కథానాయిక లక్ష్మీ మీనన్ పై కేసు నమోదు
x
నటీ లక్ష్మీ మీనన్

కథానాయిక లక్ష్మీ మీనన్ పై కేసు నమోదు

టెక్కీని అపహరించి దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేసిన ఎర్నాకుళం పోలీసులు


ప్రముఖ కోలీవుడ్ నటీ లక్మీ మీనన్ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ టెక్కీని అపహరించి దాడి చేసిన ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

అలువాలో నివసిస్తున్న ఒక టెక్కీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకుళం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని కిడ్నాప్ చేసి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆగష్టు 24న రాత్రి జరిగినట్లు చెబుతున్న ఈ సంఘటనలో నటి లక్ష్మీ మీనన్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. కేరళ హైకోర్టు నటికి బెయిల్ మంజూరు చేసింది.

సంఘటన..

కొచ్చిలోని బెనర్జీ రోడ్డులోని వెలాసిటీ బార్ లో ఆదివారం రాత్రి రెండు గ్రూపుల యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో నటీ లక్ష్మీ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉంది. మరో గ్రూపులో ఐటీ నిపుణులు ఉన్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి.
లక్ష్మీ స్నేహితుల్లో ఒకరు ఐటీ గ్రూపులోని మహిళా సహోద్యోగి, థాయిలాండ్ కు చెందిన విదేశీయురాలితో మాట్లాడటం ప్రారంభించిన తరువాత వివాదం ప్రారంభం అయి, భౌతిక దాడులకు దారితీసింది.
లక్ష్మీ, ఆమె స్నేహితులు ఐటీ సిబ్బందిలోని ఒకరిని వెంబడించి బలవంతంగా తమ కారులోకి ఎక్కించి తీసుకెళ్లారని, లక్ష్మీ అలువా వద్ద దిగిందని, ఆమె స్నేహితులు ఆ వ్యక్తిని వేడిమరకు తీసుకెళ్లి అక్కడ అతనిపై దాడి చేశారని ఆరోపించారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు మిథున్, అనీష్, సోనా మోల్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ ఇంకా పోలీసులకు చిక్కలేదు.
వీడియోలో..
ఈ వివాదంలో లక్ష్మీ స్నేహితురాలు సోనా మరో గ్రూపుపై ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో లక్ష్మీ, సోనా ఇద్దరు మరో కారులో ఉన్న వ్యక్తులతో గొడవపడుతున్నట్లు ఉన్న వీడియో బయటకు వచ్చింది.
ఈ క్లిప్ లో వారు వాహానాన్ని అడ్డుకోవడం కనిపించింది. అందులో ఇరువురు తీవ్ర వాగ్వాదం చేసుకోకవడం కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో లక్ష్మీ పేరు కూడా ఉంది. ఆమె కోసం వెతుకుతున్నామని కానీ ఆమె ఇళ్లు ఎక్కడ ఉందో ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు.
లక్ష్మీ మీనన్ ఎవరూ?
2011 లో వినయన్ దర్శకత్వం వహించిన ‘రఘువింటే స్వాంతం రజియా’ చిత్రంలో సహయ పాత్రలో లక్ష్మీ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తరువాత కుంకి, సుందర పాండ్యన్ వంటి అనేక ముఖ్యమైన చిత్రాలలో నటించింది. ఆమె నటించిన చాలా పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ కేసు కారణంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
Read More
Next Story