‘వర్క్ ఈజ్ వర్షిప్’ అని బోధిస్తే హిందూ వ్యతిరేకి అంటున్నారు..
x

‘వర్క్ ఈజ్ వర్షిప్’ అని బోధిస్తే హిందూ వ్యతిరేకి అంటున్నారు..

మేము ఏ తప్పు చేయలేదు. ఇంగ్లీష్ పద్యాల్లో ఉన్న వాటిని విద్యార్థులకు బోధించాం. మతాల ప్రసక్తి తీసుకురాలేదని మంగళూర్ లోని క్రైస్తవ మిషనరీ స్కూల్ వివరించింది.


విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘వర్క్ ఈజ్ వర్షిప్’ అనే పద్యాన్ని విద్యార్థులకు వివరించానని అయితే దాన్నే పట్టుకుని హిందూ మతానికి వ్యతిరేకంగా పాఠాలు చెప్తున్నారనే ప్రచారం చేశారని, మంగళూర్ లోని సెయింట్ గెరోసా ఇంగ్లీష్ హయ్యర్ ప్రైమరీ స్కూల్ టీచర్ సిస్టర్ ప్రభ ఆవేదన వ్యక్తం చేశారు.

తానే ఏ మతాన్ని కించపరచలేదని, కేవలం ఠాగూర్ రాసిన పద్యంలోని అక్షారాలనే వివరించానని చెప్తుతున్నారు. పాఠాలు విన్నాక మొదట పిల్లల తల్లిదండ్రులు వచ్చారని, తరువాత బీజేపీ, భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు వచ్చి పాఠశాల ముందు ఆందోళన చేశారని, దాంతో టీచర్ ను సస్పెండ్ చేశామని ఛారిటీ మంగళూర్ ప్రావిన్స్ సోదరి సిస్టర్ ఐరీన్ మెనేజెస్ ఫెడరల్ తో చెప్పారు.

ప్రభకు 16 సంవత్సరాల బోధనాభవం ఉంది. ఇప్పటి వరకూ తనపై ఎలాంటి రిమార్క్ లేదు. ఠాగూర్ పద్యంలోని వాక్యాలు ఇలా ఉన్నాయి. "దేవుడి కోసం జపాలు, పూజలు చేయడం ఏంటీ, నువ్వు ఒకసారి కళ్లు తెరిచి చూడు, నీ దేవుడు నీ ముందు లేడు, గుడ్డి వాడు నేలను సాగు చేసే చోట, పని వాడు రాళ్లు పగలగొట్టి దారులు వేసే చోట దేవుడు ఉన్నాడు " అని వివరించింది. పాఠంలో నేను ఏదేవుడి ప్రసక్తి తీసుకురాలేదు. హిందూవుల మనోభావాలను అసలు కించపరచలేదు అని సిస్టర్ ప్రభ అంటున్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత మాట్లాడుతూ.. దేవాలయాలు, మసీదు, చర్చిలు అన్నికూడా కేవలం భవనాలు మాత్రమే. నిజంగా దేవుడు నీ హృదయంలో మాత్రమే ఉన్నాడు. అదే పాఠాన్ని మేము బోధించాము అని వివరించారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు స్కూల్ ముందు విద్యార్థులతో టీచర్, పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. చర్చలకు రమ్మని ఆహ్వానించినా, వారు టీచర్ ను సస్పెండ్ చేయాల్సిందే అని పట్టుపట్టారు.

అందుకే ఎలాంటి విచారణ లేకుండా ఆమెను విధుల నుంచి తొలగించామని పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. మరో వైపు సోషల్ మీడియాలో సైతం ఇదే విధమైన ప్రచారం చేస్తున్నారు. హిందూ మతానికి వ్యతిరేకంగా పాఠాలు బోధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ నిరాధారమైనవని స్కూల్ యాజమాన్యం ఖండించింది.

నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

బీజేపీ ఎమ్మెల్యేలు వేద వ్యాస్ కామత్, డాక్టర్ భరత్ శెట్టి మాట్లాడుతూ.. చిన్న పిల్లల్లో హిందూ వ్యతిరేక భావాలు నాటడానికి పాఠశాల యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మతం మార్చే కుట్రలకు తెరలేపుతున్నారని దీనికి మంగళూర్ లోని క్రిస్టియన్ స్కూల్ కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆందోళనలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇక లాభం లేదనుకుని పాఠశాల యాజమాన్యం సిస్టర్ ప్రభను విధుల నుంచి తొలగించింది.

తమ పాఠశాల నిబంధనల ప్రకారం ఎవరినైనా విధుల తొలగించాల్సి వస్తే ముందు విచారణ చేసి, నివేదిక వచ్చాక చర్యలు తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా ఈసారి వ్యవహరించాల్సి వచ్చిందని స్కూల్ యాజమాన్యం చెబుతున్న మాట. వారు వినిపిస్తున్న ఆడియో నిజమైంది కాదని, దానిపై పోలీసులను సైతం స్కూల్ యాజమాన్యం ఆశ్రయించింది. అలాగే తమ పాఠశాలకు రక్షణ కల్పించాలని కోరింది.

ఇదే అంశంపై పౌరహక్కుల నాయకులు మాట్లాడుతూ " ఉపాధ్యాయురాలు ఎలాంటి తప్పు చేయలేదు, ఆమెను సస్పెండ్ చేయడం ద్వారా పాఠశాల యాజమాన్యం తప్పు చేసింది" అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే న్యాయవాదీ దినేష్ ఉలేపాడీ మాట్లాడతూ " ఒక అమాయకురాలిని ఎలాంటి విచారణ లేకుండా విధుల నుంచి తప్పించారు. తప్పు చేయని వారిని శిక్షించడం నిజంగా దిగ్ర్భంతికరం" అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఉపాధ్యాయురాలు కన్నడ సిలబస్ లో ఉన్న అంశాలను మాత్రమే వివరించారని మంగళూర్ కు చెందిన ఆంగ్ల ప్రొఫెసర్ కే. రామకృష్ణ అన్నారు. ఠాగూర్ కానీ విగ్రహరాధనను వ్యతిరేకించారు. పనినే దేవుడిగా భావించాలన్నారు. ఇదే విషయాలు అందులో ఉన్నాయని చెప్పారు.

రాజకీయ రంగులోకి వివాదం..

ఎమ్మెల్యేలు, వారితో వచ్చిన దుండగుల గుంపు స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించినందునే టీచర్ ను విధుల నుంచి తొలగించినట్లు హెడ్ మినిస్ట్రీస్ అంగీకరించింది. మాకు వేరే మార్గం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేసింది. అనంతరం స్కూల్ యాజమాన్యం మంగళూర్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వీహెచ్పీ, భజరంగ్ దళ్ నేతలపై కేసులు సమోదు అయినట్లు సమాచారం. వీరి చర్యలు దక్షిణ కన్నడ జిల్లాలో మత సామరస్యానికి భంగం కలిగించేవిలా ఉన్నాయని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రభావం విద్యా సంస్థలపై రాజకీయ ఎజెండాల ప్రభావం గురించి ఆందోళన కలిగిస్తోందని పౌర సమాజం కార్యకర్త రాజేష్ శెట్టి అన్నారు.

Read More
Next Story