ఆ దేవుడు కూడా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేడు
x

"ఆ దేవుడు కూడా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేడు"

బెంగళూరులో రోజురోజుకు పెరిగిపోతోన్న ట్రాఫిక్ సమస్యపై కర్ణాటక ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. "ఇవెన్ గాడ్ కాంట్ ఫిక్స్ బెంగళూరు ట్రాఫిక్" అని వ్యాఖ్యానించారు.


Click the Play button to hear this message in audio format

"దేవుడే వచ్చినా బెంగళూరు మారదంటూ.." కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. బెంగళూరులో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావన్నారు. స్వయంగా ఆ దేవుడే వచ్చినా సాధ్యంకాదన్నారు.

ట్రాఫిక్ సమస్య(Traffic) రోజురోజుకు పెరిగిపోతుండడం, మెట్రో విస్తరణ ఆలస్యం కావడం, ప్రజా రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంపై బెంగళూరు వాసులు కొంతకాలంగా అంసతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల డిజైన్ మార్గదర్శి "నమ్మ రస్తే" ఆవిష్కరణ సందర్భంగా డీకే మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కనీసం మూడేళ్లు పడుతుందని చెప్పారు. "బెంగళూరును ఇప్పటికిప్పుడు మార్చడం సాధ్యంకాదు. దేవుడే వచ్చినా అది సాధ్యపడదు. సరైన ప్రణాళికతో సమర్థవంతంగా ముందుకెళితేనే మార్పు సాధ్యం" అని పేర్కొన్నారు.

విపక్షాల ఆగ్రహం..

డీకే వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేత ఆర్. అశోక (R Ashoka) సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘డీకే శివకుమార్‌ లేదా ఆయన ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. కర్ణాటక, బెంగళూరుకు శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని చూస్తున్నారు’’ అని పెట్టారు.

సోషల్ మీడియాలో పెరిగిన వ్యతిరేకత..

ప్రముఖ ఆర్థికవేత్త, ఆరిన్ క్యాపిటల్ ఛైర్మన్ మోహందాస్ డీకే శివకుమార్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. "డీకే శివకుమార్ గారూ, మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లయ్యింది. మేం మీ నాయకత్వాన్ని స్వాగతించాం. గౌరవించాం. కానీ మా జీవితాలు మరింత దుర్భరంగా మారింది!" అని ట్వీట్ చేశారు. "పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటించారు. వాస్తవంగా ఏం చేశారు? కనీసం నగరాన్ని శుభ్రంగా ఉంచలేకపోయారు" అని విమర్శించారు.

"నగరాభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గల మంత్రే చేతులెత్తేయడం విచారకరం" అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "పరిశుభ్రత, ఫుట్‌పాత్‌ సమస్య, కాలుష్యం తదితర సమస్యలను పరిష్కరిస్తే నగర పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రస్తుత దుస్థితి నిర్లక్ష్య పాలనకు నిదర్శనం" అని మరొకరు ట్వీట్ చేశారు. అయితే కొందరు మాత్రం శివకుమార్ నిజాయితీని మెచ్చుకున్నారు. "వాస్తవ పరిస్థితి ఆయన నిజాయితీగా చెబుతున్నారు!’’ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు.


Read More
Next Story