
ఉర్స్ కంటే సిద్ధరామయ్య పరిస్థితులు ప్రతికూలమైనవా?
ఇద్దరు సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారన్న దినేష్ అమిన్ మట్టు
విజయ్ జోన్నహళ్లి
కర్ణాటకను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా దేవరాజ్ ఉర్స్ పేరిట ఉన్న రికార్డును ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెరిపివేశారు. ఇది రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
ఈ విషయానికి సంబంధించి సిద్ధరామయ్య మాజీ సలహదారు దినేశ్ అమీన్ మట్టు ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులు, ఉర్స్ కాలంనాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి తేడా ఉందని చెప్పారు.
సిద్ధరామయ్య కఠిన రాజకీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, కుల గణన వంటి క్లిష్టమైన సామాజిక సర్వేను విజయవంతంగా పూర్తి చేసి ముందుకు సాగుతున్నారని చెప్పారు.
సిద్ధరామయ్య, దేవరాజ్ ఉర్స్ రికార్డు చెరిపేసిన విషయంతో ఎందుకు పోలీకలు తెచ్చారు?
దేవరాజ్ ఉర్స్, సిద్ధరామయ్య మధ్య చాలా పోలీకలు ఉన్నాయి. ఇద్దరూ మైసూర్ ప్రాంతం నుంచి వచ్చారు. ఇద్దరు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారే.
సహజంగానే వారి మధ్య ప్రజలు పోలీకలు తెస్తున్నారు. అయితే వారివి భిన్నమైన రాజకీయ కాలాలకు చెందినవారు. 1983 లో సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలోకి ప్రవేశించే సమయానికి ఉర్స్ మరణించారు.
కాబట్టి ఈ పోలిక వ్యక్తిగతమైనది, సమకాలీనమైనది. ఉర్స్ కాలంలో భూసంస్కరణలు, విద్య, ఉపాధిలో రిజర్వేషన్లను విస్తరించిన హవనూర్ కమిషన్ అమలు- సామాజిక న్యాయం వంటివి ప్రధానంగా చోటు చేసుకున్నాయి.
ఆ రోజుల్లో సామాజిక న్యాయం ఆయుధాలుగా ఉండేవి. లబ్ధిదారులు దళితులు, మైనారిటీలు, ఓబీసీలు. సహజంగానే ఈ కార్యక్రమంలో కర్ణాటకలోని ఒక్కలిగలు, లింగాయత్ వంటి ఆధిపత్య అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా అమలు జరిగాయి.
వ్యతిరేకత ఉన్నప్పటికి ఉర్స్ భూసంస్కరణలు, రిజర్వేషన్ విధానాలను అమలు చేశారు. సిద్ధరామయ్య కూడా వెనకబడిన తరగతులకు సాధికారిత కల్పించారు. అందుకే ఉర్స్ రికార్డు బద్దలు కొట్టిన తరువాత ప్రజలు ఈ పోలిక మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నారు.
దేవరాజ్ కంటే సిద్ధరామయ్య రాజకీయ కాలం కఠినమైనది? ఎందుకు?
నేడు సిద్ధరామయ్య ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా భిన్నమైనవి. చాలా సంక్లిష్టమైనవి. ఒక ప్రధాన వ్యత్యాసం మతత్వం. ఉర్స్ అప్పుడు ఎక్కువ మత రాజకీయాలను ఎదుర్కోలేదు.
నేడు మత రాజకీయాలు ఒక ఆధిపత్య శక్తిగా, ప్రధాన అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా కుల గణన నివేదికకు ఆధిపత్య కులాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున కర్ణాటకలో కుల గణన ఆధిపత్య కులాలు సులభంగా అంగీకరించలేరు.
ఉర్స్ కాలంలో ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న లింగాయత్ రాజకీయ, సామాజిక నాయకులు కూడా చివరికి భూసంస్కరణలు, రిజర్వేషన్లను అంగీకరించారు.
