కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేప్ కేసు- కర్నాటకలో ఆగని అత్యాచారాలు
x

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేప్ కేసు- కర్నాటకలో ఆగని అత్యాచారాలు

కన్నడ నాట ప్రజాప్రతినిధులపై రేప్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంతకుముందు మాజీ ఎంపీ జేడీఎస్ నాయకుడు, తరువాత యడ్యూరప్ప పై కేసులు నమోదవగా, తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే


కర్ణాటకలోని ధార్వాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణి తనపై అత్యాచారం చేసి వేధించాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కులకర్ణి మంత్రి పదవిని ఆశించారు. ఫిర్యాదు మేరకు కులకర్ణిని ప్రధాన నిందితుడిగా, అతని సహాయకుడు అర్జున్‌ను ద్వితీయ నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అభియోగాలు..
ఈ కేసుపై ఎమ్మెల్యే కౌంటర్ కేసు దాఖలు చేశారు. తన నుంచి రూ. 2 కోట్లు దండుకునేందుకు సదరు మహిళ తో పాటు, కన్నడ న్యూస్ ఛానెల్ అధినేత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దీనిపై కూడా రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
తనను తాను సామాజిక కార్యకర్తగా, రైతుల నాయకురాలిగా గుర్తించుకునే మహిళ (34), 2022 ప్రారంభంలో కులకర్ణిని బెంగుళూరు నివాసంలో పరస్పర పరిచయస్తుల ద్వారా పరిచయం చేసుకున్నట్లు చెప్పుకున్నారు. కులకర్ణి తనతో అసభ్యంగా ప్రవర్తించే వాడని, అనుచితమైన రీతిలో వీడియో కాల్స్ చేసేవాడని ఆరోపించారు. అతని లైంగిక ఆసక్తిని ఆమె తిరస్కరించడంతో బెదిరించడానికి తన మనుషులను పంపాడు. అతనితో బలవంతంగా కలవాల్సిందే అని బెదిరించారు.
ఎమ్మెల్యే వేధింపులు
కులకర్ణి ఒక రైతు నుంచి తన ఫోన్ నంబర్ తీసుకొని రాత్రి కూడా తనకు కాల్ చేయడం ప్రారంభించాడని మహిళ ఆరోపించింది. “కొన్ని నెలల తర్వాత, అతను నేను బట్టలు విప్పి వీడియో కాల్స్ చేయమని బలవంత పెట్టాడని, హెబ్బాల్‌లోని అతని ఇంటికి వెళ్లమని నన్ను ఒత్తిడి చేశాడని చెప్పారు. నేను నిరాకరించడంతో, ఎమ్మెల్యే ఇంటికి వెళ్లకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రౌడీల ముఠా నన్ను బెదిరించారు.
“ఏప్రిల్‌లో, ఎమ్మెల్యే నన్ను బెల్గాంకు పిలిపించాడు, అక్కడ అతను నన్ను కౌగిలించుకుని లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. అయితే, ఎమ్మెల్యేను కలవడానికి కొంతమంది రావడంతో నేను తప్పించుకోగలిగానని వివరించాడు.
అత్యాచారం జరిగింది..
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 24న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైని కలిసేందుకు బెంగళూరు వచ్చినప్పుడు కులకర్ణి తన ఇంటికి రమ్మని చెప్పి ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన కారులో అత్యాచారం చేశాడని ఆరోపించింది.
“తరువాత, అతను నా ఫోన్‌ని తీసుకుని, ఫోటోలు, వీడియోలు తీయమని పార్టీ సభ్యుడిని ఆదేశించాడు. తరువాత, అతను నా ఫోన్‌ను తిరిగి ఇచ్చాడు, ”ఆమె చెప్పింది. “దీని తర్వాత, నాకు, ఎమ్మెల్యే మధ్య జరిగిన సంభాషణ ఆడియో రికార్డింగ్ వైరల్ అయ్యింది. నేను ఆడియోను లీక్ చేశానని కులకర్ణి అనుమానం వ్యక్తం చేశారు. అతను నా మాటలను నమ్మలేదు.
“ఎమ్మెల్యే నన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నాపై దాడి చేశాడు. అక్టోబరు 2న, ఎమ్మెల్యే నన్ను ధర్మస్థలకు తీసుకెళ్లారు, అక్కడ అతను మళ్లీ అత్యాచారం చేశాడు. నన్ను బెంగళూరుకు తీసుకెళ్లమని అర్జున్‌తో చెప్పాడు, ” అని ఎఫ్‌ఐఆర్ లో వివరాలు నమోదు చేశారు.
కులకర్ణి తనతో వీడియో కాల్‌లో ఉన్నట్లు చూపిన వీడియో సాక్ష్యాలతో పాటు, మహిళ ఆరోపణలను ఛానెల్ ప్రసారం చేయడం ద్వారా అతను ఛానెల్ పై ఆరోపణలు గుప్పిస్తూ కేసు పెట్టారు.
కులకర్ణి మంత్రి పదవిపై..
ఉత్తర కర్ణాటకకు చెందిన ప్రముఖ పంచమసాలీ లింగాయత్ నాయకుడు కులకర్ణి, తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంటూ కర్ణాటక మంత్రివర్గంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీలో నాపై మంచి అభిప్రాయాలున్నాయి. 'నేను అడగకుండానే కేపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కార్పొరేషన్‌, బోర్డుల అధిపతులు వంటి పదవులు ఇచ్చారు. అందుకే నాకు మంత్రి పదవి వస్తుందని నమ్ముతున్నాని అన్నారు. 2016 నాటి కేసులో కూడా కులకర్ణి విచారణను ఎదుర్కొంటున్నారు.
అదే ఏడాది జూన్ 15న ధార్వాడ్ ప్రాంతంలో స్థానిక బీజేపీ నాయకుడు యోగేష్ గౌడ్ హత్యకు గురయ్యాడు. నిందితుల్లో ఒకరైన కులకర్ణి తనపై వచ్చిన అభియోగాలను సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.


Read More
Next Story