టీవీకే తీర్మానాలన్నీ కొత్త బాటను సూచించడం లేదా?
x

టీవీకే తీర్మానాలన్నీ కొత్త బాటను సూచించడం లేదా?

తమిళనాడు లో కొత్త రాజకీయ పార్టీ స్థాపించి తొలిసారిగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్, తన పార్టీ సిద్దాంతాలను ప్రకటించారు. అయితే ఇవన్నీ కూడా ఇంతకుముందు..


తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడిగా పేరున్న దళపతి విజయ్, ఆదివారం చెన్నై సమీపంలోని విక్రవాండీలో భారీ రాజకీయ సభను నిర్వహించారు. ఇది సభ అనే కంటే తన అభిమానులతో కూడిన బలప్రదర్శన అని చెప్పవచ్చు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో తాను మరో రాజకీయ పోటీదారుడినని ప్రకటించే ప్రయత్నం చేశారు.

తమిళనాడు అసెంబ్లీకి 2026 లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి తానే ప్రధాన పోటీదారుడిగా మారబోతున్నామని సవాల్ విసిరాడనే అనుకోవాలి. అదే సమయంలో బీజేపీని సైద్ధాంతిక విభేదిస్తున్నట్లు కనిపించారు. ద్రావిడ పార్టీల "లౌకిక, సామ్యవాద, సామాజిక న్యాయం" సాధిస్తానని ప్రకటించాడు.
హిట్‌లు - మిస్‌లు
అయితే, డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఉండగల కొత్త ఎజెండాను ఆయన రూపొందించలేకపోయారు. ద్రావిడ అడుగుల్లోనే తన పార్టీని స్థాపించినప్పుడు కూడా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద్రవిడర్ కజగం వ్యవస్థాపకుడు పెరియార్ ఇవి రామస్వామి, దివంగత కాంగ్రెస్ దిగ్గజం కె కామరాజ్‌ల పంథాలో దూసుకుపోతున్నట్లు చెప్పుకున్నారు. డిఎంకె పాలనలో రాష్ట్రం అవినీతి మయం అయిందని ఆరోపించారు. ఓ కుటుంబ పాలన రాష్ట్రాన్ని దోచుకోవడంపైనే దృష్టిపెట్టిందని ఆరోపించారు.
సమావేశంలో ఆయన ఏఐడీఎంకే, బీజేపీ గురించి ఏమి విమర్శలు చేయలేదు. అయినప్పటికి లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నాడని వెల్లడించే ప్రయత్నం చేశాడు. విభజన రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించి పరోక్షంగా బీజేపీకి చురకలు వేసే ప్రయత్నం చేశాడు.
ద్రావిడ నమూనా
ద్రావిడ పార్టీలు ఆమోదించిన రెండు భాషల ఫార్ములాకు అనుకూలంగా పార్టీ తీర్మానాలు, కుల ప్రాతిపదికన జనాభా గణన (జనాభా ప్రకారం దామాషా ప్రాతినిధ్యానికి ఒక రైడర్‌తో), సామాజిక న్యాయం, గవర్నర్‌ల పదవిని తొలగించాలనే పిలుపు, ఇవన్నీ కూడా ద్రావిడ వాద నమూనాలు. వాటినే రాష్ట్రంలో చాలాకాలంగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా విజయ్ పాత సిద్ధాంతాలనే ప్రకటించారు.
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వంలో "అధికారంలో భాగస్వామ్యం" కల్పిస్తామని హామీ ఇస్తూనే, తమ ఫ్రంట్‌లో చేరాలనుకునే పార్టీలను కూడా అందులో చేర్చుకుంటామని ఆయన ప్రసంగం చివరలో కీలక వ్యాఖ్యలు చేశారు.
సంకీర్ణ రాజకీయాలు
