ధర్మస్థల: నా ఫిర్యాదును ఉపసంహరించుకుంటాను: సుజాత భట్
x
సుజాత భట్

ధర్మస్థల: నా ఫిర్యాదును ఉపసంహరించుకుంటాను: సుజాత భట్

ఈ ఆరోపణల వెనక వేరే వ్యక్తులు ఉన్నారని, వారి పేర్లను వెల్లడించిన భట్


ధర్మస్థల పర్యటనకు వెళ్లిన తన కూతురు కనిపించకుండ పోయిందని తప్పుడు కథనాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించి, ఆపై పొంతన లేని సమాధాలు చెప్పి దొరికిపోయిన సుజాత్ భట్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని చెప్పారు.

ధర్మస్థల కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సుజాత భట్ ను వరుసుగా మూడో రోజు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా నీళ్లు నమిలిన సుజాత.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

ఆమె చేసిన ప్రకటనలు, దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా పొంతన లేదని గుర్తించారు. తన కుమార్తె అదృశ్యం ఒక పెద్ద కుట్రలో భాగం అని సుజాత గతంలో పేర్కొన్నారు.

దానితో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లను శుక్రవారం ఆమె దర్యాప్తు అధికారులకు వెల్లడించారు. అయితే సిట్ అధికారులు మాత్రం వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.

ప్రస్తుతం సుజాత భట్ చెప్పిన విషయాలను ధృవీకరించుకునే పనిలో పోలీస్ అధికారులు చెప్పారు. తప్పిపోయిన బాలికల వివరాలను సైతం అధికారులు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం సుజాత తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పటికీ ఈ విషయం తీవ్రమైన ఆరోపణలు, అలాగే న్యాయ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభం అయిన నేపథ్యంలో సిట్ తన దర్యాప్తును కొనసాగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్పారు.
రాజకీయ వివాదాలు, బహిరంగ చర్చలకు దారితీసిన ఈ కేసును నిశితంగా పరిశీలిస్తున్నామని రాబోయే వారాల్లో సిట్ మధ్యంతర నివేదికను సమర్పించే అవకాశం ఉందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
సుజాత భట్ తప్పుడు కథనాలు..
ధర్మస్థలలో చిన్నయ్య అనే వ్యక్తి తాను అనేక వందలాది మహిళల మృతదేహాలను స్వయంగా పూడ్చినట్లు, వారిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. చిన్నయ్య సూచించిన ప్రదేశాలలో తవ్వకాలు జరిపినప్పటికీ అక్కడ ఎలాంటి మానవ అవశేషాలు దొరకలేదు.
ఈ కథనం మరింత రక్తికట్టించడానికి సుజాత భట్ తన కూతురు కూడా ధర్మస్థలలో అదృశ్యమైనట్లు మీడియా ముందుకు వచ్చారు. తను మంగళూర్ లో డాక్టర్ చదువుతున్నట్లు 2003 లో ధర్మస్థలకు వచ్చినట్లు ప్రకటించారు. ఓ వారం తరువాత తన కూతురు అంటూ ఓ ఫోటో విడుదల చేశారు. అయితే దర్యాప్తులో ఇవన్నీ అబ్దదాలని తేలింది. దానికి తగ్గట్లే తన ఫిర్యాదును ప్రస్తుతం ఉపసంహరించుకున్నారు.
Read More
Next Story