తమిళనాడులో నిజంగానే హెచ్ఐవీ కేసులు పెరుగుతున్నాయా?
x

తమిళనాడులో నిజంగానే హెచ్ఐవీ కేసులు పెరుగుతున్నాయా?

కేసుల సంఖ్య పెరిగిన వాటిని ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపణలు


తమిళనాడులో ఈ మధ్య కాలంలో హెచ్ ఐవీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షా కిట్లు లేకపోవడం, విద్య, వైద్య సంరక్షణకు నిధుల కొరత, మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోవడం వల్ల రాష్ట్రంలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

గత దశాబ్ధ కాలంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ వాటి సంఖ్యను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో హెచ్ ఐవీ సోకిన వారి సంఖ్య 1,57, 908 అని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెబుతున్నారు. వీరిలో 1,41,341 మందికి మాత్రమే కంబైన్డ్ డ్రగ్ థెరపీతో చికిత్స అందిస్తున్నారు.
పెరుగుతున్న సంఖ్యలు..
తమిళనాడు ఎయిడ్స్ నియంత్రణ సంఘం(టీఏఎన్ఎస్ఏసీఎస్), జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం (ఎన్ఏసీపీ), జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(ఎన్ఏసీఓ, న్యాక్ ) మార్గదర్శకాల ప్రకారం.. తమిళనాడులో హెచ్ ఐవీ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
మార్చి 24 నాటికి తమిళనాడు లో 1,32,301 మంది హెచ్ ఐవీ బాధితులు యాంటీరెట్రో వైరల్ థెరపీ(ఏఆర్టీ) పొందుతున్నారు. ఈ సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఆరోగ్య అధికారులు హెచ్ ఐవీ పాజిటివ్ కేసులలో ఎటువంటి పెరుగుదల లేదని చెబుతున్నారు.
కరుణానిధి గోవిందస్వామి నేతృత్వంలోని బాధిత వ్యక్తులచే ఏర్పడిన హెచ్ఐవీ పాజిటివ్ నెట్ వర్క్.. గత దశాబ్ధంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన హెచ్ ఐవీ ఇన్పెక్షన్ల సంఖ్యను దాచిపెట్టిందని ఆరోపించింది. ‘‘ఒక దశాబ్ధం కింద హెచ్ ఐవీ కేసులు దాదాపుగా 2 లక్షలు గా ఉన్నాయి. అయితే ఈ డేటా సరిగా లేదని ఆ సంఖ్యను 1.32 లక్షలకు తగ్గించారు.’’ అని హెచ్ ఐవీ పాజిటివ్ నెట్ వర్క్ వ్యవస్థాపకుడు గోవింద స్వామి ‘ ది ఫెడరల్’ తో అన్నారు.
ఆకస్మిక ఉప్పెన?
‘‘ ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య ఇప్పుడు 1.5 లక్షలుగా ఉండటంతో అకస్మాత్తుగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ పెరుగుదల అంత అకస్మాత్తుగా ఉండకూడదు. డేటా మొత్తం గందరగోళంగా ఉంది. మరింత పారదర్శకత అవసరం. సరిగ్గా విశ్లేషించినట్లయితే హెచ్ ఐవీ ఉన్నవారి సంఖ్య 2 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని గోవింద స్వామి అన్నారు.
టీఎఎన్ఎస్ఏసీఎస్ లో ఒక సీనియర్ అధికారి ఫెడరల్ తో మాట్లాడుతూ.. డేటా ధృవీకరించినట్లు చెప్పారు. సవరించిన డేటాను తరువాత విడుదల చేస్తామని పేర్కోన్నిరు.
