
తమిళనాడు రాజకీయ నాయకులు
కాంగ్రెస్- టీవీకే కలయికను చూడబోతున్నామా?
కామరాజ్ పై డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై తమిళనాడులో రగడ
మహాలింగం పొన్నుస్వామి
కాంగ్రెస్ నాయకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజ్ పై డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
జూలై 15న చెన్నైలోని పెరంబూర్ లో జరిగిన బహిరంగ సభలో శివ మాట్లాడారు. కామరాజ్ అలెర్జీ కారణంగా ఏసీ గదులు అవసరమయ్యాయని, తాను చనిపోయే ముందు డీఎంకే అధినేత ఎం కరుణానిధిని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరాడని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు కూటమి స్థిరత్వానికి ముప్పు కలిగించే అవకాశం కనిపిస్తుంది.
తమిళనాడు కాంగ్రెస్ కమిటీ(టీఎన్సీసీ) అధ్యక్షుడు కే. సెల్వ పెరుంతగై మాట్లాడుతూ.. కరూర్ ఎంపీ ఎస్. జోతిమణి, పార్టీ ప్రతినిధి తిరుచ్చి వేలుస్వామి లు.. శివ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన కామరాజ్ వారసత్వాన్ని వక్రీకరించారని ఆరోపించారు.
‘‘కామరాజ్ ను విమర్శించడానికి ఎవరికీ అర్హత లేదు. శివ వాదనలకు ఆధారాలు లేవు’’ అని సెల్వ పెరుంతగై అన్నారు. కామరాజ్ సరళతను నొక్కి చెబుతూ ఎయిర్ కండిషనింగ్ వాదనను జోతిమణి తోసిపుచ్చారు.
కామరాజ్ తన ప్రయాణాల సమయంలో ప్రభుత్వ అతిథి గృహాలలో బస చేశాడని, చెట్ల కింద పడుకునేవాడని ఇటువంటి వ్యాఖ్యలు చేసి డీఎంకే కామరాజ్ ను కించపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం కాంగ్రెస్ లో డీఎంకేతో పొత్తు పున: పరిశీలించుకోవాలనే పిలుపులకు ఆజ్యం పోసింది. మనపరైలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు తిరుచ్చి వేలుస్వామి మాట్లాడుతూ.. 2026 తరువాత తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఇది పార్టీలో వచ్చిన వైఖరిని తెలియజేస్తుంది.
‘‘మేము సాధువులం కాదు. అధికారాన్ని సాధించడమే మా ఉద్దేశం’’ అని వేలుస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పొత్తులను అన్వేషిస్తుందని సూచించారు.
బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై కూడా దీనిపై స్పందించారు. ‘‘డీఎంకేకు కామరాజ్ గురించి మాట్లాడే హక్కులేదు. కామరాజ్ వారసత్వాన్ని మించి తమిళనాడులో కాంగ్రెస్ కు గుర్తింపు లేదు. ఆయనను అవమానించే సంకీర్ణంలో ఎందుకు ఉండాలి’’? అని అన్నారు.
ఈ వివాదాన్ని చల్లార్చడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రయత్నించారు. రెండు పార్టీల మధ్య ఐక్యతను కోరుకుంటున్నాని ఓ ప్రకటన విడుదల చేశారు. పెరియార్ కామరాజ్ నిజమైన తమిళుడు అని ప్రశంసించారు.
సీఎన్ అన్నాదురై ఎన్నికల్లో ఆయనను వ్యతిరేకించలేదని కరుణానిధి చెన్నై విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ కు ఆయన పేరు పెట్టడం ద్వారా ఆయనను గౌరవించారని చెప్పారు. ఆయన పుట్టిన రోజును విద్యా అభివృద్ది దినోత్సవంగా ప్రకటించారని పేర్కొన్నారు.
అనవసరమైన వివాదాలను నివారించాలని, కామరాజ్ సామాజిక న్యాయం, సామరస్యం అనే దార్శనికతను నెరవేర్చడానికి మనమంతా కలిసి పనిచేయాలని స్టాలిన్ పిలుపునిచ్చాడు.
ప్రస్తుత వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రయత్నిస్తున్నడని సమాచారం. 2026 ఎన్నికల పొత్తుపై చర్చించడానికి విజయ్ ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలవాలని యోచిస్తున్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
కామరాజ్ ను సైద్దాంతిక చిహ్నాలలో ఒకరిగా ప్రకటించిన టీవీకే కలవాలని డీఎంకే తీరుతో విసుగు చెందిన కొంతమంది తమిళనాడు కాంగ్రెస్ నాయకులు ఈ చర్చలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్- టీవీకే కూటమి తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగలదని, బలమైన సంకీర్ణాలను కోరుకుంటున్న డీఎండీకే, పీఎంకే వంటి చిన్న పార్టీలను ఆకర్షించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇప్పటికే డీఎంకే, బీజేపీలతో పొత్తులను తోసిపుచ్చింది.
అయితే డీఎంకే తన కూటమి మిత్రులను నిలుపుకోవడంలో నమ్మకంగా ఉందది. 2019 నుంచి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలతో ఆయన పొత్తు నడుపుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో గణనీయమైన విజయం సాధించారు. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ కనిమొళి వంటి డీఎంకే నాయకులు వీటన్నింటిని తోసిపుచ్చుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా డీఎంకేదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ సావిత్రి కన్నన్ ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. కామరాజ్ పై తిరుచ్చి శివ వ్యాఖ్యలను కాంగ్రెస్, టీవీకేతో బేరసారాలు ఆడటానికి, తన బలోపేతానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
జాతీయ స్థాయిలో ముఖ్యంగా ‘ఇండి’ బ్లాక్ లో డీఎంకే అవసరం కాంగ్రెస్ ఉందని, ఆ కూటమి విచ్చిన్నం కావడం అసంభవమని కన్నన్ చెప్పారు. రెండు పార్టీలకు ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నప్పటికీ డీఎంకే, కాంగ్రెస్ తమ విబేధాలను పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాయని, వారి సంకీర్ణ బలాన్ని కొనసాగించడానికి కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.
2026 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ డీఎంకే- కాంగ్రెస్ కూటమి ఒక క్లిష్టమైన పరీక్షను ఎదుర్కొంటుంది. కామరాజ్ వివాదం ఉద్రిక్తతలను బహిర్గతం చేయడమే కాకుండా తమిళనాడు రాజకీయాలలో సంభావ్య పున:సమీకరణకు వేదిక కూడా ఏర్పాటు చేసింది.
విజయ్ టీవీకే కీలక సూత్రధారిగా ఉద్భవించింది. టీవీకే తో కొత్త సంకీర్ణాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ డీఎంకే నుంచి విడిపోతుందో లేదో చూడాలి, కానీ పరిణామాలు రాబోయే ఎన్నికల యుద్దానికి సంకేతంగా ఉన్నాయి.
Next Story