
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కృష్ణా జలాలపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేయబోతోంది: డీకే
ట్రిబ్యూనల్ కు అనేక సార్లు గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కృష్ణా జలాల పంపిణీ వివాదంపై ఏకాభిప్రాయం సాధించడానికి కేంద్రం త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం తెలిపారు.
‘‘కృష్ణా జలాల పంపిణీ వివాదంపై ఏకాభిప్రాయం సాధించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది’’ అని శివకుమార్ విలేకరులకు తెలిపారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కలిసి మేకేదాతు అలాగే, ఎగువ భద్ర ప్రాజెక్ట్ లకు ఆమోదం కోరింది.
ఈ వివాదం 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఉంది. మొదటి కృష్ణ జల వివాదాల ట్రిబ్యూనల్ 1973 లో ఈ వివాదాన్ని పరిష్కరించింది. 2004 లో నీటిని తిరిగి కేటాయించడానికి రెండవ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేశారు. అయితే పలు వివాదాల కారణంగా ఈ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఇది తన నివేదికను 2010 లోనే అందించింది.
ప్రస్తుతం కేంద్రం జూన్ 2011 నాటి ఉత్తర్వులను సవరించాలని, రెండో ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభ్యర్థించినట్లు శివకుమార్ తెలిపారు.
2014 లో రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అంశాలను చేర్చిన తరువాత ట్రిబ్యూనల్ గడువును జూలై 31, 2025 వరకూ పొడిగించారు. ఈ ట్రిబ్యూనల్ గడువును అనేక సార్లు పొడిగించారు.
మేకేదాతు ప్రాజెక్ట్
మేకేదాతు ప్రాజెక్ట్ పై శివకుమార్ మాట్లాడుతూ.. వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) కేంద్ర జలసంఘం నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు. ‘‘కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కు అన్ని వివరాలు సమర్పించాము. వీలైనంత వేగంగా త్వరగా అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించాము’’ అని ఆయన అన్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ పై తమిళనాడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై తన కూటమి భాగస్వామి డీఎంకెతో మాట్లాడారా అని డీకేను ప్రశ్నించినప్పుడూ.. మాదీ రాజకీయ కూటమని చెప్పారు.
మేకేదాతు ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఇది బెంగళూర్ నగరం నీటి డిమాండ్లను పరిష్కరిస్తుంది. అదే విధంగా తమిళనాడుకు అవసరమైన నీటిని విడుదల చేయడానికి, 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు.
పీఎంకేఎస్ వై - ఏఐబీపీ కింద ఎగువ భద్ర ప్రాజెక్ట్ కు కేంద్ర సహాయంగా రూ. 5,300 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. అలాగే మహాదాయిలోని ‘కలసా నాలా’ ప్రాజెక్ట్ కు త్వరగా వన్య ప్రాణుల అనుమతిని కోరారు. యోటినహోల్ ప్రాజెక్ట్ కోసం జల్ జీవన్ పథకం కింద కర్ణాటక కేంద్రసాయం కోరుతుందని ఆయన తెలిపారు.
Next Story