రెండు దశాబ్దాల్లో కర్నాటకను ఎన్ని సెక్స్ స్కాండల్ కుదిపేశాయో తెలుసా?
x
ఫొటో: ఐ స్టాక్

రెండు దశాబ్దాల్లో కర్నాటకను ఎన్ని సెక్స్ స్కాండల్ కుదిపేశాయో తెలుసా?

కర్నాటకలో తాజాగా జరిగిన ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ మొదటిదేం కాదు. గత రెండు దశాబ్దాల కాలంలో ఇక్కడ అనేక సెక్స్ స్కాండల్ కేసులు నాయకులపై నమోదు కావడం..


ఈ మధ్య కర్నాటకను హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పాల్పడిన సెక్స్ స్కాండల్ భారీ కుదుపుకుదిపిందనే చెప్పాలి. అయితే ఈ తరహా సెక్స్ స్కాండల్ లో ఇరుక్కోవడం కర్నాటక రాజకీయ నాయకులకు కొత్తకాదు. గత రెండు దశాబ్దాలుగా కర్నాటక శాసన సభలో అశ్లీల వీడియోలు చూడటం, సిడిలు, పెన్ డ్రైవ్ లకు సంబంధించిన కేసులతో రాష్ట్ర మొత్తం అతలాకుతలమైంది. తాజాగా ప్రజ్వల్ దురాగతాలను పెన్ డ్రైవ్ రూపంలో బయటపడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పవచ్చు.

ఎన్నో కుంభకోణాలు
కర్ణాటకలోని పలువురు రాజకీయ నాయకులు వ్యక్తిగత లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కొంటున్నారు. కొన్ని కేసులు చట్టబద్ధంగా పరిష్కరించబడగా, మరికొన్ని ఇంకా విచారణ దశలో ఉన్నాయి. ఇందులో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ కు ఒకటి, జనతాదళ్ సెక్యూలర్ ఒకటి, భారతీయ జనతాపార్టీకి చెందిన నాయకులపై ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మేము వాటిని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
రేణుకాచార్య కేసు: JDS-BJP సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రేణాకాచార్య, 2007లో ఒక నర్స్ ను ముద్దుపెట్టుకున్న ఫొటోలు బయటకు రావడంతో వివాదంలో చిక్కుకున్నారు. తరువాత నర్సు కూడా తనపై మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కొన్ని ఫొటోలను విడుదల చేసింది. తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాల్సి వచ్చిందని ఆరోపించింది. దాంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆచార్య బీజేపీ కురు వృద్ధుడు బీఎస్ యడియూరప్పకి ఆప్త మిత్రుడు. కానీ మూడు సంవత్సరాల తరువాత ఆమె తన కేసును ఉపసంహరించుకుంది. కానీ ఈ కేసు బీజేపీని బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు.
హరతలు హాలప్ప అత్యాచారం కేసు : 2009లో మాజీ ఆహార, పౌర వ్యవహారాల శాఖ మంత్రి హరతలు హాలప్ప తన స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడని ఆరోపించడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ కేసు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. అయితే 2017లో ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.
అశ్లీల వీడియోలు అసెంబ్లీలో : 2012లో బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ మంత్రులు లక్ష్మణ్‌ సవాది, సీసీ పాటిల్‌, కృష్ణ పాలేమర్‌లు అసభ్యకరమైన వీడియోలు చూస్తూ పట్టుబడ్డారు. ఈ కేసు శాసనససభను కుదిపేసింది. ప్రజా ఆగ్రహంతో హోంశాఖ విచారణకు ఆదేశించింది. ముగ్గురు తమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. అనంతరం మంత్రి వర్గ ఉపసంఘం వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.
మేటి సెక్స్ కుంభకోణం : 2016లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్సైజ్ మంత్రి హెచ్‌వై మేటి సెక్స్ స్కాండల్ కూడా చాలా సంచలనం సృష్టించింది. తన వద్దకు బదిలీ కోసం వచ్చిన ఉద్యోగినిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన మాజీ సెక్యురిటీ సభ్యుడు వైరల్ చేశాడు. తరువాత ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. తరువాత కేసును సీఐడీకి బదిలీ చేశారు. అనంతరం మహిళ కేసును ఉపసంహరించుకుంది.
అరవింద లింబావళి వీడియో: జూలై 2019లో, బెంగుళూరుకు చెందిన బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరవింద లింబావళిని మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ అయ్యింది.అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ లో అది నకిలీ వీడియో అని ప్రకటించడంలో వివాదం సద్దుమణిగింది.
రమేష్ జార్కిహోలి CD: మార్చి 2020లో, బిజెపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రమేష్ జార్కిహోలి ఒక వీడియోలో అసభ్యకరకరంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. తనకు ఉద్యోగం ఇప్పించాలంటే.. నాకు ఫిజికల్ ఎక్స్ చేంజ్ జరగాలనే షరతు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తన కష్టాలకు కారణం కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అని ఆయన ఆరోపించారు. కేసు ఇంకా కోర్టు విచారణలో ఉంది.
ప్రజ్వల్ రేవణ్ణ: తాజా కుంభకోణంలో JD-S ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్నట్లు తేలింది, ఈ అసభ్యకరమైన వీడియోలతో జేడీఎస్ ప్రజల ఆగ్రహానికి కారణమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకొచ్చి విచారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్‌ అయ్యారు.ఇప్పటి వరకూ ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
Read More
Next Story