అధ్యాపకులకు శిక్షణ అవసరం: కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
x

అధ్యాపకులకు శిక్షణ అవసరం: కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

కాలానికి అనుగుణంగా బోధన పద్దతులు మారాలని, అందుకోసం ముందుగా అధ్యాపకులు అన్ని అంశాలపై పట్టుసాధించాలని కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు.


భవిష్యత్ కాలానికి అనుగుణంగా న్యాయ విద్యార్థులను తీర్చిదిద్దాలంటే అధ్యాపకులు కూడా అన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుందని కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మనుపాత్రో సహకారంతో ఆర్ వీ యూనివర్శిటీ ‘భవిష్యత్ కోసం న్యాయ అధ్యాపకుల సాధికారత’ అనే థీమ్ తో నిర్వహించిన సదరన్ రీజియన్ లా టీచర్స్ కాన్కేవ్ల్ 2023-24 కి ఆయన చీఫ్ గెస్ట్ గా హజరై, ప్రసంగించారు.

ప్రస్తుతం కాలంలో ముందు అధ్యాపకులు సైబర్ లా తో పాటు కొన్ని కాలానుగుణ అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని చీఫ్ జస్టిస్ సూచించారు. అప్పుడే విద్యార్థులకు పూర్తి పట్టు వస్తుందని, భవిష్యత్ లో సమర్థులైన న్యాయవాదులుగా మారతారని చెప్పారు. అందుకే న్యాయబోధకులకు చట్టాలలోని సూక్ష్మ అంశాలు లోతుగా అధ్యయనం చేసేందుకు తగిన శిక్షణ తీసుకోవాలన్నారు.

ఒకప్పుడు న్యాయ వ్యవస్థ ఏవిధంగా మార్పులకు గురైంది. ప్రస్తుతం ఎలా పనిచేస్తుందో వివరించే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు సీనియర్ న్యాయవాదుల కింద జూనియర్ గా చేరి అనేక అంశాలను పరిశీలన చేసి న్యాయవాదులుగా ఎదిగేవారని, ఇక ముందు అలా కుదరదని అభిప్రాయపడ్డారు. రాబోయే దశాబ్దకాలంలో సమాచారం, సాంకేతికతదే పై చేయి, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకుని ఎదగాలని నొక్కి చెప్పారు. 1990ల తరువాత న్యాయవాద విద్య ను ప్రత్యేకంగా ఐదు సంవత్సరాలుగా డిగ్రీగా ప్రవేశపెట్టారని, అది అప్పటి కాలానికి అనుగుణంగా మారిందని, అలాగే ప్రస్తుతం కూడా ఈ కాలానికి అనుగుణంగా బోధన పద్దతులు ప్రవేశపెట్టాలని కోరారు.

ఆర్ వీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వైఎస్ ఆర్ మూర్తి మాట్లాడుతూ ..ఈ కాంక్లేవ్ కోసం మనుపాత్రతో భాగస్వామ్యం కావడం సంతోషం. దేశంలో న్యాయవాద విద్యను అందించాలనే తపనతో ఈ యూనివర్శిటీ పుట్టిందన్నారు. న్యాయవిద్యలో మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు. న్యాయవాద వృత్తి అభ్యసిస్తున్న విద్యార్థులకు చట్టం, వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, ఉదారకళలు, సాంకేతికత వంటి విభాగాల మధ్య ఉన్న సంబంధం, వాటి మధ్య తేడాలు తెలుసుకోవడానికి కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలతో తాము భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు.

యూనివర్శిటీ స్థాపించి ఆరు నెలలు కాకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, వాటికి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్, జాతి వివక్ష వ్యవహరాలు చూసే ఐరాస ప్రతినిధి, ఎన్ హెచ్ ఆర్సీ ప్రతినిధులు వంటి గొప్పవారు హజరయ్యారని వివరించారు. అలాగే ఇప్పటి వరకూ మూడు అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించిందని గుర్తు చేశారు. వాటిలో భారత్ లో నిర్వహించిన జీ20 కింద సీ20, అలాగే వై20 ని నిర్వహించిదని చెప్పారు.

ఆర్ వీ విద్యాసంస్థలు బెంగళూర్ లో ఉన్నాయి. 84 సంవత్సరాల క్రితం ఇవి స్థాపించబడ్డాయి. 2021 నుంచి ఇదీ యూనివర్శిటీ కార్యకలాపాలు ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉదారవిద్యను అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇందులో లిబరల్ ఆర్ట్స్, సైన్స్, డిజైన్, ఇన్నోవేషన్, ఫిల్మ్ మీడియా, క్రియేటివ్ ఆర్ట్స్, బిజినెస్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, లా వంటి విభాగాలలో విద్యను అందిస్తోంది. అలాగే 60 అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, పీహెచ్ డీ పట్టాలు అందిస్తోంది. 160 ప్రఖ్యాత దేశీయ, విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

Read More
Next Story