జగన్ ఇంటికి వెళ్లిన కంటైనర్‌లో ఏముందో చెప్పిన వైవీ
x
Source: Twitter

జగన్ ఇంటికి వెళ్లిన కంటైనర్‌లో ఏముందో చెప్పిన వైవీ

సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్‌లో ఏముందో వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. విశాఖలో సీబీఐ వాళ్లు పట్టుకున్న కంటైనర్.. లోకేష్ బంధువలదని ధ్వజమెత్తారు.


విశాఖలో ఇటీవల ఓ కంటైనర్‌లో భారీ మొత్తంలో డ్రగ్స్ దొరకడం దేశమంతా సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఎక్కడ కంటైనర్ కనిపించినా లేనిపోని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంప్ ఆఫీసులోకి ఓ కంటైనర్ వెళ్తున్న ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో ఏముంది? ఎందుకు సీఎం కార్యాలయంలోకి వెళ్తోంది? అన్న అనుమానాలను ఈ కంటైనర్ రేకెత్తించింది. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడం కూడా మొదలు పెట్టేశాయి. ఆ కంటైనర్‌ను పోలీసులు ఎందుకు తనిఖీ చేయలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రశ్నించారు. తాజాగా దీనిపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షం అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

అదంతా దుష్ప్రచారమే

సీఎం క్యాంప్ ఆఫీసులోకి కంటైనర్ వెళ్లడంపై కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహించారు. ‘‘సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కంటైనర్‌లో అవసరమైన ఫర్నిచర్ ఉంది. ప్రభుత్వ శాఖలకు కావాల్సిన ఫర్నిచర్‌నే ఆ కంటైనర్‌లో తరలించారు. దానిపై దుష్ఫ్రచారం చేయడం సరికాదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సుబ్బారెడ్డి. అనంతరం టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ కంటైనర్‌.. నారా లోకేష్ బంధువులకు చెందినదేనని ఆరోపించారు.


లోకేష్.. దొడ్డిదారిలో మంత్రయ్యారు

లోకేష్‌ను ఎక్కువ సంస్కారం ఉంటుందనుకోవడం నా బుద్దితక్కువ తనమే అవుతుందని వైవీ సుబ్బారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014లో దొడ్డిదారిన వెళ్లి లోకేష్.. మంత్రి పదవిని అందుకున్నారు. ‘‘వైజాగ్‌కు డ్రగ్స్ తరలించిన కంటైనర్‌.. లోకేష్ బంధువులదే. అందుకే ఏ కంటైనర్‌ చూసిన పిచ్చిపిచ్చి అనుమానాలు వస్తున్నాయి. విషయం తెలుసుకోకుండా సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు’’అని ఆగ్రహించారు.

కూటమి ఏం మెసేజ్ ఇస్తుంది

బీసీలు అత్యధికంగా ఉన్న ఉత్తరాంధ్రలో ఎంపీ టికెట్లను బీసీ అభ్యర్థులకు కాకుండా ఓసీలకు ఇవ్వడం ద్వారా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏం మెసేజ్ ఇస్తుందని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి. కానీ తమ పార్టీ వైసీపీ మాత్రం ఉత్తరాంధ్ర ప్రజల కోరిక అనుగుణంగా స్థానిక బీసీలకే అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రలో ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ఎండగడతాం అని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్ర మరోసారి జగన్‌కే పట్టం కడుతుందని జోస్యం చెప్పారు. టీడీపీని మరోసారి నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవని కీలక వ్యాఖ్యలు చేశారాయన.

Read More
Next Story