ఈ వర్గాల వ్యతిరేకత కారణంగా ఉర్స్ అధికారాన్ని కోల్పోలేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వంతో విబేధాల కారణంగా ఆయన అధికారాన్ని కోల్పోయారు. అప్పుడు బ్యూరోక్రసి కూడా భిన్నంగా ఉండేది.
తన కార్యక్రమాలను అమలు చేయడంలో విజయం సాధించాడు. ఆయన వద్ద మంచి అధికారుల బృందం ఉండేది. నేడు ఆ రకమైన పరిపాలనా బలం లేదు. ప్రజా జీవితంలో, రాజకీయాలలో క్షీణత ఉంది. ఇది పాలనకు పెద్ద సవాల్
కేంద్రం నుంచి ఉర్స్ పాలనకు మద్దతు లభించింది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడూ ఆమె జాతీయ కార్యక్రమాలు ముఖ్యమైనవి ఏంటంటే.. బ్యాంకుల జాతీయం, 25 పాయింట్ల కార్యక్రమం, గరీబీ హటావో వంటి నినాదాలు పేదలు, అణగారిన వర్గాల వారికి అనుకూలంగా ఉండేవి.
ఈ కార్యక్రమాలు కర్ణాటకలో ఉర్స్ పాలనకు అనుకూలంగా మారాయి. హై కమాండ్ మద్దతుతో సంస్కరణలను సజావుగా అమలు చేయడానికి అతనికి వీలు కల్పించాయి. సిద్ధరామయ్యకు ఇది విరుద్దంగా ఉంది.
2013 లో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పదవిలోకి వచ్చారు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చారు. తరువాత రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందలేదు. ఉదాహరణకు కర్ణాటక కు ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి 15 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయి.
సిద్ధరామయ్య సీఎంగా రికార్డు బ్రేక్ చేయడం రాజకీయంగా ఎందుకు ముఖ్యమైనది?
నేడు సిద్ధరామయ్యను దేవరాజ్ ఉర్స్ తో పోల్చడానికి ప్రధాన కారణం కుల గణన నివేదిక. సిద్ధరామయ్య కుల గణన నివేదికను అంగీకరించి దాని సిఫార్సులను అమలు చేస్తారనే బలమైన నమ్మకం ఉంది.
సిద్దరామయ్యకు ఇది జీవితకాలంలో లభించే అవకాశంగా మారింది. ఆయన కులగణనను అమలు చేయడంలో విజయం సాధిస్తే భూ సంస్కరణలు, రిజర్వేషన్లు సామాజిక న్యాయం మునపటి దశలను పూర్తి చేయించినట్లే.
కుల గణన నివేదిక తాను అంగీకరించానని, అత్యంత వెనకబడిన, అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధానాలకు కట్టుబడి ఉన్నానని ఆయన గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఆయన అలా చేయడంలో విఫలమైతే కళంకం అలాగే ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం.. నేడు ఆయన ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్.
కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి చర్చ కొనసాగుతున్నందున ఈ క్షణం కూడా నిర్ణయాత్మకమైనది. ఈ తరుణంలో సిద్ధరామయ్యను తొలగిస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది.
ఇటీవల రాహుల్ గాంధీ స్వయంగా కాంగ్రెస్ ఓబీసీ ఆందోళనలను తగినంతగా పరిష్కరించలేదని అంగీకరించారు. ఢిల్లీలో జరిగిన ఓబీసీ సమావేశంలో సిద్ధరామయ్య వంటి ఓబీసీ సీఎంలనను పార్టీ తయారు చేయాలని ఆయన బహిరంగంగా అన్నారు.
ఈ పరిణామాలన్నీ సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉన్నాయి. దేవరాజ్ ఉర్స్ రికార్డును ఆయన బద్దలుకొట్టడంతో ఉర్స్ విధానాలు, సామాజిక న్యాయ రాజకీయాల గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. ఈ వారసత్వం, సిద్ధరామయ్య రాజకీయ స్థానాన్ని బలపరుస్తుంది. అధికారం, విశ్వసనీయతను నిలుపుకోవడంలో సహయపడుతుంది.
Next Story

