పక్కరాష్ట్రం వాడికి రూ. 15 లక్షలు.. రైతులకు రూ. 2 వేల పరిహారం
x

పక్కరాష్ట్రం వాడికి రూ. 15 లక్షలు.. రైతులకు రూ. 2 వేల పరిహారం

రాహూల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజక వర్గానికి చెందిన వ్యక్తి కర్నాటకు చెందిన ఏనుగు దాడిలో మరణిస్తే పరిహారం ప్రకటించడం రాజకీయ దుమారానికి దారితీసింది.


కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఏనుగు దాడిలో చనిపోతే రూ. 15 లక్షలు పరిహారంగా చెల్లించారని, కర్నాటకలో తీవ్రంగా కరువు పరిస్థితులు ఉంటే హెక్టారుకు రూ. 2 వేలు మాత్రమే రైతులకు ప్రభుత్వం చెల్లిస్తోందని కర్నాటకలో ప్రతిపక్షాలు సిద్దరామయ్య సర్కార్ పై విరుచుపడ్డాయి. కర్నాటక ప్రజల సొమ్ములు పక్క రాష్ట్రమైన కేరళలో ముఖ్యంగా వయనాడ్ చెందిన వారికి పరిహారం రూపంగా చెల్లిస్తున్నారని బీజేపీ, జేడీఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు.

కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం రాహూల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు లక్షలకు లక్షలు పక్క రాష్ట్రాలకు ధారపోస్తోందని శికారిపుర బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. " కేరళ ఎంపీ రాహూల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రానికి చెందిన ఏనుగు, కేరళ వ్యక్తిని తొక్కిన కారణంగా ప్రభుత్వం చెల్లించిన రూ. 15 లక్షలు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఖండిస్తోంది" అని బీజేపీ రాష్ట్ర చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు.

కర్నాటక పన్ను చెల్లింపుదారుల సొమ్మును కాంగ్రెస్ పార్టీ తమ సొంత ఆస్థిలా వాడుకుంటోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేపై అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మీద మా పన్ను, మా హక్కు అంటూ ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసిన సీఎం సిద్దరామయ్యపై కూడా అశోక మండిపడ్డారు. ఇప్పుడు మీ హై కమాండ్ ను కూడా మా పన్ను, మా హక్కు అని అడిగే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

జేడీ(ఎస్) నాయకుడు మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయనాడ్ కు చెందిన వ్యక్తి ఏనుగుదాడిలో చనిపోతే రూ. 15 లక్షలు ఇస్తున్నారని, అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి చనిపోతే మాత్రం రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.

"కర్నాటకలో ఏనుగులో దాడిలో మరణించిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అంత తేలిగ్గా డబ్బుల ఇవ్వదు. వారు అనేకసార్లు అధికారులు, నాయకుల చుట్టూ తిరగాలి. కానీ వయనాడ్ కు చెందిన వ్యక్తి చనిపోతే మాత్రం జెట్ స్పీడ్ తో డబ్బులు అందజేస్తారు. ఇది ఈ ప్రభుత్వం కన్నడ ప్రజల పై చూపించే ప్రేమ" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. కర్నాటక ఇచ్చిన పరిహారం పై తనకు ఎలాంటి సమాచారం అందలేదని, పూర్తి విషయాలు తెలుసుకున్నాక స్పందిస్తామని చెప్పారు.

Read More
Next Story