
బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావుకు భారీ జరిమానా..
మరో ముగ్గురికి కూడా..
బంగారం అక్రమ రవాణా కేసులో(Gold smuggling case) కన్నడ సినీ నటి రన్యా రావు(Ranya Rao)కు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా రూ.50 కోట్లకు పైగా ఫైన్ వేశారు. ప్రస్తుతం బెంగళూరు(Bangalore) సెంట్రల్ జైలులో ఉన్న వీరికి DRI అధికారులు జరిమానా నోటీసును మంగళవారం అందజేశారు. మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి కె. రామచంద్రరావు సవతి కూతురు రన్యరావు నుంచి 14.8 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.
Next Story