అయితే తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి పి. సెంథిల్ కుమార్ ఎటువంటి పెరుగుదల లేదని ఖండించారు. ప్రతి సంవత్సరం సాధారణంగా 8 నుంచి 9 వేల ఉంటుందని చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 1.5 లక్షల మంది ఏఆర్ టీ చికిత్స తీసుకుంటున్నారు. గత ఆరు నెలల డేటాను పరిశీలిస్తే ఈ సంఖ్య కు అదనంగా 4 వేల నుంచి 5 వేల వరకు అదనంగా చేరారు. ఇది సాధారణం అని ఆయన అన్నారు. దీనిపై ఫెడరల్ తమిళనాడులోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ సీతాలక్ష్మీని సంప్రదించింది. కానీ మాట్లాడటానికి నిరాకరించారు.
నివారణ కార్యక్రమాలు..
తమిళనాడు హెచ్ ఐవీ నివారణ, నియంత్రణలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో బాధిత వ్యక్తుల గురించి సరైన సమాచారం అందుబాటులో లేదు. ఇంక హెచ్ ఐవీ పరీక్షా కిట్ ల కొరత, తగినంత మానవ వనరులు, హెచ్ఐవీ సోకిన వివిధ వ్యక్తుల విద్య, పోషక సంరక్షణకు కేటాయించే నిధులు తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎనభై ఎన్జీఓలు అవగాహన కార్యక్రమాల కోసం రూ. 20 కోట్లతో బడ్జెట్ తో పనిచేస్తున్నాయి.
ఈ సంస్థలు స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేసేవారు, సెక్స్ వర్కర్లు, వలస కార్మికులు, లారీ డ్రైవర్లు వంటి వారి లక్ష్యంగా హెచ్ఐవీ నివారణ అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
అలాగే ఎయిడ్స్, టీబీని నివారించడానికి 17 ప్రాధాన్యత గల జిల్లాలలో ఎన్జీవో ల ద్వారా లింక్ వర్కర్స్ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం అవగాహన కల్పించడం, కండోమ్ ల సంఖ్యను పెంచడం, పరీక్షలు, చికిత్సలను ప్రొత్సహించడం, సంరక్షణ మద్దతు సేవలను అందించడం లక్ష్యంగా పనిచేస్తుంది.
రాష్ట్రంలో తిరుచ్చి, ఈరోడ్, కరూర్, మధురై, కోయంబత్తూర్, వెల్లూర్, విల్లుపురం, సేలం, నామక్కల్ జిల్లాలలో కేసులు ఎక్కువగా ఉన్నాయని గోవింద స్వామి అన్నారు. ఇవి హైవేలతో ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నాయని అందువల్ల హెచ్ఐవీ ఎక్కువగా వ్యాప్తి పొందే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
కిట్ల కొరత..
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి టెస్టింగ్ కిట్ల సేకరణలో జాప్యం గురించి ది ఫెడరల్ కొన్ని విషయాలను సేకరించింది. ప్రస్తుతం కిట్లు అధిక ప్రాధాన్యత గల వర్గాలు, జనాభాకు మాత్రమే లక్ష్యంగా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కార్పొరేషన్ ఆస్పత్రులు ఇంటిగ్రేటేడ్ కౌన్సెలింగ్ పరీక్షా కేంద్రాలలో కిట్ల కొరత ఉంది.
‘‘కొరత ఉన్నప్పుడు కిట్ లను సమీప జిల్లాల నుంచి సమీకరిస్తారు. కానీ ప్రమాదంలో ఉండే సాధారణ జనాభాను పరీక్షించడానికి మాకు అదనపు అవసరం. మేము ఈ సమస్యను టీఎఎన్ఎస్ఏసీఎస్ సీనియర్ అధికారులకు తెలియజేసాము’’ అని మధురైలోని టీఎఎన్ఎస్ఏసీఎస్ పరీక్షా కేంద్రం నుంచి ఒక అధికారి తెలిపారు.
వైద్యులు..
అధిక ప్రాబల్యం ఉన్న జిల్లాలలో కూడా అనేక ఈఆర్టీ కేంద్రాలకు మానవ వనరులు అవసరం. ఎయిడ్స్ తో నివసించే వ్యక్తుల నెట్ వర్క్ తమిళనాడు ప్రభుత్వాన్ని పీఎల్ హెచ్ఏ ల కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఏఆర్టీ కేంద్రాలకు ముఖ్యంగా అధిక ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో వైద్యులను నియమించాలని కోరింది.
