ముడా కార్యాలయంలో ED సోదాలు
x

ముడా కార్యాలయంలో ED సోదాలు

ముడా ద్వారా తన భార్యకు 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.


మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) అక్రమాలకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, తదితరులపై నమోదయిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. మైసూరులోని ముడా కార్యాలయంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు. అయితే సీఎం, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో మాత్రం సోదాలు చేయడం లేదని ఈడీ పేర్కొంది.

ముడా ద్వారా తన భార్యకు 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీఎం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాను లేదా అతని కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని సీఎం ఖండిస్తున్నారు. ప్రతిపక్షాలు తనను చూసి భయపడుతున్నాయని, తనపై ఇదే మొదటి "రాజకీయ కేసు" అని ఆయన పేర్కొంటున్నారు.

అసలు కేసేమిటి?

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పథకంలో భాగంగా 50:50 భూ మార్పిడి పథకం ద్వారా లబ్ధి పొందారని కర్ణాటక సీఎం, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణ. మైసూరు వెలుపల 3.16 ఎకరాల భూమిని సిద్ధరామయ్య భార్యకు ఆమె సోదరుడు 2010లో బహుమతిగా ఇచ్చాడు. అయితే మైసూర్ అర్భన్ డెవలప్ మెంట్ భూసేకరణలో భాగంగా ఆ ల్యాండ్ తీసుకుని ఖరీదైన ప్రాంతంలో 14 ఇళ్ల స్థలాలు కేటాయించారు. అక్రమ భూ మార్పిడి వల్ల రాష్ట్రానికి ₹56 కోట్ల నష్టం వాటిల్లిందని సామాజిక కార్యకర్తలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తనను అధికారం నుంచి దింపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు.

Read More
Next Story