మా ఆయనకు కౌన్సెలింగ్ ఇవ్వండి : జగన్ కు  దువ్వాడ భార్య విజ్ఞప్తి
x

మా ఆయనకు కౌన్సెలింగ్ ఇవ్వండి : జగన్ కు దువ్వాడ భార్య విజ్ఞప్తి

దువ్వాడ కుటుంబ కథా చిత్రం మరో కీలక మలుపు తీసుకుంది. తనకు ఆస్తులు, అంతస్తులు అక్కర్లేదని తన భర్త కావాలని వాణి తేల్చి చెప్పారు.


దువ్వాడ కుటుంబ కథా చిత్రం మరో కీలక మలుపు తీసుకుంది. తనకు ఆస్తులు, అంతస్తులు అక్కర్లేదని తన భర్త కావాలని వాణి తేల్చి చెప్పారు. ఇన్నాళ్లూ దువ్వాడపై ఒంటికాలుపై లేచిన వాణి ఇచ్చిన ఈ ట్విస్ట్‌ అందరినీ అవాక్‌కు గురి చేసింది. ఏది ఏమైనా అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండటం ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రోజులుగా దువ్వాడ ఇంటి రచ్చ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. తాను, దువ్వాడ సహజీవనం చేయడం లేదని, తమది అడల్ట్రీగా చెప్పుకోవచ్చని కూడా దివ్వెల మాధురి చెప్పారు. అదే విధంగా తాను, మాధురి దగ్గరయ్యామని దువ్వాడ శ్రీనివాస్ బహిర్గతం చేశారు. ఇంతలో దివ్వల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వాణి అబద్దాలు, ఆరోపణలు తట్టుకోలేక ఒక మంచి మనిషి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందంటూ దువ్వాడ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వాణి తన టోన్ మార్చేశారు. ఇంతకీ ఆమె ఏమంటున్నారంటే..

ఏ షరతులకైనా రెడీ

‘‘నాకు ఆస్తులు, అంతస్తులు, రాజకీయాలు వద్దు. నాకు నా భర్తతో కలిసి ఉండటం కావాలి. ఏమైనా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండటం ముఖ్యం. అందుకోసం ఆయన ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తా. శ్రీనివాస్ ఎలా తిరిగా నాకు సంబంధం లేదు. నాకు ఆయన కావాలి. కుమార్తె పెళ్ళి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. కూతురు పెళ్ళి, సమాజాం కోసం ఒకే ఇంట్లో ఉందామని దువ్వాడ శ్రీనివాస్‌ను కోరాను. పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం. దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా నాకు అనవసరం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దువ్వాడ వాణి.

ససేమిరా అంటున్న శ్రీనివాస్

దువ్వాడ వాణి ఏం చెప్పినా ఆమెతో కలిసి ఉండటం అనేది జరిగే పని కాదంటూ ససేమిరా అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. తనపై కోర్టులో కేసులు వేశారని, కాబట్టి కోర్టు చెప్పిన విధంగానే తాను కూడా నడుచుకుంటానంటూ తేల్చి చెప్పారు. ‘‘రూ.6 కోట్లు విలువైన ఇంటిని, ఫ్యాక్టరీని, రూ.27 కోట్ల ఆస్తిని వాణికి రాసిచ్చా. వాణి తాజాగా చేసిన ఏ డిమాండ్‌ను ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అని వెల్లడించారు దువ్వాడ శ్రీనివాస్. కాగా వీరి మధ్య రాజీ కుదర్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా అవి సఫలీకృతమయ్యేలా కనిపించడం లేదు.

దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణ హాని: వాణి

ఈ నేపథ్యంలోనే దివ్వల మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని వాణి కీలక ఆరోపణలు చేశారు. ‘‘దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి మాధురి చేరుకుంది. మాధురి వలలో దువ్వాడ శ్రీనివాస్ చిక్కుకున్నారు. ఆయనకు ఏమైనా అయితే నేను, నా పిల్లలు వీధిన పడతాం. పోలీసులు వెంటనే స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉన్న అనధికార వ్యక్తులను బయటకు పంపాలి. రేపు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తా. ఈ వ్యవహారంలో వైసీపీ జోక్యం చేసుకోవాలి. సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్.. దువ్వాడ శ్రీనివాస్‌కు సూచించాలి’’ అని కోరారు.

Read More
Next Story