కేరళ లో రాష్ట్రాల ఆర్థిక సదస్సు.. కేవలం వారికి మాత్రమే ఆహ్వానం
x

కేరళ లో రాష్ట్రాల ఆర్థిక సదస్సు.. కేవలం వారికి మాత్రమే ఆహ్వానం

వచ్చే 16 ఆర్థిక సంఘంలో తమ వాటా పెంచుకునేందుకు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కేరళలో సమావేశం కాబోతున్నారు.


వచ్చే 16 వ ఆర్థిక సంఘంలో తమ ఆర్థిక సమస్యలు పరిష్కరించే వ్యూహాలపై చర్చించేందుకు దక్షిణ భారత్ నుంచి నాలుగు రాష్ట్రాలు, ఉత్తర భారత్ నుంచి ఐదు రాష్ట్రాలకు కేరళ అతిథ్యం ఇవ్వనున్నట్లు రాష్ట్రమంత్రి కెఎన్ బాలగోపాలన్ ప్రకటించారు. వామపక్షాల పాలనలో ఉన్న కేరళ, ఆప్‌ పాలిత పంజాబ్‌తో పాటు తమిళనాడు (డీఎంకే), కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఈ సదస్సులో పాల్గొంటాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తమ బేరసారాల స్థితిని బలోపేతం చేసుకునేందుకు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంగా లెఫ్ట్ ప్రభుత్వం ఇలాంటి సమావేశాలకు అతిథ్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కేంద్రం తన రుణ సామర్థ్యానికి పరిమితులు విధించడంపై కేరళ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. సెప్టెంబరు 12న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించనున్న ఈ కాన్‌క్లేవ్ దేశంలోని సహకార, ఆర్థిక సమాఖ్యను 'రక్షించడం.. బలోపేతం చేయడం' లక్ష్యంగా పెట్టుకుందని బాలగోపాల్ చెప్పారు.
హాజరైనవారు
ఆయనతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క , కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ, పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా పాల్గొంటారని బాలగోపాల్ తెలిపారు.
మొత్తం ఐదు రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులతో సహా అధికారులు, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వంటి పలువురు సబ్జెక్టు సంబంధిత నిపుణులు కూడా హాజరవుతారని మంత్రి తెలిపారు. దేశంలో ఆర్థిక సమాఖ్యవాదం చాలా వరకు సవాలులో ఉందని అందుకే కేరళ ఈ కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తోందని ఆయన అన్నారు.
“ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అభివృద్ధి.. ఆర్థిక సమస్యలను కాన్సెప్ట్ చేసి 16వ ఆర్థిక సంఘం ముందు సమర్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఆరోగ్యకరమైన కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వం అవసరం అని బాలగోపాల్ అన్నారు.
"నిధుల పంపిణీ లో అన్యాయం..
రాష్ట్రాలకు నిధుల పంపిణీలో అన్యాయమైన పద్ధతులను అవలంబించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నదని మంత్రి విమర్శించారు.
కేంద్రం రాష్ట్రాల నుంచి సెస్, సర్‌చార్జ్‌ల రూపంలో భారీ మొత్తంలో ఆదాయాన్ని సేకరిస్తుంది, ఇది విభజన పూల్‌లో పెట్టలేదని ఆయన ఆక్షేపించారు. అందువల్ల ఆ మొత్తంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల వాటా రాష్ట్రాలకు దక్కటం లేదని చెబుతున్నారు. 2011-12లో కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో సెస్సు, సర్‌చార్జ్‌ల వాటా 9.4 శాతం ఉండగా, 2022-23 నాటికి అది 22.8 శాతానికి చేరుకుందని ఆయన చెప్పారు.
ఫలితంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 41 శాతం మేరకు కేంద్రం రాబడిలో రాష్ట్రాలకు 29.6 శాతం మాత్రమే లభిస్తుందని బాలగోపాల్ చెబుతున్నారు.
వివక్షతతో కూడిన విధానం
రాష్ట్రాలకు రుణాలు తీసుకునే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత ధోరణి కూడా ఉందని మంత్రి ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటాను అందుకోవాలని, స్థానిక సంస్థలకు గ్రాంట్లు సకాలంలో పెంచాలని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నందున ప్రత్యేక అదనపు సహాయానికి కేరళ కూడా అర్హత సాధించిందని ఆయన చెప్పారు.
"ఇతర రాష్ట్రాలు కూడా ఈ రకమైన ఆర్థిక వివక్షను ఎదుర్కొంటున్నాయి, ఈ విషయాలన్నీ సమ్మేళనంలో చర్చలో భాగంగా ఉంటాయి" అని ఆయన చెప్పారు.
Read More
Next Story