బెంగళూర్ వాటర్ క్రైసిస్: కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
x

బెంగళూర్ వాటర్ క్రైసిస్: కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

బెంగళూర్ లో రోజు రోజుకు పెరుగుతున్న నీటి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రకటించింది. ఇక నుంచి రీ సైకిల్ చేసిన నీటిని ..


బెంగళూర్ లో నీటి కొరత తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం బొర్ వెల్స్ వేయకుండా, రీ సైకిల్ చేసిన నీటి వనరులను వినియోగించడానికి ప్రజలు సిద్దంగా ఉండాలంది. నీటి కష్టాలు తిరిగి పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయా చర్యలు, పరిమితులు ప్రవేశపెట్టినట్లు బెంగుళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB)అధికారులు తెలిపారు.

కర్ణాటక స్టేట్ వాటర్ పాలసీ 2022లో చేసిన సిఫార్సులలో ఇవన్నీ భాగంగా ఉన్నాయి. వీటినే ఇప్పుడు కఠినంగా అమలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
“మొదట్లో పాలసీ లో భాగంగా ఈ నియమాలు, సూచనలను అమలు చేయడానికి మేము వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించాము. అయితే, కొన్ని పరిమితుల కారణంగా వాటిలో చాలా వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయలేకపోయాయి. ఇప్పుడు ఈ ప్రక్రియ ఊపందుకుంది, మేము దానిని కొనసాగించగలగాలి, ”అని జలవనరుల శాఖకు చెందిన సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఒక జాతీయ మీడియా వార్తను ప్రచురించింది.
రీసైకిల్ నీటి సరఫరా
కర్నాటక ఈసారి ఎంతో ఆశలు పెట్టుకున్న ఈశాన్య రుతుపవనాలు మొహం చాటేశాయి. దాంతో నీటికి కటకట ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఛాయలు ఏర్పాడ్డాయి. గుక్కెడు నీటి కోసం కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారు. భూగర్భజలాలతో పాటు సరస్సులు, రిజర్వాయర్‌లు పూర్తిగా రీఛార్జ్ కాలేకపోయాయి.
ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు బోర్‌వెల్‌లపై ఆధారపడటాన్ని తగ్గించాలని BWSSB నిర్ణయించింది. ఇందుకోసం రీసైకిల్ చేసిన నీటిని సరఫరా చేయడం ప్రారంభించింది. దీనికి సహాయం చేయడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), బెంగుళూరు అపార్ట్‌మెంట్స్ ఫెడరేషన్ (బిఎఎఫ్)తో బోర్డు చర్చలు జరుపుతోందని పేర్కొంది. కొన్ని నివేదికల ప్రకారం, ఇప్పటికే 62 లక్షల లీటర్ల రీసైకిల్ వాటర్ కోసం ఆర్డర్లు వచ్చాయి. భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రాజెక్ట్ కి థర్డ్-పార్టీ సర్టిఫికేషన్ కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)తో కలిసి పనిచేసిన BWSSB, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు తమ రీసైకిల్ చేసిన నీటిలో 50 శాతం విక్రయించడానికి అనుమతించింది. బెంగళూరులోని కొన్ని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు ఇప్పటికే శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్‌కు ₹100 నుంచి ₹125లకు విక్రయించడం ప్రారంభించాయని తెలుస్తోంది. అలాగే మురుగునీటి శుద్ధి కర్మాగారాల నుంచి 500 మీటర్ల వ్యాసార్థంలో నిర్మాణ ప్రాంతాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి పైప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలని బోర్డు యోచిస్తోంది.
నెలకు 40 లక్షల లీటర్ల..
BWSSB నీటి వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. మంగళవారం ఒక ఉత్తర్వూలో, నెలకు 40 లక్షల లీటర్లకు పైగా నీటిని ఉపయోగించే వినియోగదారులకు ఏప్రిల్ 10 నుంచి వారి నీటి సరఫరాలో 10 శాతం కోతను ఎదుర్కొంటారు. నిబంధనలకు కట్టుబడి ఉన్నవారికి 'గ్రీన్-స్టార్ రేటింగ్' ఇస్తారు.
బల్క్ వినియోగదారులతో జరిగిన సమావేశంలో నిబంధనలను ప్రకటించిన BWSSB ఛైర్మన్ రాంప్రసాత్ మనోహర్.. నీటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు పాయింట్ల వ్యూహాన్ని కూడా వెల్లడించారు. అవి
నీటి పొదుపు పద్ధతులను అవలంబించడం
శుద్ధి చేసిన నీటి గరిష్ట వినియోగం
బోర్‌వెల్ డ్రిల్లింగ్ కోసం సాంకేతికతను ఉపయోగించుకోవడం
వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను సరిగా వాడుకోవడం
ప్రజలలో అవగాహన పెంపొందించడం
Read More
Next Story