శబరిమలకు భక్త జన ప్రవాహం, తొమ్మిది రోజుల్లో ఆరు లక్షల మంది రాక..
దేవభూమి కేరళలోని శబరిమల యాత్ర సీజన్ ప్రారంభం అయింది. ఆలయం తెరిచినప్పటి లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని..
శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. తొమ్మది రోజుల క్రితమే అయప్ప దర్శనం సీజన్ ప్రారంభం అయింది. పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కోలాహాలంగా మారడంతో పాటు ఆదాయం భారీగా పెరుగుతోంది.
ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ (TDB) ప్రెసిడెంట్ PS ప్రశాంత్ మాట్లాడుతూ.., ఈ సీజన్‌లో మొదటి తొమ్మిది రోజులలో ఆలయ ఆదాయం ₹41.64 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ₹13.37 కోట్లు అదనంగా ఆదాయం సమకూరిందన్నారు.
శనివారం వరకూ ఆలయాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 6.12 లక్షల మంది స్వాములు దర్శనం చేసుకున్నారని, ఆదాయంలో అరవణ అమ్మకం( ప్రసాదం) ద్వారా ₹17.71 కోట్లు, అప్పం అమ్మకాలతో ₹2.21 కోట్లు ఆదాయం సమకూరిందని అన్నారు.
ఎరుమేలీ, పంపా సత్రంలోని స్పాట్ బుకింగ్ కేంద్రాలకు వచ్చిన అపూర్వ స్పందనను శ్రీ ప్రశాంత్ హైలైట్ చేశారు. భక్తులు తమ ఇరుముడికెట్టులో ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లకుండా తంత్రి కందరారు రాజీవరు జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.
గత ఏడాదిలో...
శబరిమలలో గత ఏడాది 39 రోజుల్లో రూ. 204 కోట్ల ఆదాయం సమకూరిందని ట్రావెన్ కోర్ సంస్థానం తెలిపింది. వార్షిక పాదయాత్ర ప్రతిసంవత్సరం మండల పూజతో ముగుస్తుంది. ఇందులో ప్రధాన ఆదాయంగా అరవణ ప్రసాదం అమ్మకాలు ద్వారానే సమకూరింది.
మొత్తం ఆదాయంలో రూ. 96 కోట్లు వీటి ద్వారా సమకూరాయి. హుండీ ఆదాయంగా రూ. 63 కోట్లు వచ్చాయి. అప్పం అనే ప్రసాదం ద్వారా రూ. 12.38 కోట్లు సమకూరాయి. గత సీజన్ లో దాదాపు 31 లక్షల పైలుకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో దేవస్థానం బోర్డు 7 లక్షల మందికి ఉచిత ఆహారాన్ని అందించిందని తెలిపింది. దేవస్థానంలో అత్యంత ముఖ్యమైన మకరవిళక్కు పూజ జనవరి 15 న జరగుతుంది.
Next Story