కాంగ్రెస్ పై ‘ట్యాక్స్ చోరీ’ ఆరోపణలు గుప్పించిన బీజేపీ
x
కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అర్. అశోక

కాంగ్రెస్ పై ‘ట్యాక్స్ చోరీ’ ఆరోపణలు గుప్పించిన బీజేపీ

ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని విమర్శలు


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే కేంద్రం, ఎన్నికల సంఘంపై చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణలను స్ఫూర్తిగా తీసుకున్న బీజేపీ, సిద్దరామయ్య ప్రభుత్వం ‘టాక్స్ చోరి’ విమర్శలకు దిగింది.

కర్ణాటక ప్రజలకు సరైన వసతులు కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని కాషాయ పార్టీ ఆరోపించింది. ఈ విమర్శలకు కేంద్రంగా ఓ పౌర సంస్థ రాసిన లేఖను ఉపయోగించుకుంది.

టాక్స్ చోరీ..
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుచోరికి పాల్పడుతోందని ప్రతిపక్ష నేత ఆర్. అశోక విమర్శలు గుప్పించారు. బెంగళూర్ దాని చుట్టు పక్కల ప్రాంతాలలో మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని, సాకులు, బెదిరింపులు కాదని అన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గ్రేటర్ బెంగళూర్ అథారిటీ(జీబీఏ) నివాసితుల నుంచి ఆస్తి పన్ను వసూలు చేయవద్దని ఆదేశించాలని కోరుతూ ఓ పౌర వేదిక రాసిన లేఖను అశోక ప్రస్తావించారు.
వారు నివసిస్తున్న ప్రాంతంలో పన్నులు వసూలు చేస్తున్నారు కానీ ఎలాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ది పరచడం లేదని లేఖ లో పౌర వేదిక ఆరోపించిన విషయాన్ని ఆయన హైలైట్ చేశారు. వర్షాకాలం వరదలు, రహదారి గుంతలో నరకం చూస్తున్నామనే సంగతి గుర్తు చేశారు.
రాజకీయ విశ్లేషకులు దీనిని రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరి ఆరోపణలకు బీజేపీ తీసుకొచ్చిన కౌంటర్ గా చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలల కర్ణాటకలోని అలంద్(కలబురిగి జిల్లా), మహాదేవ్ పుర( బెంగళూర్) అసెంబ్లీ విభాగాలలో అక్రమాలు జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. వీటిని ప్రతిగా ట్యాక్స్ చోర్ అని బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. దీనికి పౌరులు రాసిన లేఖను ఉదహరిస్తోంది.
బీజేపీ విమర్శలు..
‘‘మిస్టర్ రాహుల్ గాంధీ బెంగళూర్ కొత్త నినాదం కాంగ్రెస్ టాక్స్ చోర్ హై( కాంగ్రెస్ పన్ను దొంగ)’’ అని అశోక్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోంది కానీ, రోడ్లు నిర్మించడం లేదా కాలువలకు మరమ్మతు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ ఉదాసీనతపై బెంగళూర్ ప్రజలు విసిగిపోయారని, అందుకే పన్ను చోరి ఆపండని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
బెంగళూర్ లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు..
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, వారి హక్కుల కోసం వాదించే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 13 న ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. వర్తూర్- బలగెరె- పణత్తూర్ ప్రాంత నివాసితుల మున్సిపల్ అధికారుల నుంచి ఎదుర్కొంటున వేధింపులను పేర్కొన్నారు.
ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైట్ టాపింగ్ పనులు సగం సగం కొలతలతో అశాస్త్రీయమైన, సమన్వయం లేకుండా సాగుతున్నాయని తమ లేఖలో ఆరోపించారు. అలాగే వరద నీటి పనుల కారణంగా కూడా తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పేర్కొన్నారు.
బెంగళూర్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ వంటి వాటి పేలవమైన పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల విమర్శలు వచ్చాయి. ఇన్పోసిస్ మాజీ సీఎఫ్ఓ టీవీ మోహాన్ దాస్, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా వంటి వారు తక్షణమే వీటిని పరిష్కరించాలని కోరారు.
Read More
Next Story