బెల్గాం సమావేశం.. జాతీయోద్యమం.. మీకు ఏమైనా గుర్తుకు వచ్చిందా ?
x

బెల్గాం సమావేశం.. జాతీయోద్యమం.. మీకు ఏమైనా గుర్తుకు వచ్చిందా ?

గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్ తొలిసారి సమావేశమయింది బెల్గాం లోనే...


జాతీయోద్యమ కాలంలో మహ్మాతా గాంధీ అరడజన్ సార్లు సందర్శించిన బెలగావీపై కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో గాంధీ స్ఫూర్తి, విలువలను పునరుద్దరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను ఆవిష్కరించింది.

ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీని దూషించడం, ఆయన హంతకులను కీర్తించడం, అసహ్యహించుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ చర్య తీసుకోవడం మంచి పరిణామం. బెలగావిని గతంలో బెల్గాం అని పిలిచేవారు. ఇక్కడ డిసెంబర్ 9 - 20 వరకూ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందువల్ల ఇక్కడ శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
దశాబ్ధ వేడుకలు..
జాతీయోద్యమ సమయంలో ప్రతి ఏటా నిర్వహించిన వార్షిక సమావేశాల్లో గాంధీజీ కర్నాటకలోని బెల్గాం సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆయన ఈ ఒక్క సమావేశానికే బాధ్యత తీసుకున్నారు. ఇది 1924 డిసెంబర్ లో జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్ తో ఈ సమావేశానికి వంద సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
అందువల్ల కర్నాటక ప్రభుత్వం డిసెంబర్ 26-27 న దశాబ్ధి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2025లో జరుపుకోనున్న ప్రభుత్వ 'గాంధీ భారత సంవత్సరం'లో భాగంగా ఉంటుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంతో పాటు డిసెంబర్ 27న బహిరంగ ర్యాలీతో వేడుకలు ప్రారంభమవుతాయి.
బెళగావి వెలిగిపోవాలి..
రాష్ట్ర మంత్రి, పార్టీ నాయకుడు హెచ్‌కె పాటిల్ ప్రకారం.. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, స్మారక చిహ్నలతో గాంధీ వారసత్వాన్ని చాటేలా ఉంటాయి. 2025లో ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు.
" ఈ సంఘటనలు గాంధీ ఆదర్శాలను, సెషన్ చారిత్రక ఔచిత్యాన్ని హైలైట్ చేయడానికి ఉద్దేశించబడ్డాయి," అని సీఎం చెప్పారు. మైసూర్ దసరా సందర్భంగా ఎలా ధగధగ వెలుగుతుందో, అలాగే బెళగావిలోని 32 కిలోమీటర్ల రోడ్డు మార్గం, 30 ప్రధాన కూడళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
గాంధీ స్మారక చిహ్నాలు..
బెల్గాంలో కాంగ్రెస్ సమావేశం జరిగిన ప్రాంతాన్ని ‘ వీర సౌధ’ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ ప్రత్యేకంగా లైబ్రరీ, గాంధీ విగ్రహం ఉంటుంది. అదనంగా, 2 కిలోమీటర్ల రోడ్డు వెంబడి తాత్కాలిక విరూపాక్ష గోపురం నిర్మిస్తారు. గాంధీ సందర్శించిన కర్ణాటకలోని 120 ప్రదేశాలలో స్మారక స్థూపాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గాంధీ - బెల్గాం
జాతీయోద్యమ సమరయోధుడు గంగాధరరావు దేశ్‌పాండే జన్మస్థలం, బెలగావి సమీపంలోని హుడాలిలో గాంధీ స్మారక చిహ్నం, ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నారు. మహాత్మా గాంధీ బెలగావి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని కర్ణాటకతో గాంధీకి ఉన్న అనుబంధంపై అధికారి వేమగల్ సోమశేఖర్ ‘ది ఫెడరల్‌’తో అన్నారు. ఎందుకంటే కర్నాటకలో గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ సభ జరిగిన ఏకైక ప్రదేశం బెల్గాం.
