అన్ని సీట్లు రావన్న రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
x
మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఫైల్ ఫోటో

అన్ని సీట్లు రావన్న రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్

బీజేపీకి 370 సీట్లు రావని, ఎన్డీయేకు 400 సీట్లు రావని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.


బీజేపీకి 370 సీట్లు రావని, ఎన్డీయేకు 400 సీట్లు రావని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. మోదీ తన పేరును ప్రధాని పదవి నుంచి ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

X (ట్టిట్టర్) లో గెహ్లాట్ ఇలా పోస్ట్ చేశారు. "ఇప్పుడు బిజెపికి 370 సీట్లు రావని, ఎన్‌డిఎకు 400 సీట్లు రావని స్పష్టమైంది. నరేంద్ర మోదీ ఇప్పుడు తన పేరును ప్రధానమంత్రి అభ్యర్థిత్వం నుండి ఉపసంహరించుకోవాలి.2024 లోక్‌సభ ఎన్నికలపైనే మోదీ పూర్తిగా తన దృష్టిని కేంద్రీకరించారు. ప్రచారంలో బీజేపీ అనే పదం కంటే మోదీకి గ్యారెంటీ, మళ్లీ మోదీ సర్కార్ లాంటి పదబంధాలు ఎక్కువగా వినిపించాయి. ఎంపీ అభ్యర్థులను సైతం పక్కదారి పట్టించి మొత్తం ఎన్నికలను మోడీ‌కి గ్యారెంటీ పేరుతో నడిపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మోదీ ఓటమికి కారణాలని గెహ్లాట్ చెప్పారు.

Read More
Next Story