బెంగళూరు టు లండన్‌ గాట్విక్‌కు నాన్‌స్టాఫ్ ఫ్లైట్..
x

బెంగళూరు టు లండన్‌ గాట్విక్‌కు నాన్‌స్టాఫ్ ఫ్లైట్..

వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి బెంగుళూరు టు లండన్‌లోని గాట్విక్‌ ఫ్లైట్ సర్వీసు దోహదపడుతుందని BIAL ఆఫీసర్ సత్యకి రఘునాథ్ తెలిపారు.


విమాన ప్రయాణికులకు ఇది శుభవార్తే. బెంగుళూరు నుంచి నేరుగా లండన్‌లోని గాట్విక్ సిటికీ వెళ్లే ప్రయాణికులకు కోసం ఆగస్టు 18 నుంచి వారంలో ఐదురోజుల పాటు నాన్-స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ ( BIAL) ఒక ప్రకటనలో తెలిపింది.

"లండన్‌లోని రెండు అతిపెద్ద విమానాశ్రయాలు - హీత్రో, గాట్విక్‌ నగరాలతో నేరుగా కనెక్టివిటీని ఉన్న మొదటి భారతీయ నగరం బెంగళూరు. ఇది భారత్ యూకే మధ్య బలమైన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది" అని BIAL పేర్కొంది.

ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాలను ఈ మార్గంలో నడుపుతుంది, ఇందులో బిజినెస్ క్లాస్‌లో 18 ఫ్లాట్ బెడ్‌లు, ఎకానమీలో 238 విశాలమైన సీట్లు ఉంటాయి. కొత్త సర్వీస్ బెంగళూరు, లండన్ మధ్య ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలదని భావిస్తున్నారు.

"ఈ కొత్త రూట్ వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఉపయోగపడుతుంది.’’ అని BIAL చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సత్యకి రఘునాథ్ తెలిపారు.

Read More
Next Story