కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు బిజెపి, జెడి(ఎస్) డిమాండ్
x

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు బిజెపి, జెడి(ఎస్) డిమాండ్

ముడా స్థల కేటాయింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బిజెపి, జెడి(ఎస్) పాదయాత్ర నేటితో ముగియనుంది.


మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ .. బెంగళూరు నుంచి మైసూరుకు చేపట్టిన ప్రతిపక్ష బిజెపి, జెడి(ఎస్)పాదయాత్ర ఈ రోజుతో ముగియనుంది. చివరి రోజు రామస్వామి సర్కిల్‌లో ప్రారంభమైన నిరసన ర్యాలీ మహారాజా కళాశాల మైదానంలో ముగుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీవై విజయేంద్ర, జేడీ(ఎస్) నేత నిఖిల్ కుమారస్వామి, ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలు, శాసనసభ్యులు ఆలయంలో పూజలు చేశాక పాదయాత్రలో పాల్గొన్నారు.

సిద్ధరామయ్యకు మద్దతుగా ప్రతిపక్షాల పాదయాత్రను ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ శుక్రవారం నగరంలో మెగా “జనాందోళన” సదస్సు నిర్వహించింది.

మెగా ర్యాలీలో బీఎస్ యడ్యూరప్ప, హెచ్‌డీ కుమారస్వామి,

మెగా ర్యాలీలో బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప, జేడీ(ఎస్) నేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, విజయేంద్ర, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్.అశోక, పలువురు శాసనసభ్యులు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. పాదయాత్ర చేపట్టిన దారిలో పలు చోట్ల ఇరు పార్టీల జెండాలు, ప్రముఖ నేతల చిత్రపటాలు కనిపించాయి.

న్యాయవాది-కార్యకర్త టిజె అబ్రహం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా.. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సీఎంకు జూలై 26న "షోకాజ్ నోటీసు" జారీ చేశారు. ప్రాసిక్యూషన్‌కు ఎందుకు అనుమతి ఇవ్వకూడదో ఏడు రోజుల్లోగా ముఖ్యమంత్రి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు 1న ముఖ్యమంత్రికి ఇచ్చిన "షోకాజ్ నోటీసు"ను ఉపసంహరించుకోవాలని గవర్నర్‌కు కోరింది. గవర్నర్ "రాజ్యాంగ కార్యాలయాన్ని" తీవ్రంగా దుర్వినియోగం చేసిందని ఆరోపించింది.

Read More
Next Story