డ్రగ్స్ కింగ్ పిన్ సాధిక్ అరెస్ట్: డీఎంకేపై అన్నామలై విమర్శలు
x

డ్రగ్స్ కింగ్ పిన్ సాధిక్ అరెస్ట్: డీఎంకేపై అన్నామలై విమర్శలు

రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత ముసుగులో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న జాఫర్ సాధిక్ ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై అన్నామలై డీఎంకే పై ..


సినీ నిర్మాత ముసుగు, రాజకీయ పార్టీ నాయకుడిగా చెలామణి అవుతూ దేశంలో డ్రగ్స్ దందా నడుపుతున్నా కీలక సూత్రధారి జాఫర్ సాధిక్ ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు నాలుగు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న భారీ తిమింగలాన్ని పోలీసులు ఎన్నో శ్రమలకోర్చి పట్టుకున్నారు. జాఫర్ సాధిక్ డీఎంకే పార్టీలో చురుకుగా ఉండేవాడు. ఇదే సమయంలో సినీ నిర్మాత అవతారం ఎత్తాడు. ఇలా దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ కు పాల్పడ్డాని నార్కోటిక్ విభాగం గుర్తించింది. అయితే పోలీసుల రాకను గుర్తించిన సాధిక్ తప్పించుకుని పారిపోయాడు.

చెన్నై కేంద్రంగా భారత్-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ దేశాల మధ్య మాదక ద్రవ్యాలను తరలించేవాడు. ఈ దేశాలకు సరఫరా అయ్యే మొత్తం డ్రగ్స్ దందాకు ఇతడే కింగ్ పిన్ అని తేలింది. "అతను 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను విదేశాలకు 45 సార్లు పంపాడు" అని NCB అధికారిని ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
మరో ముగ్గురు అరెస్టు
డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో భాగమైన మరో ముగ్గురిని కూడా సెంట్రల్ డ్రగ్-బస్టింగ్ ఏజెన్సీ ఢిల్లీ లో అరెస్టు చేసింది, అయితే వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రహస్యప్రాంతంలో ఉంచి వారిని విచారిస్తున్నారు.
పరారీలో ఉన్న సాదిక్‌ను అరెస్టు చేయడానికి వారం రోజుల ముందు, మదురైలోని ఇద్దరు రైలు ప్రయాణికుల నుంచి అలాగే చెన్నైలోని డంప్ యార్డ్ నుంచి రూ. 180 కోట్ల విలువైన 36 కిలోల మెథాంఫెటమైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు న్యూస్ ఛానెల్ తెలిపింది. ఈ మాదక ద్రవ్యాల సరుకు శ్రీలంకకు వెళ్లడానికి సిద్దం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డీఎంకేపై విమర్శలు గుప్పించిన తమిళనాడు బీజేపీ చీఫ్
తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై, అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించాడు. సాధిక్ కు డీఎంకే నాయకులను సత్సంబంధాలు ఉన్నాయని, వారు తరుచూ సాధిక్ ను కలిసేవారని విమర్శించారు. “ఎన్‌సీబీ ఈ రోజు ఇంటర్నేషనల్ డ్రగ్ కింగ్ పిన్ & డిఎంకె కార్యకర్త జాఫర్ సాదిక్‌ను అరెస్ట్ చేసింది. సాధిక్ గత మూడు సంవత్సరాలుగా డీఎంకే నాయకులతో సన్నిహితంగా మెలిగాడు. దీనిని మీరు అర్థం చేసుకోండి. మనీలాండరింగ్ కు ఎలా పాల్పడ్డారో అర్థం చేసుకోండి ”అని అన్నామలై గతంలో ట్విట్టర్‌లో ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో రాశారు.

డీఎంకే హయాంలో తమిళనాడులోకి వస్తున్న మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి సాధిక్ నెట్వర్క్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయన కోరాడు.
ఈ కేసులో అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ బీ ఐ (FBI) కూడా కూడా విచారణలో NCBకి సహాయం చేస్తోంది.
మెథాంఫేటమిన్ అత్యంత వ్యసనపరుడైన సైకోట్రోపిక్ డ్రగ్ కాబట్టి దానిని తీసుకునే వారిపై ప్రాణాంతక ప్రభావాలను కలిగిస్తుంది. దీనిని 'ఐస్' లేదా 'క్రిస్టల్ మెత్' అని కూడా పిలుస్తారు, మెథాంఫేటమిన్ కొకైన్ వంటి బలమైన ఆనందకరమైన ప్రభావాన్ని మానవ మెదడు పై చూపుతుంది.
Read More
Next Story