చల్లటి బెంగుళూరులో వేడిపుట్టిస్తున్న బీజేపీ వర్సెస్ సిద్ధు
x
పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం సిద్ధరామయ్య

చల్లటి బెంగుళూరులో వేడిపుట్టిస్తున్న బీజేపీ వర్సెస్ సిద్ధు

బెంగళూర్ విధాన సభలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు, తాజాగా రామేశ్వరం కెఫెలో జరిగిన బాంబు పేలుడు ఇవన్నీ ఎన్నికల మందు కన్నడ నాట ఎన్నికల వాతావరణం హీటేక్కించాయి.


సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్నాటకలో జరిగిన రెండు సంఘటనలు బీజేపీకి చేతికి అస్త్రాలుగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలతో మైనారిటీ వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని అందుకు బెంగళూర్ లో జరిగిన బాంబు పేలుడే ఒక ఉదాహరణగా బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇంతకు విధాన సభలో కూడా రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ నిజాన్ని ఎఫ్ఎస్ఎల్ కూడా ధ్రువీకరించిదని అన్నారు.

శాంతిభద్రతల సమస్యగా
రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడును బీజేపీ, అధికార కాంగ్రెస్ వైఫల్యంగా ప్రచారం చేస్తోంది. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలం అయిందని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ కూడా ఎదురుదాడికి దిగింది. తక్కువ తీవ్రత కలిగిన పేలుడును తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని విమర్శలు గుప్పించింది. ఇదిలా ఉండగా పేలుడులో గాయపడ్డ బాధితులను గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ పరామర్శించారు. ఈయనతో పాటు కర్నాటక బీజేపీ చీఫ్ కూడా ఉన్నారు. ఇది కూడా రాజకీయంగా కర్నాటకలో కాకరేపింది. బీజేపీ ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.
కాంగ్రెస్ వెనకబడిందా?
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని జనవరిలో సిద్ధ రామయ్య సర్కార్ ఢిల్లీలో ఆందోళన చేసింది. తన కేంద్ర ప్రభుత్వ పథకాలతో సాఫ్ట్ హిందూత్వ ఎజెండాను అమలు చేస్తోందని సీఎం విమర్శించేవారు. అయితే తాజాగా జరిగిన రెండు, మూడు ఘటనలు సిద్ద రామయ్య సర్కార్ కు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. వాటిలో మొదటిది విధాన సభలోనే ఏకంగా పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు రావడం, రెండోది బెంగళూర్ లో జరిగిన పేలుడు. ఇంతకుముందు కూడా కేరళ చెందిన వ్యక్తి చనిపోతే అతనికి నష్ట పరిహారంగా 15 లక్షలు ప్రకటించడం, ఆ వ్యక్తి కాస్తా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహూల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ కు చెందిన వాడు కావడం కూడా వివాదాలకు దారి తీసింది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ట్రబుల్ షూటర్ గా వ్యవహరిస్తున్నారు. దీనిని బీజేపీ చక్కగా వినియోగించుకుందనే చెప్పవచ్చు.
బీజేపీ తొందరపడుతుందా?
కొంతమంది రాజకీయ నిఫుణుల ప్రకారం రాష్ట్రంలో జరిగిన రెండు సంఘటనలను బీజేపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఐఈడీ బాంబుపేలుడును పోలీసులు ధృవీకరించక ముందే బీజేపీ జాతీయ నాయకులు బీఎల్ సంతోష్ వంటి వారు దీనిని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. " కర్నాటలో బుజ్జగింపులకు పాల్పడే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు తగిన మూల్యం చెల్లించాము. విధాన సౌధలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు, రామేశ్వరం కెఫెలో జరిగిన బాంబు పేలుడు ఇదే సూచిస్తున్నాయి " అని బీఎల్ సంతోష్ ట్వీట్ చేశారు.
బాంబుపేలుడులో గాయపడిన వారిని కాంగ్రెస్ నాయకులు సందర్శించకముందే బీజేపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గవర్నర్ తో పాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బాధితులను పరామర్శించారు. తరువాత ఉప ముఖ్యమంత్రి డీకే, మరో రోజు సీఎంసిద్ధ రామయ్య పరామర్శించారు.
ఓట్లను బీజేపీ పోలరైజ్ చేస్తుంది: కాంగ్రెస్
ఈ విషయం పై ఓ మంత్రి ఫెడరల్ తో మాట్లాడుతూ " గవర్నర్ పర్యటనను ప్రశ్నించలేము కానీ, ఆయనతో బీజేపీ నాయకులు వెళ్లడం ఏంటీ.. ఇదీ నిజంగా ఆశ్చర్యం కలిగించే చర్య" అని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే సమస్యలు ఉన్నాయని తెలియజేప్పెందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
" రాష్ట్రంలో లో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఉందని చెబుతున్నారని, అయితే ఉగ్రవాదుల కదలికలను ఎన్ఐఏ, ఐబీ వంటి చూస్తాయని, ఈ దాడి నిఘాను అందించడంలో కేంద్ర ఏజెన్సీలు ఎందుకు విఫలం అయ్యాయని సదరు మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందులో సమాన వాటా ఉంటుందని ఆయన వాదన
పేలుడు సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కూడా స్పందించారు. " కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం వల్లే ఇలా బాంబు దాడులు జరుగుతున్నాయని అనడం తప్పు. వీటిని నేను ఖండిస్తున్నా. ఇంతకు ముందు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళూర్ పేలుడు జరిగింది. మరీ వీరికి కూడా ఇవే వర్తిస్తాయా?" అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనపై రాజకీయం చేయకూడదని సూచించారు.
ఎవరిని వదలం: సిద్ధరామయ్య
పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాల వెనక ఉన్న వ్యక్తుల గొంతును ఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే గుర్తించిందని, అయితే అలాంటి వారిని ప్రభుత్వం అమాయకులుగా చిత్రీకరించి, మొత్తం సంఘటనలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర విమర్శించారు. అయితే దీనిని సీఎం సిద్ద రామయ్య ఖండించారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.
పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు బీజేపీ సృష్టి అని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాల ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోయామనే నైరాశ్యంలో అందమైన అబద్దం సృష్టించారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. మైనారిటీలను అభద్రతభావానికి గురిచేస్తున్నారని, ఇంతకుముందు రైతు ఉద్యమం చేస్తున్న వారిని కూడా ఓ కర్నాటక బీజేపీ ఎంపీ ఖలీస్తానీ అని పిలిచాడని ఆయన ఆరోపించారు. మతమార్పిడి అనే అంశాన్ని కూడా తీసుకుని క్రైస్తవ మిషనరీలకు కూడా ఇదే విధంగా చేస్తారని అన్నారు.


Read More
Next Story