
'ఓరనియిల్ తమిళనాడు' పేరిట డీఎంకే డిజిటల్ డ్రైవ్..
మమ్మల్ని కాపీ కొడుతున్నారన్న బీజేపీ నేతలు..
తమిళనాడులో డీఎంకే(DMK)డిజిటల్ డ్రైవ్ చేపట్టనుంది. ప్రత్యేకంగా తయారుచేయించిన యాప్‌లో జూలై 1 నుంచి ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ జరగబోతుంది. వివరాలు నమోదు చేసే ప్రక్రియను DMK డిజిటల్ ఏజెంట్లకు అప్పగించింది. 2014-2019 మధ్యకాలంలో ఉత్తర భారతదేశంలో బీజేపీ ఇలాంటి కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు DMK దాన్ని ఫాలో అవుతోంది. 'ఓరనియిల్ తమిళనాడు' (ఒకే గొడును కింద తమిళనాడు) అనే కొత్త సభ్యత్వ డ్రైవ్‌తో డీఎంకే, 2014–2019లో బీజేపీ చేసిన గ్రౌండ్ గేమ్‌ను అనుకరిస్తోంది.
సోషల్ మీడియాలో బీజేపీ vs డీఎంకే
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీ(BJP), డీఎంకే అనుచరుల సంఖ్యను పరిశీలిస్తే..డీఎంకే కంటే కాషాయ పార్టీకి ఫాలో అవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఉదాహరణకు DMK IT విభాగం ఎక్స్ పేజీని కేవలం 3.2 లక్షల మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే బీజేపీ తమిళనాడు యూనిట్‌కు 6.3 లక్షల మంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో DMK కి కేవలం 1.1 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. బీజేపీకి 2.95 లక్షల మంది ఉన్నారు. ఫేస్‌బుక్ విషయానికొస్తే DMK కి కేవలం 2.02 లక్షల మంది ఫాలోవర్లు ఉంటే బీజేపీ తమిళనాడు యూనిట్‌కు 11 లక్షల మంది ఉన్నారు.
‘మమ్మల్ని ఫాలో అవుతున్నారు..’
డీఎంకే చేపట్టిన డిజిటల్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను మా నుంచే కాపీ కొట్టారని తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకులు అంటున్నారు. కనీసం ఇప్పుడైనా డీఎంకే డిజిటల్ ప్లాట్‌ఫాంల ప్రాముఖ్యాన్ని గుర్తించినందుకు సంతోషంగా ఉందని బీజేపీ ఉపాధ్యక్షుడు, అధికారిక ప్రతినిధి నారాయణన్ తిరుపతి అన్నారు.
"డిజిటల్ క్యాంపెయిన్స్ ద్వారా యువతతో టచ్‌లో ఉండడం సంతోషంగా ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల మీదే పనిచేయడానికి మా వద్ద దాదాపు వెయ్యి మంది సిబ్బంది ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ కోసం పనిచేయడం అంటే దాదాపుగా క్షేత్రస్థాయిలో పనిచేయడంతో సమానం. మేం పదేళ్ల క్రితం చేసిన ప్రయత్నాన్ని డీఎంకే కాపీ కొడుతోంది," అని నారాయణన్ ది ఫెడరల్‌తో అన్నారు .
నారాయణన్ వ్యాఖ్యలను ఖండించిన రాజీవ్
అయితే తమ పార్టీ బీజేపీని కాపీకొడుతుందన్న నారాయణన్ తిరుపతి వ్యాఖ్యలను డీఎంకే అధికార ప్రతినిధి రాజీవ్ ఖండించారు. బీజేపీ విధానాన్ని తాము అనుసరించడం లేదన్నారు. "బీజేపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో చాలామంది తమ వివరాలు నమోదు చేసుకుని ఉండొచ్చు. ఫాలో అవుతూ ఉండొచ్చు. అయితే తమిళనాడులో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిని మీరు చూడవచ్చు. మా విషయానికొస్తే.. సందర్భాన్ని బట్టి కొత్త వ్యూహాలను రూపొందిస్తాం. ఈసారి ఇంటింటికీ సభ్యత్వ నమోదుతో పాటు ఆ వివరాలను యాప్‌లోనూ ఎంట్రీ చేస్తున్నాం," అని రాజీవ్ ది ఫెడరల్‌తో అన్నారు .
'ఓరనియిల్ తమిళనాడు' మెంబర్‌షిప్ డ్రైవ్‌లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 30శాతం ప్రజలను డీఎంకే సభ్యులగా ఎంట్రీ చేస్తాము. వివిధ జిల్లాల్లో పనిచేసే ఐటీ వింగ్ యూనిట్లు తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలను 10 జోన్‌లుగా విభజించాయి. ప్రతి నియోజకవర్గంలో సభ్యుల వివరాలు ఎంట్రీ చేయడంలో జోనల్ ట్రైనర్లు, సోషల్ మీడియా సభ్యులు సాయపడతారు. అని చెప్పారు రాజీవ్.
అనుమతితోనే ఎన్‌రోల్‌మెంట్:డీఎంకే
గతేడాది తమిళనాడు బీజేపీ యూనిట్ మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా చేపట్టారో రాజీవ్ గుర్తు చేశారు. "తమిళనాడులో వారి పార్టీని మిస్డ్ కాల్ పార్టీ అని పిలుస్తారు. మేము వాళ్లలాగా ఫేక్ నంబర్లతో వివరాలు ఎంట్రీ చేయం. యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నా.. వ్యక్తుల అనుమతితోనే చేస్తాం," అని ఆయన ది ఫెడరల్‌తో అన్నారు. యాప్‌లో వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని, డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీతో పంచుకోమని చెప్పారు.
'ప్రతిఒక్కరూ ఓటరు కాకపోవచ్చు'
డిజిటల్ డిజిట్స్ ఆకట్టుకునేలా కనిపించినా.. ఎన్‌రోల్ అయినవాళ్లంతా అదే పార్టీకి ఓటు వేస్తారన్న నమ్మకం లేదని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజకీయ విశ్లేషకుడు, సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ తెలిపారు. ఆయన మూడు దశాబ్దాలుగా భారత ఎన్నికలను అధ్యయనం చేస్తున్నారు. ఒక వ్యక్తి తనంతకు తానుగా ఎన్‌రోల్ అయితే అతను ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మరొకరి ద్వారా ఎన్‌రోల్ అయితే ఆయన అదే పార్టీకి ఓటు వేస్తాడన్న నమ్మకం ఉండదు, ’’
మొత్తంమీద బీజేపీ, డీఎంకే కాలానుగుణంగా వెళ్లున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్ కావాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి.