మహిళా కిడ్నాప్ యత్నం.. వేగంగా స్పందించిన బెంగళూర్ పోలీసులు
x

మహిళా కిడ్నాప్ యత్నం.. వేగంగా స్పందించిన బెంగళూర్ పోలీసులు

బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ మహిళను కిడ్నాప్ చేయడానికి క్యాబ్ డ్రైవర్ విఫలయత్నం చేశాడు. కానీ బాధితురాలు తెలివిగా వ్యవహరించి పోలీసులకు సమాచారం..


బెంగళూర్ విమానాశ్రయం నుంచి ఓ మహిళ కిడ్నాప్ కు విఫలయత్నం జరిగింది. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన ఓ మహిళ ఓలా రైడ్ క్యాబ్ గా భావించి అందులోకి ఎక్కింది. తరువాత క్యాబ్ డ్రైవర్ వెకిలీ చేష్టలతో తన నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు తెలివిగా వ్యవహరించి పోలీసులకు సమాచారం అందించింది.

ఈ విషయంపై బాధితురాలు సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో వివరాలు పోస్టు చేసింది. @doctorniikii అనే వినియోగదారు పేరుతో ఉన్న మహిళ ఇలా ట్వీట్ చేసింది. “ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓలా పికప్ స్టేషన్ లో ఓ క్యాబ్ డ్రైవర్ అక్రమ రవాణా, అత్యాచారం, దోపిదీ జరిగింది. నేను 112కి కాల్ చేయకుంటే, నేను ఈ మెసెజ్ టైపు చేయలేకపోయే దానిని." అని పోస్టు చేసింది.
నిబంధనలు ఉన్నా..
" బహుశా అతను అదనపు డబ్బుల కోసం మాత్రమే ఇవన్నీ చేసి ఉండవచ్చు, లేదా వేరే ఉద్దేశాలు ఉండవచ్చు, బహుశా అతను మత్తులో ఉండవచ్చు, నాకు తెలియదు," ఆమె అన్నారు. శుక్రవారం రాత్రి 10.30 గంటలకు విమానాశ్రయంలోని పికప్ స్టేషన్‌లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు ఆ మహిళ తెలిపింది. అయితే, ఆమెకు కేటాయించని డ్రైవర్, ఆమె వద్దకు వచ్చి ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు. ఆమె ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నప్పటికీ డ్రైవర్ OTPని అడగలేదని తెలిపింది. తన అధికారిక యాప్ సరిగా పనిచేయడం లేదని నిందితుడు పేర్కొంటూ, తన మ్యాప్స్ యాప్‌లో ఆమె గమ్యస్థానాన్ని నమోదు చేయమని కోరాడు.

విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లిన తరువాత, డ్రైవర్ అదనపు ఛార్జీని డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో, అసలు ఛార్జీల కోసం ఆమెను వేరే కారుకు మారమని బెదిరించాడు. దీనికి బాధితురాలు తిరిగి విమానాశ్రయానికి తీసుకెళ్లాలని కోరింది. కానీ నిందితుడు ఆమె కోరికను మన్నించకుండా పెట్రోల్ బంకు వైపు తీసుకెళ్లాడు. అక్కడ రూ. 500 డిమాండ్ చేశాడు.
వేగంగా స్పందించిన పోలీసులు..
ఈ సందర్భంగా మహిళా, నిందితుడితో ప్రశాంతంగా ఉంటూ తన బాయ్ ఫ్రెండ్ తో టచ్ లో ఉంటూ విషయం వివరించింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. తరువాత పోలీసులకు సమాచారం అందించిందని తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ వెంటనే బాధితురాలిని విమానాశ్రయం వద్ద డ్రాప్ చేయాలని భావించాడు.
పోలీసులు వేగంగా స్పందించి, 20 నిమిషాల్లో ఓలా పికప్ స్టాండ్‌కు చేరుకుని, డ్రైవర్‌ను బసవరాజ్‌గా గుర్తించారు. ‘‘ నేను మధ్యరాత్రి 11 గంటలకు ఈ గండం నుంచి బయటపడటానికి తగినంత అదృష్ణవంతురాలిని’’ ఆమె చెప్పింది.
ఈ సంఘటన విమానాశ్రయ భద్రత, రైడ్-హెయిలింగ్ భద్రతా ప్రోటోకాల్‌ల గురించి ఆందోళనలకు దారితీసింది. ఒక ఎక్స్ వినియోగదారు.. "ఇది చాలా భయానకంగా ఉంది, మీ ఫిర్యాదు లేఖను చదువుతున్నప్పుడు నాకు గూస్‌బంప్‌లు వచ్చాయి." అన్నాడు.
మరొక వినియోగదారుడు.. “ మీరు ఇప్పుడు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను, కొన్ని నెలల క్రితం ఇదే నాకు సరిగ్గా జరిగింది. నేను క్యాబ్‌లో వచ్చినట్లు యాప్‌లో కనిపించకపోవడంతో నేను బయటకు వచ్చాను.” ఇంకొకరు అన్నారు. “@BLRAirport ప్రయాణీకుల భద్రతను నిర్ధారించాలి. విమానాశ్రయం నగరానికి దూరంగా ఉంది. ఇది ఇలాంటి ఘటనలకు కారణం కావచ్చు. ” అని సామాజిక మాధ్యమంలో పోస్టుచేశారు.


Read More
Next Story