వయనాడ్ జిల్లాలో దుర్భర పరిస్థితులు..శిథిలాల మధ్యే జీవనం
x
సుశాంత్ నాయర్

వయనాడ్ జిల్లాలో దుర్భర పరిస్థితులు..శిథిలాల మధ్యే జీవనం

కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో భారీ వర్షానికి కొండ చెరియలు విరిగి పడి 291 మందికి పైగా మరణించారు. మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు.


కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో భారీ వర్షానికి కొండ చెరియలు విరిగి పడి 291 మందికి పైగా మరణించారు. మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. కొండచెరియలు విరిగిపడ్డ చూరన్‌మళ ప్రాంతానికి ఫెడరల్ టీం చేరుకుంది. ఘటన ప్రాంతంలో దాదాపు అన్ని ఇళ్లు ఖాళీగా కనిపించాయి. వాయనాడ్‌లో చిన్నపాటి వ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సుశాంత్ నాయర్ ఇల్లు.. కొండచెరియలు విరిగిపడిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఉంది. తలుపులు దగ్గరకు వేసి ఉండడంతో నాయర్ ఇంటి తలుపు తట్టాం. నాయర్ కళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. దుర్ఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన తండ్రి ఇక లేడని బాధతో చెప్పాడు. తనవద్దే ఉండే తల్లి ఘటన తర్వాత సోదరుడితో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయిందని చెప్పాడు. కొండచరియలు విరిగిపడటంతో తన దుకాణం దెబ్బతిందని, జీవనోపాధి కోల్పోయానని చెప్పాడు. అష్రఫ్ అనే మరో వ్యక్తి దుకాణం కూడా ఇలాగే పూర్తిగా దెబ్బతింది. అష్రఫ్ ప్రభుత్వ సూచనతో ఇంటిని ఖాళీ చేసేశాడు. కాని దుకాణంలో ఉండిపోయిన డబ్బుల పెట్టే కోసం వెతుకుతున్నాడు. వెతికి పెట్టమని భద్రతా సిబ్బంది సాయం కోరుతూ కనిపించాడు.

సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

నాయర్ తన భద్రతపై ఎలాంటి భయం లేదని, తాను నివసించే చోట కొండచరియలు విరిగిపడవని నమ్మకంగా చెప్పాడు. వర్షాలు ఇంకా కురుస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో దాదాపు అన్ని ఇళ్లు తాళాలతో కనిపించాయి.

వయనాడ్ జిల్లాలో దుర్భర పరిస్థితులు..శిథిలాల మధ్యే జీవనంచూరల్‌మల సమీపంలోని వల్లర్‌మల ప్రాంతంలో కూడా ఫెడరల్ టీం పర్యటించింది. బురదతో సగం ఇళ్లు పూడుకుపోయింది. శిథిలాల్లో వెల్లికుట్టి కుమారుడు రమేష్ వికి చెందిన కేరళ గ్రామీణ బ్యాంకు పాస్‌బుక్ దొరికింది. పాస్‌బుక్‌లో ఉన్న ఫోన్ నంబర్‌ ఆధారంగా రమేష్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు దాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి అధికారి రాజన్ జెకి అందజేశారు. ఇలా దొరికిన కాగితాలు, పత్రాల ఆధారంగా వాటి యజమానులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని రాజన్ చెప్పారు. స్పందన లేకుంటే వ్యక్తి తప్పిపోయాడా? సురక్షితంగా ఉన్నాడా అని నిర్ధారించుకోడానికి ఆ పత్రాలను పోలీసులకు అందజేస్తామని ఆయన చెప్పారు.

Read More
Next Story