‌ చేసేందుకు ఆ ప్రాంతంలో అందంగా కనిపించేందుకు, ఆకట్టుకునే విధంగా అట్రాక్షన్‌గా ఉండటంతో ఈ చెట్లను ఎక్కువుగా ప్రెఫెర్‌ చేశారు. దీంతో వీటిని నాటడం బాగా పెరిగింది. అయితే గత ఐదేళ్లుగా వీటిని ప్రోత్సహించడం లేదు. పవన్‌ కళ్యాణ్‌ అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత వీటిని తొలగించాలని అధికారులకు ఆదేశించారు.
Next Story