
కోయంబత్తూర్ అత్యాచారం: నిందితులపై కాల్పులు జరిపిన పోలీసులు
వేట కొడవళ్లతో దాడికి యత్నించిన నిందితులు
కోయంబత్తూర్ లో ఓ కళాశాల విద్యార్థిని అపహరించి, అత్యాచారం జరిపిన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రకటించారు. ఓ అధికారిపై దాడి చేయడానికి ప్రయత్నించారని, అత్యాచారం చేసిన నిందితులు కరుప్పామి, కాళీశ్వరన్, తవాసీగా గుర్తించారు.
పోలీసుల కార్నర్..
అత్యాచారం జరిపిన నిందితులు ఒక ఆలయం సమీపంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రత్యేక పోలీస్ బృందాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. తాము పోలీసులకు దొరికిపోతామనే భయంతో నిందితులు వేట కొడవళ్లతో దాడికి యత్నించారు. ఈ దాడిలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఎడమ మణికట్టు, చేతికి గాయాలయ్యాయి.
దీనితో పోలీసులు కాల్పుల జరిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునే ముందు వారి కాళ్లకు గాయాలయ్యాయి. తరువాత వారిని చికిత్స కోసం కోయంబత్తూర్ లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన అధికారికి సైతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం ఏడు ప్రత్యేక బృందాలు గాలించాయని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.
నిర్మాణ కార్మికులు..
ముగ్గురు నిందితులు కోయంబత్తూర్ లో భవన నిర్మాణ కార్మికులు. శివగంగ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. వారిలో ఇద్దరు, కరుప్పసామి, కాళీశ్వరన్ బంధువులని చెబుతారు. వీరిపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
అత్యాచారం..
కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది. అవినాశి రోడ్డులోని ఓ ప్రయివేట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల బాధితురాలు. అదే కళాశాలకు చెందిన వినీత్ అనే తన స్నేహితుడితో ఏకాంత ప్రదేశంలో కారు నిలిపి ఉంచింది.
 సాయంత్రం వేళ తమను చూసినన ముగ్గురు వ్యక్తులు తమను అనుసరిస్తున్నారని తెలియక వారు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో దుండగులు కారు అద్దాలను ఇనుపరాడ్లు, కర్రలతో పగలగొట్టి, భయంతో ఉన్న వినీత్ ను కారులోంచి బయటకు లాగారు.
 అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత వారు బాలికను వాహానం నుంచి లాక్కెళ్లి తమ కారులో ఎక్కించుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమెను దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డారు.
 వినీత్ చాలాకష్టంగా రోడ్డు మీదకు చేరుకుని ఓ వాహనదారుడి సాయంతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితురాలి కోసం ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు.
Next Story

