
నటుడు విజయ్
విజయ్ కు ఆదిలోనే హంసపాదు.. ఆడియో వైఫల్యం, గందరగోళం
సగం మందికి వినిపించని టీవీకే అధినేత ప్రసంగం
ప్రమీలా కృష్ణన్
టీవీకే అధినేత, నటుడు విజయ్ తిరుచిరాపల్లి(త్రిచ్చి) లో ప్రారంభించిన తన తొలి ఎన్నికల ప్రచారం గందరగోళంగా మారింది. మహిళలు, పిల్లలు, మీడియా ప్రతినిధులతో సహ హాజరైన ఆయన అభిమానులకు కూడా బాధాకరమైన అనుభవాలు ఎదురయ్యాయి.
నగర రోడ్లపై గుమిగూడిన భారీ జన సమూహాన్ని నియంత్రించడానికి పార్టీ కార్యకర్తలు గానీ, తిరుచ్చి జిల్లా పోలీసులు కానీ ఎవరూ కనిపించలేదు. గ్రౌండ్ జీరో ‘ది ఫెడరల్’ ఈ అంశాలను రిపోర్ట్ చేసింది.
తిరుచ్చి వాసులు, పార్టీ కార్యకర్తల ఉత్సాహం నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఆవిరైపోయింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ర్యాలీని విజయ్ ప్రారంభించాడు. డీఎంకేను, ప్రతిపక్ష అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని ఎదుర్కోవడానికి ఆయన సమాయత్తం అవుతున్నారు.
ప్రణాళిక మార్పు..
త్రిచి విమానాశ్రయం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరకడై ప్రదేశంలో విజయ్ తన మొదటి ప్రచారం ప్రసంగం చేయవలసి ఉంది. కానీ ఇక్కడకు లక్షలాదిగా ప్రజలు తరలిరావడంతో, జనసమూహాన్ని ఎవరూ అదుపు చేయలేకపోయారు. చాలామంది పిల్లలు స్పృహ కోల్పోయారు. తెల్లవారుజామున నుంచి విజయ్ రాక కోసం వేచి ఉన్న రోడ్ల మీద వేచి ఉన్న మహిళలు నానా అవస్థలు పడ్డారు.
షెడ్యూల్ ప్రకారం విజయ్ ఉదయం 10.30 గంటలకు తిరుచ్చి విమానాశ్రయం నుంచి మరకడై చేరుకుని, అక్కడ ఎంజీఆర్ విగ్రహం దగ్గర 20 నిమిషాల పాటు ప్రసంగం చేయాల్సి ఉంది.
కానీ ఆయన ప్రచార వ్యాన్ ను వేలాది మంది కార్యకర్తలు, అనుచరులు చుట్టుముట్టడం వందలాది వాహానాలు మద్దతుగా రావడంతో 8 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ఆయనకు దాదాపు ఐదు గంటలు పట్టింది.
గాయపడిన ఫెడరల్ బృందం..
భారీ జనసందోహం మధ్యలో ‘ది ఫెడరల్’ కెమెరా పర్సన్ కరుణాకరన్.బి ఒక చెక్కబల్ల మీద నుంచి కింద పడిపోయాడు. జనసమూహం ముందుకు వెనకకు నెట్టడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
నిర్వాహకులు మంచినీరు తీసుకురావడానికి దాదాపు 20 నిమిషాలకు పైగా సమయం పట్టింది. వైద్య సాయానికి దాదాపు 30 నిమిషాలు తీసుకున్నారు. జనసందోహంలో చాలామంది ఇలాంటి కష్టాలను అనుభవించారు.
టీవీఎస్ టోల్ గేట్ వద్ద గుమిగూడిన జనసందోహాన్ని వీడియో తీస్తున్నప్పుడూ కొంతమంది యువకులు విజయ్ వ్యాన్ తలుపులు బాదుకుంటూ ప్రమాదకరంగా పరిగెత్తారు. ఈ గొడవ సందర్భంగా మీడియా ప్రతినిధులను పార్టీ క్యాడర్, టీవీకే బౌన్సర్లు తోసేశారు. ఈ సందర్భంగా రచయిత వ్యాన్ కింద పడబోయారు. అయితే పక్కన ఉన్న వారు రక్షించారు.
సౌకర్యాల లేమి..
కేవలం పత్రికా రంగం మాత్రమే కాదు.. కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందిపడుతున్న తమ నాయకుడిని చూడటానికి తరలివచ్చిన సాధారణ ప్రజలు కూడా బాధపడ్డారు.
‘‘మా నాయకుడిని చూడటానికి మేము ఉదయం 7 గంటలకు ఇక్కడకు వచ్చాము. కానీ అక్కడ మహిళా పోలీసులు లేరు. భద్రతా ప్రకటనలు లేవు. తాగునీరు లేదు’’ అని 22 ఏళ్ల ఎస్. ప్రియా అన్నారు.
మరకడై వద్ద ఐదు గంటలు వేచి ఉన్నా సాంకేతిక కారణాల వల్ల విజయ్ ప్రసంగం వినబడలేదు. ‘‘అయినప్పటికీ అతను మా వైపు చేయి ఊపడం నేను చూడాలనుకున్నాను’’ అని ఆమె ‘ది ఫెడరల్’ తో అన్నారు.
తన భార్య, నాలుగేళ్ల కుమార్తెతో వచ్చిన 33 ఏళ్ల ఎం. బాబు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ‘‘ఇది మా నాయకుడి మొదటి ప్రచారం. మేము ఉత్సాహంగా ఉన్నాము. కానీ భారీ జన సమూహంలో మా బిడ్డ భద్రత గురించి మేము భయపడ్డాము. పోలీసులు దానిని నియంత్రించడంలో విఫలమయ్యారు. టీవీకే నిర్వాహకులు పనిచేసే మైక్ ను కూడా ఏర్పాటు చేయలేకపోయారు.’’అని ఆయన అన్నారు.
విజయ్ వీరాభిమాని అయిన ఆయన భార్య రాణి ఈ కఠిన పరీక్షను ఎదుర్కొంటూనే పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్నారు. ‘‘అల్లర్లు సృష్టించడంలో అధికార డీఎంకేకు ఒక రహస్య ఎజెండా ఉందని, పోలీసులు గందరగోళాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారు’’ అని బాబు ఆరోపించారు.
సాంకేతిక లోపాలు..
ప్రసంగం అంతటా సాంకేతిక వైఫల్యాలు కారణంగా పెద్ద సంఖ్యలో జనసమూహం విజయ్ మాట వినలేకపోయింది. చాలామంది మాటలు వినిపించడం లేదని చేతులు ఎత్తారు. కానీ నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన సిద్ధం చేసిన నోట్స్ చదువుతూ మీకు వినిపిస్తోందా అని రెండుసార్లు అడిగారు. కానీ సమస్యను పరిష్కరించకుండా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
వేదిక నుంచి బయటకు వెళ్లే ముందు తన అనుచరులకు అభివాదం చేసి వెళ్లారు. విజయ్ రాజకీయ ప్రయాణానికి ఒక మైలురాయి ప్రారంభం అనేది గందరగోళం, భద్రతా భయాలు, నిరాశ జ్ఞాపకాలను మిగిల్చింది.
Next Story