
జైలులో ఫోన్ మాట్లాడుతున్న నిందితుడు
బెంగళూర్: సెంట్రల్ జైలులో ఉగ్రవాదులకు టచ్ ఫోన్లు
రేపిస్ట్, బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్ కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న పోలీసులు
బెంగళూర్ పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలు లో ఉన్న నిందితులు, హంతకులు, ఉగ్రవాదులు సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్న వీడియోలు బయటకు రావడం తీవ్ర కలకలం రేగింది. ఐసిస్ రిక్రూటర్, సీరియల్ రేపిస్ట్, హంతకుడు సహ అనేక మంది నేరస్థులు స్వేచ్ఛగా సెల్ ఫోన్ వినియోగించారు. ఈ దృశ్యాలు మొత్తం ఓ టీవీలో ప్రసారం అయ్యాయి.
ఒక వీడియోలో ఐఎస్ఐఎస్ కోసం రిక్రూట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న జుహైద్ హమీద్ షకీల్ మన్నా ఫోన్ వాడుతున్నట్లు టీవీలో ప్రసారం అయింది. ఆ క్లిప్ లో అతడు టీ తాగుతూ ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.
ఫోన్లు, ప్రత్యేక హక్కులు
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రకారం మన్నా అతని సహచరులతో కలిసి ఖురాన్ సర్కిల్ గ్రూప్ ద్వారా నిధులు సేకరించి స్థానిక ముస్లిం యువకులను మతఛాందసవాదులుగా, ఉగ్రవాదులుగా మార్చాడు. అలాగే ఐఎస్ఎస్ లో చేరడానికి టర్కీ ద్వారా సిరియాకు పంపడానికి ప్రయత్నించాడు.
‘‘జుహైబ్ మన్నా తన పరిచయాలను ఉపయోగించి సిరియాలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలను చిత్రీకరించే వీడియోలను చూపించడం ద్వారా అనేక మంది ముస్లిం యువతను ప్రేరేపించి తీవ్రవాదం చేరేలా ప్రొత్సహించాడు’’ అని ఎన్ఐఏ పేర్కొంది.
లైంగిక నేరాలు, అత్యాచారాలు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న దోషి ఉమేష్ రెడ్డి జైలు లోపల ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు ఓ క్లిప్ కూడా బయటకు వచ్చింది.
అతని బారక్ లోపల ప్రత్యేకంగా టెలివిజన్ కూడా అమర్చారు. సినీ నటీ మాజీ డీజీపీ కూతురు అయిన రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. ఈ కేసులో తరుణ్ రాజ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఈ నిందితుడికి సంబంధించిన ఫోటోలు కూడా బయటపడ్డాయి. వాటిలో అతను జైలు లోపల మొబైల్ ఫోన్ ఉపయోగించి వంట చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అంతర్గత విచారణ
ఇటీవల సోషల్ మీడియాలో కనిపించిన తేదీ లేని వీడియోలు తీవ్రమైన భద్రతా సమస్యలను రేకెత్తించింది. ఫుటేజ్ ప్రామాణికతను ధృవీకరించడానికి, జైలు అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. ‘‘దర్యాప్తు ఫలితంగా ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాము’’ అని అధికారులు తెలిపారు.
ఇదే మొదటిది కాదు..
అనేక మంది హై రిస్క్ ఖైదీలను ఉంచే పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు పరిశీలనలోకి రావడం ఇదే మొదటి సారి కాదు. అక్టోబర్ లో గుబ్బాచి సీన అని కూడా పిలవబడే పేరు మోసిన రౌడీ షీటర్ శ్రీనివాస్ జైలు లోపల తన పుట్టిన రోజు జరపుకుంటున్న వీడియో వైరల్ అయింది.
హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్, ఇతర ఖైదీలతో కలిసి కేక్ కట్ చేసి ఆపిల్ దండ ధరించి కనిపించాడు. మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయబడి, తరువాత సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
ఈ క్లిప్ లు, ఫోటోలు, జైలు, వ్యవస్థలోని భద్రతా లోపాలు, పర్యవేక్షణ జవాబుదారీతనం గురించి మరోసారి ఆందోళనలు తలెత్తాయి. గత సంవత్సరం రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప జైలులో ప్రాధాన్యత పొందుతున్నట్లు కనిపించే ఫొటో కూడా బయటపడింది. ఈ చిత్రంలో దర్శన్ కుర్చీ పై కూర్చుని సిగరేట్, కాఫీ పట్టుకుని, రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగతో సహ తోటీ ఖైదీలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
Next Story