వీసీకే, కాంగ్రెస్‌ వంటి పార్టీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని VCK ఇటీవల ప్రభుత్వంలో వాటా కోరింది, ఇది దాని సంకీర్ణ భాగస్వామి డిఎంకెను చాలా విసిగించింది. గతంలో కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఇదే డిమాండ్ చేసినా అప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే దానిని తిరస్కరించింది.
డీఎంకే నేతృత్వంలోని కూటమిలోని పార్టీలకు విజయ్ క్యారెట్ పట్టుకోవడం గమనించాల్సిన విషయం. విజయ్ పార్టీగా విజయం సాధించాలంటే డీఎంకే నేతృత్వంలోని బలీయమైన కూటమిని విచ్ఛిన్నం చేయడం తప్పనిసరి. అయితే, ప్రస్తుతానికి, డిఎంకె మిత్రపక్షాలు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు గట్టిగా మద్ధతునిస్తున్నాయి. ప్రధానంగా వారు జాతీయ- రాష్ట్ర స్థాయిలో ఇండి కూటమిలో అంతర్భాగంగా ఉన్నారు. అలాగే బిజెపిని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు.
విజయ్ vs ఉదయనిధి
అన్నాడీఎంకే ఆశలు కూడా డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చీలికపైనే ఆధారపడి ఉన్నాయి. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) అన్నాడీఎంకేను అధిగమించి డీఎంకేకు ప్రధాన సవాలుగా నిలుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇదే జరిగితే, తదుపరి పోటీ విజయ్, ఉప ముఖ్యమంత్రి, ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మధ్యే ఉంటుంది.
ఈ అంచనా నిజమైతే తమిళనాడులో తదుపరి రాజకీయ యుద్ధం ప్రధానంగా ఉదయనిధి స్టాలిన్, విజయ్ మధ్యే ఉండవచ్చు. జయలలిత మరణం తరువాత ఏఐడీఎంకేకు ప్రజాదరణ కలిగిన ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ ప్రభావం తగ్గిపోవచ్చు.
విజయ్‌కి పెద్ద సవాలు
విజయ్ పార్టీ ఎవరి ఓట్లకు కోత పెడుతుందనేది ముఖ్యమైన ప్రశ్న. డిఎంకె తన "రాజకీయ శత్రువు" అని విజయ్ ఎత్తి చూపడంతో డిఎంకె వ్యతిరేక ఓట్లు చీలిపోవచ్చు. అన్నాడీఎంకే డీఎంకే వ్యతిరేక ఓట్లలో ఎక్కువ భాగం సాధించాలనే లక్ష్యంతో ఉంటే, విజయ్ ప్రవేశం ఏఐఏడీఎంకేకు తీవ్ర నష్టం కలుగజేస్తుందనడంలో సందేహం లేదు. ఆ సందర్భంలో, డిఎంకె వ్యతిరేక ఓటు చీలితే తిరిగి ఆ పార్టీనే అధికారంలోకి రావచ్చు.
రాజకీయ రంగంలో మనుగడ కోసం పోరాడుతున్న విజయ్ చిన్న పార్టీలకు చేరువయ్యారు. ఇప్పుడు నటుడు విజయ్ రూపంలో 'ఓటు సేకరించే యంత్రం' అందుబాటులోకి రావడంతో, ఈ పార్టీలు అతడిని తమ నాయకుడిగా ప్రకటించుకోవచ్చు.
ఇంతలో, విజయ్ తన సినీ అభిమానుల సంఘాన్ని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చడం ఈ సూపర్ స్టార్-రాజకీయవేత్త ముందు ఉన్న అతి పెద్ద సవాలు. అది పూల పాన్పు కాదు. ప్రస్తుతం, అతనికి మార్గనిర్దేశం చేయడానికి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు కూడా లేరు. అటువంటి రాజకీయ చతురత, ఆయనకు థింక్-ట్యాంక్‌గా ఉండే నిపుణులను ఆకర్షించడంలో పార్టీ భవిష్యత్తు ఉంది.
Read More
Next Story