బెల్గాం కాంగ్రెస్ సమావేశం..
ప్రస్తుత బెలగావి జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి. ఇది బెంగళూరు - ముంబై మధ్యలో ఉంది. బ్రిటీష్ భారతదేశంలో, బెల్గాం బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ప్రస్తుత గుజరాత్, మహారాష్ట్ర కర్ణాటకలో ఎక్కువ భాగం ఈ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది.
సోమశేఖర్ ప్రకారం, బాలగంగాధర్ తిలక్ మరణానంతరం 1920 ప్రారంభంలో బెల్గాంతో గాంధీ అనుబంధం ప్రారంభమైంది. 1920 నవంబర్ 8న బెల్గాం జిల్లాలోని నిప్పాని అనే చిన్న పట్టణాన్ని బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు గాంధీ సందర్శించారు.
బెల్గాం కాంగ్రెస్ సమావేశాలు మూడు రోజులకు పైగా జరిగిన అన్ని కాంగ్రెస్ సమావేశాల మాదిరిగా కాకుండా కేవలం రెండు రోజులు (డిసెంబర్ 26-27) మాత్రమే జరిగాయి. కానీ గాంధీ ఆదేశాల ప్రకారం బెల్గాం సమావేశం చాలా కఠినంగా జరిగిందని గాంధీ స్మారక నిధి యూనిట్ ప్రెసిడెంట్ ఎన్ విషుకుమార్ తెలిపారు.
యువతలో స్ఫూర్తి..
విషుకుమార్ అభిప్రాయంలో.. బెల్గాం సెషన్ జాతీయోద్యమ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సెషన్ గా భావిస్తున్నారు. ఇది స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఇది చాలా వేగవంతం చేసింది.
ఆ తర్వాత, 1934లో, గాంధీ బెల్గాం సందర్శించి, "హరిజన నిధి" కోసం రూ. 50,000 సేకరించారు. “గాంధీ పర్యటనలు యువ తరాన్ని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేలా ప్రేరేపించాయని ఆయన అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా ఆజాద్‌తో సహా స్వాతంత్య్ర ఉద్యమ నాయకులతో పాటు బెలగాంకు చెందిన గాంధరరావు దేశ్‌పాండే 1924 కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు.
గాంధీ పర్యటనలు
మహాత్మా గాంధీ కనీసం ఆరు సార్లు బెల్గాం సందర్శించారు. ఈ ప్రాంతంలో జాతీయోద్యమ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి 1916లో ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు బెల్గాంలో ఉన్నాడు. ఆ తర్వాత 1920లో నవంబర్ 8-9 తేదీల్లో బెల్గాం సందర్శించారు.
1924 సెషన్‌లో 15 రోజులు బెల్గాంలో గడిపారు. మళ్ళీ, గాంధీ 1927లో ఏప్రిల్ 18-19 తేదీలలో మహారాష్ట్రకు వెళుతుండగా పట్టణంలో ఆగారు. గాంధీ తిరిగి మార్చి 4, 1934న మళ్లీ బెల్గాంకు వచ్చి ఏడు రోజులు బెలగాం, నిపాని.. షెడ్బాల్ (అథాని తాలూకా)లో ఉన్నాడు.
ఏప్రిల్ 17 నుంచి 23 వరకు, గాంధీ బెలగాం సమీపంలోని హుడాలిలోని కుమారి ఆశ్రమంలో ఉన్నారు. హుడాలిలో అతిథులకు వసతి కల్పించేందుకు దాదాపు 250 గుడిసెలు ఏర్పాటు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
కర్ణాటక- మహారాష్ట్ర వరుస
మహారాష్ట్రతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న బెలగావిపై రాష్ట్ర నియంత్రణను పునరుద్ఘాటించడంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం సువర్ణ విధాన సౌధను నిర్మించింది. కర్ణాటకకు సంబంధించినంత వరకు మహారాష్ట్రతో సరిహద్దు వివాదం ముగిసిన అధ్యాయమని పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ స్పష్టం చేశారు.
"ఇది మహారాష్ట్ర రాజకీయ నాయకులకు కేవలం రాజకీయ ఆయుధం మాత్రమే, ప్రతి ఎన్నికలకు ముందు వారు ఈ సమస్యను గుర్తుచేస్తారు" అని ఆయన అన్నారు.


Read More
Next Story