15న హాజరుకండి..కర్ణాటక మాజీ సీఎంకు కోర్టు సమన్లు..
x

15న హాజరుకండి..కర్ణాటక మాజీ సీఎంకు కోర్టు సమన్లు..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప కోర్టు సమన్లు ఎందుకు జారీ చేసింది? ఆయన మీదున్న కేసేమిటి?


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప జూలై 15న తమ ఎదుట హాజరుకావాలని బెంగళూరు కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది.

సాయం కోసం యడియూరప్ప ఇంటికి వెళ్లిన సమయంలో తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఆ కేసుపై ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతోంది.

కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు యడియూరప్పపై జూన్ 27న చార్జీషీట్ ఫైల్ చేశారు. ఇదే సమయంలో తనపై నమోదయిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన కర్ణాటక హైకోర్టులో పిటీషన్ వేశారు. దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చిన కోర్టు.. అప్పటిదాకా యడియూరప్పను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించింది. కేసు విచారణకు రెండు వారాలకు వాయిదా వేసింది.

విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు యడియూరప్ప బాధితురాలయిన మైనర్ బాలికకు, ఆమె తల్లికి డబ్బులు ఇచ్చారని, ఈ వ్యవహరంలో ఆయనకు సహకరించిన అరుణ్, రుద్రేష్, మరిస్వామి పేర్లను సీఐడీ తన చార్జీషీట్‌లో పేర్కొంది.

Read More
Next Story