తమిళనాడులో దళిత విద్యార్థులపై పెరుగుతోన్న దాడులు..
x

తమిళనాడులో దళిత విద్యార్థులపై పెరుగుతోన్న దాడులు..

జస్టిస్ చంద్రు కమిటీ సిఫార్సులను అమలు చేయని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం..


Click the Play button to hear this message in audio format

తమిళనాడు (Tamilnadu) రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో ఒక దళిత విద్యార్థిపై క్లాస్‌మేట్‌ల దాడి నేపథ్యంలో విద్యార్థుల స్కూల్ బ్యాగులను సైతం తనిఖీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు విద్యాసంస్థలలో దళిత విద్యార్థులపై దాడుల నిరోధానికి మాజీ న్యాయమూర్తి కె. చంద్రు సిఫార్సులు అమలు చేయాలన్న డిమాండ్ గట్టిగా వినపడుతోంది.

పెరుగుతోన్న దాడులు..

బికాం చదువుతున్న 18 ఏళ్ల చిన్నదురై చదువులో రాణించడాన్ని జీర్ణించుకోలేని అతని స్నేహితులు 2023లో మొదటిసారి దాడి (Attack) చేశారు. అతని ఇంట్లోకి ప్రవేశించి దాడికి తెగబడ్డారు. రక్షించేందుకు వచ్చిన అతని 14 ఏళ్ల చెల్లెల్ని కూడా గాయపర్చారు. ఈ ఘటనతో అప్రమత్తమయిన డీఎంకే (DMK) ప్రభుత్వం జస్టిస్ చంద్రు నేపథ్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు ఇవ్వాలని కోరింది.

ఈ వారం ప్రారంభంలో మరో ఘటన కూడా జరిగింది. పెన్సిల్ విషయంలో తిరునల్వేలిలో 8వ తరగతి విద్యార్థి క్లాస్‌మేట్‌తో గొడవపడింది. దాంతో కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనకు ముందు ఇద్దరు మైనర్లు బస్సులో గొడవపడ్డారు. బిల్‌హుక్‌తో దాడిచేసిన విద్యార్థిపై తూత్తుకుడి పోలీసులు నమోదు చేశారు. కులం కారణంగానే తమ కొడుకుపై దాడి చేశారని బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. గాయపడ్డ విద్యార్థి ఆసుపత్రిలో చేరడం వల్ల పబ్లిక్ పరీక్షకు కూడా హాజరు కాలేకపోయాడు.

పాఠశాలలను అప్రమత్తం చేసిన డీఈవో..

విద్యార్థులపై తోటి విద్యార్థులే దాడి చేస్తుండడంతో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. డీఈవో సూచనల మేరకు తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లోని చాలా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేయడం ప్రారంభించారు. పదునైన వస్తువులు (చాకు, కత్తెర) బ్యాగుల్లో ఉన్నాయా? అని చెక్ చేస్తున్నారు. విద్యార్థుల బ్యాగుల్లో మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లు, మెమరీ కార్డులు, పదునైన వస్తువులు ఉంటే స్వాధీనం చేసుకోవాలని తిరునెల్వేలి ముఖ్య విద్యా అధికారి ఎం. శివకుమార్ పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.

సిఫార్సుల అమలులో జాప్యం..

విద్యార్థులు రంగు దారాలు చేతికి కట్టుకుని రావడం, బొట్టు పెట్టుకుని పాఠశాలకు రావడం వల్ల విద్యార్థుల మధ్య మతపర విభేదాలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. ఆయన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. బాలల హక్కుల కార్యకర్త ఎం. ఆండ్రూ జెసురాజ్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. కమిషన్ సిఫార్సు అమలు చేస్తే కుల ఆధారిత వివక్ష ఉండదని అభిప్రాయపడ్డారు.

తల్లిదండ్రులది కూడా కీలక పాత్ర..

"కుల వివక్ష, హింసను మనం రాత్రికి రాత్రే అంతం చేయలేము. నిర్మూలనకు కొంత సమయం పడుతుంది. పిల్లలకు సామాజిక సమానత్వం గురించి అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులకు కూడా కీలక పాత్ర ఉందని జెసురాజ్ పేర్కొన్నారు.

తన సిఫార్సులను అమలు చేయడంలో జాప్యంపై వ్యాఖ్యానించడానికి జస్టిస్ చంద్రు (Justice Chandru) నిరాకరించారు. పాఠశాల విద్యా మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి కూడా దీనిపై స్పందించడానికి అందుబాటులో లేరు. అయితే ఏప్రిల్ 24న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల్లో కుల ఆధారిత హింసను అరికట్టడానికి కొత్త చర్యలను సూచించే అవకాశం ఉందని వర్గాలు ది ఫెడరల్‌తో తెలిపాయి.

జస్టిస్ చంద్రు సిఫార్సుల్లో కొన్ని..

''కులం, సామాజిక న్యాయం గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. హాజరు రిజిస్టర్‌లో కులాన్ని సూచించే కాలమ్ ఉండకూడదు. ఉపాధ్యాయులు విద్యార్థులను వారి కుల పేర్లతో పిలవకూడదు అనేవి సిఫార్సులలో ముఖ్యమైనవి.

Read More
Next Story