సముద్రపు పక్షి పై చైనా జీపీఎస్ ట్రాకర్
x
సీగల్

సముద్రపు పక్షి పై చైనా జీపీఎస్ ట్రాకర్

కార్వార్ నేవల్ బేస్ ప్రాంతంలో తిరుగుతున్న సీగల్


ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ తీరప్రాంతం సమీపంలో ఉన్న సున్నితమై నావిక బేస్ కు దగ్గరగా, చైనా తయారీ జీపీఎస్ ట్రాకింగ్ పరికరం ఒక సీగల్ కు అనుసంధానించబడి ఉంది. దీనితో భద్రతా సంస్థలు, అటవీ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇవి గూఢచర్యం కంటే శాస్త్రీయ పరిశోధన గా సూచిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.

అసాధారణంగా ట్యాగ్ చేయబడిన సీగల్
బీచ్ సమీపంలో తిమ్మక్క గార్డెన్ ప్రాంతం వెనక అసాధారణంగా ట్యాగ్ చేయబడి విశ్రాంతి తీసుకుంటున్న సీగల్ ఉన్నట్లు స్థానికులు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అనుమానాస్పదంగా ఉన్న పరికరాన్ని గుర్తించి వారు అటవీ శాఖ మెరైన్ వింగ్ కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు ఆ పక్షిని సురక్షితంగా బంధించి పరికరాన్ని పరిశీలించారు.
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ తో అనుసంధానించబడిన జీపీఎస్ ట్రాకర్ బోర్ మార్కింగ్ లు విద్యా, పర్యావరణ అధ్యయనాలకు దాన్ని ఉపయోగిస్తున్నాయి.
సీగల్స్ కదలిక, తినే విధానాలు, వలస మార్గాలను అధ్యయనం చేయడానికి ట్రాకర్ అమర్చినట్లు కనిపిస్తోంది. ఈ దశలో ఎటువంటి గూఢచర్య కార్యకలాపాలను సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు’’ అని పోలీసులు తెలిపారు.
అయితే తీరప్రాంతం వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆ పక్షిని పరిశీలన కోసం మెరైన్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయానికి తరలించారు.
ట్రాకింగ్ ప్రొగ్రామ్ మూలం, కాలక్రమం పరిధితో సహ అధ్యయనం వివరాలను నిర్ధారించడానికి అధికారులు సంబంధిత పరిశోధన సంస్థను అధికారికంగా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదే మొదటిది కాదు
ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్ లో కార్వార్ లోని బైత్కోల్ ఓడరేవు పరిధిలో ట్రాకింగ్ పరికరంతో ఉన్న గద్ద కనిపించింది. అది కూడా వన్యప్రాణుల పరిశోధనకు సంబంధించినది గుర్తించారు.
అయితే భారత నావికా దళానికి చెందిన అత్యంత వ్యూహాత్మక స్థావరాలలో ఒకటైన ఐఎన్ఎస్ కదంబ ఇక్కడే డాగ్ చేసి ఉంటుంది. ఈ పరిశోధన ముసుగులో సున్నితమైన సమాచారాన్ని చైనా సేకరిస్తుందనే అనుమానం కూడా ఉంది.
‘‘జీపీఎస్ పరికరాలను ఉపయోగించి వన్యప్రాణులను ట్రాక్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించిన పద్దతి అయినప్పటికీ పక్షి ఎక్కడ దొరికిందో ఏజెన్సీలు ధృవీకరించడం తప్పనిసరి’’ అని పోలీసులు తెలిపారు.
పరిశోధనా సంస్థ నుంచి వచ్చిన సమాచారం, డేటా ట్రాన్సిమిషన్ సామర్థ్యాల సాంకేతిక విశ్లేషణ తదుపరి ఏం చర్య తీసుకోవాలనే చర్యపై ఆధారపడి ఉంటుందని అధికారులు నొక్కి చెప్పారు.
Read More
Next Story