ఒకే వేదికపై కనిపించిన అన్నామలై- ఈపీఎస్
x
తమిళనాడులో ఒకే వేదికపై కనిపించిన అన్నామలై, ఈపీఎస్

ఒకే వేదికపై కనిపించిన అన్నామలై- ఈపీఎస్

మూపనార్ స్మారక కార్యక్రమంలో కనిపించిన ఇద్దరు నాయకులు


ప్రమీలా కృష్ణన్

నిన్న చెన్నైలో జరిగిన జీకే మూపనార్ స్మారక కార్యక్రమంలో ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ కే. అన్నామలై ఒకరిపక్కన ఒకరు కూర్చున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు ఇద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించడం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతుందనడంలో సందేహం లేదు.

ఈ స్మారక కార్యక్రమం తమిళనాడు లో ఎన్డీఏ బలప్రదర్శనగా మారింది. బీజేపీ, అన్నాడీఎంకే సీనియర్ నాయకులు వేదిక పంచుకున్నారు. ముఖ్యంగా మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై అప్పట్లో ఈపీఎస్, అన్నాడీఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడటంతో రెండు పార్టీల మధ్య సంబంధాలు విచ్చిన్నమయ్యాయి.
అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, బీజేపీ నేత కే. అన్నామలై మధ్య సంబంధాలు బహిరంగ మాటల యుద్ధాలతో వేడెక్కాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఉన్న సమయంలో అన్నామలై తనను తాను బలమైన నేతగా చూపించుకునే ప్రయత్నం చేశారు.
మాజీ ముఖ్యమంత్రులు జే. జయలలిత, ఈపీఎస్ లను విమర్శించడంతో అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడులో బీజేపీని ఛాంపియన్ గా నిలబెట్టే ప్రయత్నంలో అన్నాడీఎంకేని టార్గెట్ చేయడంతో ఆ పార్టీలో అలజడిని సృష్టించింది.
2023 లో ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అన్నామలై ఈపీఎస్ ను వ్యతిరేకించడం ఇందుకు కారణం. ఫలితంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తన దీర్ఘకాల భాగస్వామి నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేసి భంగపడింది. ఇది ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది.
ఈ ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఇటీవల నైనార్ నాగేంద్రన్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అన్నామలై అంత దూకుడుగా కాకుండా సౌమ్యుడిగా పేరున్న ఈయన 2026 లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
అన్నామలై, ఈపీఎస్ లను ఒకే వేదికపై కూర్చోబెట్టే ప్రయత్నం అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సంబంధం మరింత బలపడిందని తమ సొంత కార్యకర్తలకు, మద్దతుదారులకు ఒక సంకేతాన్ని పంపడానికే అని రాజకీయ పరీశీలకులు భావిస్తున్నారు.
మూపనార్ స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్, డీఎండీకే కోశాధికారి ఎల్ కే సుధీష్ కూడా పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో మూపనార్ కు ఘనమైన నివాళులు అర్పించారు. జాతీయ రాజకీయాల్లో ఆయన స్థాయిని,ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు.
‘‘మూపనార్ కు భారత ప్రధానమంత్రి అయ్యే సత్తా ఉంది. కానీ ఆ క్షణం వచ్చినప్పుడూ ఆయనను వ్యతిరేకించిన శక్తులు ఆయనకు ఆ అవకాశాన్ని నిరాకరించాయి. నేడు తమిళ గర్వాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్న శక్తులు నిజంగా ముఖ్యమైనప్పుడూ ఒక తమిళ నాయకుడికి మద్దతు ఇవ్వలేదు. ఆ ద్రోహాన్ని మర్చిపోకూడదు’’ అని ఆమె అన్నారు.
ఐక్యత అవసరం..
ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రతిపక్ష శ్రేణులలో ఐక్యత అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. ‘‘2026 లో తమిళనాడుకు ఒక పెద్ద మార్పు అవసరం. ప్రజలు మంచి పాలనను కోరుకుంటున్నారు. మద్యం ఆధారిత విధానాలు కాదు. రాజవంశ మనుగడకాదు. స్పందించడం మన సమష్టి విధి.
మనం ఈ కూటమిని బలోపేతం చేయాలి. ప్రజల కోసం పనిచేయాలి. చిన్నచిన్న తేడాలు మన దృష్టి మరల్చకూడదు. ఇక్కడి నాయకులందరూ వాటి కంటే పైకి ఎదగడానికి పరిణతి చెందాలి. ఈ కూటమి ద్వారా ప్రజలకు సేవ చేయడమే మూపనార్ కు నిజమైన నివాళి’’ అని ఆమె ప్రకటించారు.
సయోధ్య సంకేతాలు..
పార్టీ సమావేశానికి ఈపీఎస్ ముందుగానే వేదిక నుంచి బయలుదేరారని, కానీ సుపరిపాలన, ప్రజల సంక్షేమం గురించి బాగా మాట్లాడారని సీతారామన్ అన్నారు.
పళనిస్వామి, అన్నామలై కలిసి కూర్చున్న బీజేపీ, అన్నాడీఎంకే నాయకులు దృశ్యాలు నెలల తరబడి సంబంధాలపై అనిశ్చితి తరువాత రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్నాయనే సంకేతాలను బలోపేతం చేస్తున్నాయి.
రాజకీయ విమర్శకుడు ఎలంగోవన్ రాజశేఖర్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఫోటోలు చాలా ముఖ్యమైనవి. ఈపీఎస్ నాయకత్వంలో అన్నాడీఎంకే కూటమిని అన్నామలై బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికి పళనిస్వామి, అన్నామలై కలిసి కూర్చున్నారని అన్నారు.
‘‘లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ- ఏఐఎడీఎంకే బంధం కుప్పకూలడానికి అన్నామలై వైఖరే కారణం. నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఎక్కువగా 2026 ఎన్నికలే లక్ష్యంగా ఉన్నాయి. అన్నామలై తమిళనాడులో పార్టీకి కేంద్ర స్థానంగా కొనసాగుతున్నాడు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేతో సంబంధాలు సజావుగా సాగడానికి బీజేపీ ఆయన స్థానంలో నాగేంద్రన్ ను నియమించింది. అయితే క్షేత్రస్థాయిలో అన్నామలైకి బలం ఉంది.
బీజేపీ క్యాడర్, తమిళ ఓటర్ల వర్గాలలో ఆయనకున్న ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేము. అయితే ఈపీఎస్ ను మచ్చిక చేసుకోవడానికి అన్నామలైని లూప్ లో ఉంచాల్సి వచ్చింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడంలో అన్నామలై కీలక సాధనంగా పనిచేస్తారని రెండు పక్షాలు గుర్తించాయని, ఈ సమావేశం వ్యూహాత్మక సయోధ్యకు సంకేతం అని రాజశేఖరన్ అన్నారు.
ప్రధానమంత్రిగా మూపనార్..?
రాజకీయ విశ్లేషకుడు రాజశేఖరన్ మూపనార్ తో కలిసి ప్రయాణించారు. ఆయన ప్రచారాలను కవర్ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఆయన ఎదుగుదలను నిశితంగా గమనించారు. మూపనార్ ప్రధాని అయ్యే అవకాశాలను కొన్ని శక్తులు అడ్డుకున్నాయనే నిర్మలా సీతారామన్ వాదనలపై ఆయన స్పందించారు.
‘‘మూపనార్ కు ప్రధాని అయ్యే అవకాశం నిరాకరించడబడిందని నిర్మలా సీతారామన్ మాట్లాడినప్పటికీ వాస్తవం ఇందుకు విరుద్దంగా ఉంది. ఆయనకు ప్రధాని అయ్యే కోరిక లేదు’’ అన్నారు.
మూపనార్ పేరును సుర్జిత్ సింగ్ బర్నాల వాంటి నాయకులు సూచించారని, ఆ సమయంలో జ్యోతిబసు, విపి సింగ్ పేర్లు కూడా వచ్చాయని చెప్పారు. ‘‘నిజానికి కాంగ్రెస్ మూపనార్ ను ట్రబుల్ షూటర్ గా వినియోగించుకుంది.
పార్టీ వర్గాలను ఏకం చేయగల ఐక్యతా శక్తిగా ఉపయోగించుకుంది. ఆ పాత్రను ఆయన ఎంతో గౌరవించారు. కానీ ఆయన ఎప్పుడూ ప్రధానమంత్రి కావాలని ఆశించలేదు’’ అని ఆయన అన్నారు.
Read More
Next Story