‘‘‌స్నేహయాత్ర’’ అందుకేనా?
x

‘‘‌స్నేహయాత్ర’’ అందుకేనా?

రాజ్యాధికారం అంత ఈజీ కాదు. అన్ని వర్గాల మద్దతుతోనే అది సాధ్యం. అందుకేనేమో కమలనాథులు ఆ దిశగా ఆలోచించినట్టున్నారు.


అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన రాష్ట్రాల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది. కేంద్రంలో అధికారం దక్కాలంటే.. ఎంపీల సపోర్టు కావాలి. వారి మద్దతు కావాలంటే ఓటర్లే కీలకం. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించేది వారే కాబట్టి.

ఎన్నికలకు ముందు ఒకే భావాజాలం ఉన్న వ్యక్తులను చేర్చుకోవడం, రాజకీయ పార్టీలను కలుపుకోవడం ద్వారా తమ సంఖ్యబలాన్ని రెట్టింపు చేసుకోవాలన్నది కమలనాథుల ఆలోచన.

కేరళలోని క్రైస్తవులతో కనెక్ట్ అయ్యేందుకు అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.

‘‘క్రిస్మస్‌ ‌సీజన్‌ ‌సందర్భంగా యాత్రలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించారు.‘‘డిసెంబర్‌ 20-30 ‌మధ్య మా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రైస్తవుల ఇళ్లను సందర్శిస్తారు. క్రైస్తవ సమాజాన్ని బీజేపీకి దగ్గర చేయడమే స్నేహ యాత్ర లక్ష్యం’’ బీజేపీ కేరళ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంటీ రమేష్‌ ‌తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘పాదయాత్రలు’ కూడా చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు

ఈస్టర్‌ను పురస్కరించుకుని ఈ ఏడాది ప్రారంభంలో ప్రముఖ బీజేపీ నాయకులు, సభ్యులు స్నేహ యాత్రను చేపట్టారు. క్రైస్తవులు, మత పెద్దల ఇళ్లను సందర్శించిన విషయం తెలిసిందే.

Read More
Next Story