కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య, మరో ఇద్దరిపై ఫిర్యాదు
x

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య, మరో ఇద్దరిపై ఫిర్యాదు

ముడా కుంభకోణం కర్ణాటక సీఎం మెడకు చుట్టుకుంటుందా? ఆయన భార్య, బంధువుపై ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందించారు?


మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతితో పాటు మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించారు. ఇందులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం వివాదం నెలకొంది. స్థలాల కేటాయింపులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష బిజెపి డిమాండ్ చేస్తోంది. సీఎం సిద్ధరామయ్య కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేలా ముడా వ్యవహరించిందని, తక్షణమే ఆయనకు పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని సిద్ధరామయ్య గట్టిగా వాదిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని కొట్టిపడేశారు.

ఈ క్రమంలో సీఎం భార్య పార్వతి, ఆమె బంధువు మల్లికార్జున స్వామి, వివాదాస్పద భూ యజమాని దేవరాజుపై మైసూరులోని విజయనగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ వీరిపై 10 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి ముడాను కోట్లాది రూపాయలు నష్టం కలిగించారని ఆరోపిస్తున్నారు. మైసూరు జిల్లా కమిషనర్, తహసీల్దార్, డిప్యూటీ రిజిస్ట్రార్, ముడా కమిషనర్ ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్‌, ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ కూడా రాశారు.

‘అనుమానాలున్నాయి.. సమాధానం ఇవ్వండి..’

భూసేకరణ నుంచి దేవరాజు భూమిని మినహాయించడం, దాన్ని ఆయన మల్లికార్జున స్వామికి విక్రయించడంపై అనుమానాలను లెవనెత్తారు స్నేహమయి కృష్ణ. తాను అడిగిన ప్రశ్నలకు 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కృష్ణ తన లేఖలో కోరారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి 10 రోజులైనా.. సివిల్ కేసు ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ ఇప్పటికే విచారణ ప్రారంభించినందున, ఫిర్యాదును ఆ శాఖకు బదలాయించినట్లు విజయనగర్ పోలీసులు ఫెడరల్ కర్ణాటకకు తెలిపారు.

Read More
Next Story