కవిత అరెస్ట్,  ఢిల్లీకి తరలింపు
x
kavita File photo

కవిత అరెస్ట్, ఢిల్లీకి తరలింపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అడుగుపెట్టనున్న సమయంలో కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపు చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రానున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈరాత్రి 9. గంటల ప్రాంతంలో ఆమెను ఢిల్లీకి తరలిస్తారు. ఆమెకు అరెస్టు అర్డర్ కూడా ఇడి అందించింది.





అసలేం జరిగిందంటే...

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నిందితురాలిగా ఉన్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు ఆమెను విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మహిళలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంటివద్దనే విచారించాలన్న నిబంధన ఉన్నందున తనను ఇంటి వద్దే విచారించాలంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈడీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 12మందితో కూడిన బృందం సోదాలు కొనసాగిస్తున్నారు. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో కవిత, ఆమె భర్త అనిల్‌ ఇంట్లోనే ఉన్నారు. సోదాల విషయం తెలుసుకొని కవిత నివాసానికి చేరుకొన్న బీఆర్ఎస్ లీగల్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ను అధికారులు అనుమతించలేదు. తనిఖీలు ముగిసిన తర్వాత ఆమెను కలవాలని ఈడీ అధికారులు సూచించారు.

భర్తకు సమాచారం అందించారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవితను ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె భర్త డి ఆర్ అనిల్ కుమార్ కు కూడా తెలిపారు.




ఆమెను ఏ క్షణమైనా అరెస్ట్ చేసినట్టు ఈడీ ప్రకటించే చాన్స్ ఉంది. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా సోదాలు జరిగాయి. అనంతరం సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఆమె ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమయ్యాయి. ఈడీ, ఐడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున ఆమె నివాసం వద్ద మోహరించారు. ఇప్పటికే కవిత, ఆమె సహాయకుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ, ఐటీ అధికారులు జాయింట్ సోదాల్లో చాలా ఆధారాలు దొరికాయని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం కవిత స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.

కవిత భర్త అనిల్ కుమార్ లావాదేవీలపైనా ఆరా..

మరోవైపు.. కవిత భర్త దేవనపల్లి అనిల్‌కుమార్‌కు సంబంధించిన లావాదేవీలపైనా ఆరా తీస్తోంది ఈడీ. దీంతో బీఆర్ఎస్‌లో ఆందోళన మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక బీఆర్ఎస్ అగ్రనేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేయాల్సి వస్తే.. ఆమెతో పాటు అనిల్‌ను కూడా అదుపులోనికి తీసుకుని విచారించే అవకాశాలూ లేకపోలేదు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ కార్యకర్తలు, కవిత అభిమానులు, అనుచరులు.. పలువురు నేతలు కవిత ఇంటికి చేరుకుంటున్నారు. అరెస్ట్ చేస్తారన్న వార్తలతో ఆందోళన చెందుతున్నారు. కవితకు సంబంధించిన రెండు ఫోన్లు, భర్త ఫోన్లు.. సహాయకుల ఫోన్లను ఇలా మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో ఏదో జరుగుతోందనే అనుమానం అభిమానుల్లో మరింత ఎక్కువవుతోంది.

ఈడీ అరెస్ట్ వారంట్ ఇచ్చింది

ఈ సోదాలకు సంబంధించి ఇడి కొద్ది సేపటి కిందట పూర్తి సమాచారం విడుదల చేసింది.. 12 మంది అధికారులతో కూడిన ఐదు బృందాలు కవిత ఇంట్లో మోహరించి ఉన్నాయి. ఈ 12 మందిలో ఐదుగురు మాత్రమే ఇంటి లోపలికి వెళ్లారని, మిగతావారు బయటజరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. మరోపక్క, ఇవాళ, రేపు కూడా సోదాలు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

అరెస్టు సమాచారం ఇదే





తనపై చర్యలు తీసుకోకుండా ఆపాలన్న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకూ ఎలాంటి అరెస్టులు ఉండవనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. సుప్రీం తీర్పు కచ్చితంగా కవితకు అనుకూలంగా వస్తుందని ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని కొందరు ఆమె అభిమానులు, అనుచరులు చెబుతున్న మాట. కవితను అరెస్ట్ చేస్తారా..? లేకుంటే సోదాలతోనే సరిపెడతారా..? అనే చర్చ ఓపక్క జరుగుతుండగానే మరోపక్క ఆమెను అదుపులోకి తీసుకోవడం దేనికి సంకేతమన్నది తెలియడం లేదు.

కవిత లాయర్ ఏమన్నారంటే...

కవిత పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఇలా సోదాలు చేయడమేంటి..?.. విచారణను ఈడీ పట్టించుకోదా..? అని కవిత లాయర్ సోమా భరత్ అని మండిపడుతున్నారు. తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు తీసుకోమని ఈడీ చెప్పిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు. కవితను అరెస్ట్ చేసే అవకాశం మాత్రం లేనేలేదంటున్నారు భరత్.


Read More
Next Story