‘‘రాష్ట్రంలో పదికి పైగా ఏఆర్టీ కేంద్రాలు రెండేళ్లుగా వైద్యులు లేకుండా పనిచేస్తున్నాయి. దీని ఫలితంగా పీఎల్ హెచ్ ఏల తగిన చికిత్స పొందడానికి ఇబ్బంది పడుతున్నాయి’’ అని హెచ్ ఐవీ పాజిటివ్ నెట్ వర్క్ కు చెందిన గోవింద స్వామి అన్నారు. ‘‘ఈ కేంద్రాలకు వైద్యులను నియమించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
అధిక ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ప్రతినెలా దాదాపు 20-25 కొత్త కేసులు బయటపడుతున్నాయి. జోక్యం తక్కువగా ఉండటం వల్ల ప్రాబల్యం పెరిగింది. ఈ కార్యక్రమాలపై సరైన ఫాల్ అప్ లేదు’’ అని ఆయన అన్నారు.
పర్యవేక్షణలో లోపాలు..
‘‘గత కొన్ని సంవత్సరాలుగా అవగాహాన కార్యకలాపాలు తగ్గాయి. హెచ్ఐవీ తో నివసించే వ్యక్తుల కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్ కార్యకలాపాలు జరగడం లేదు’’ అని సౌత్ ఇండియన్ పాజిటివ్ నెట్ వర్క్ వ్యవస్థాపకుడు నూరి సలీమ్ ది ఫెడరల్ తో అన్నారు.
తమిళనాడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యకలాపాల పర్యవేక్షణ, అమలులో లోపాలు ఉన్నాయని ఆమె అన్నారు. ప్రతి సంవత్సరం నాలుగు కార్యనిర్వాహాక కమిటీ సమావేశాలు నిర్వహించేవి.
కానీ గత కొన్ని సంవత్సరాలుగా సమావేశాలు జరగడం లేదని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం 2009 లో హెచ్ ఐవీ వ్యాధి బారి పడిన పిల్లల కోసం రూ. 25 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది.
దీనిని తరువాత టీఎన్ పవర్ ఫైనాన్స్ కార్ప్ లిమిటెడ్ లో జమ చేశారు. దీని నుంచి వచ్చిన వడ్డీ నుంచి ఎయిడ్స్ సోకిన అనాథ, దుర్బర పిల్లలకు పోషకాహర, విద్యా అవసరాలను తీర్చడానిక ఏటా ఆర్థిక సాయం చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తం సరిపోవడం లేదని, నిధులు పెంచాల్సిన అవసరం ఉందని సలీం అన్నారు.
ప్రమాద కారకాలు..
వైఆర్జీ సెంటర్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యూకేషన్ ట్రైనీ మేనేజర్ కే. సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది హెచ్ఐవీ తో జీవిస్తున్నారని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
‘‘ప్రమాద కారకాల తెలిసిన విద్యావంతులు ఉన్నారు. కానీ చాలామంది ఇందుకోసం పిలుపునివ్వడం లేదు. వ్యాప్తి తగ్గినప్పటికీ అవగాహాన, నివారణ చర్యలకు సంబంధించిన కార్యకలాపాలు ప్రజలకు చేరువ కావాలని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఆయన అన్నారు.
ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ ఐవీ నివారణ, అవగాహాన కార్యకలాపాలు క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్నాయని, కౌన్సెలింగ్ కేంద్రాలలో తగినంత మంది ఉన్నారని అనారు. ‘‘ఏదైన అభ్యర్థనలు వస్తే.. ప్రాజెక్ట్ డైరెక్టర్ వాటిని పరిశీలిస్తారు’’ అని ఆయన ‘ది ఫెడరల్’ తో చెప్పారు.
Read More
Next Story