బెంగళూరులో బోర్డు తిప్పేసిన ‘జస్ట్ సెట్ జర్నీస్‌’..
x

బెంగళూరులో బోర్డు తిప్పేసిన ‘జస్ట్ సెట్ జర్నీస్‌’..

అన్‌స్కిల్డ్ కార్మికుల నుంచి రూ. 5 కోట్లు గుంజేసిన జాబ్ కన్సల్టెన్సీ..


Click the Play button to hear this message in audio format

ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని కోరిన నిరుద్యోగులకు తొలుత వైద్య పరీక్షలు చేయిస్తారు. విద్యార్హతకు సంబంధించిన డాక్యుమెంట్ల తీసుకుంటారు. స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకుని, చెక్కులు తీసుకుంటారు. అప్పుడప్పుడు ఈ మెయిళ్లకు స్పందిస్తూ నమ్మకంగా ఉన్నట్లు వ్యవహరిస్తారు. కాని ఒక్కసారిగా బోర్డు తిప్పేశారు. నకిలీ జాజ్ కన్సల్టెన్సీ వ్యవహారం బెంగళూరులో వెలుగుచూసింది.

బెంగళూరు(Bengaluru)లో ఓ జాబ్ కన్సలెన్టీ ఏజెన్సీ (Job Consultancy) బోర్డు తిప్పేసింది. విదేశాల్లో ఉదోగ్యం చూపిస్తామని తమిళనాడుకు చెందిన అన్‌స్కిల్డ్ కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌కు చెందిన చాలా మంది నిరుద్యోగుల నుంచి రూ.5 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ జాబ్ కన్సల్టెన్సీ గురించి ఎలా తెలిసింది?

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఉద్యోగ ప్రకటన చూసి 22 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న నిరుద్యోగులు ‘జస్ట్ సెట్ జర్నీస్‌’(Just Set Journeys) కి కాల్ చేశారు. ఈ జాబ్ కన్సలెన్టీ ఏజెన్సీకి రివ్యూస్ కూడా బాగుండడంతో నమ్మేశారు.

‘ఒకటిన్నర లక్షల కట్టా..’

"లక్సెంబర్గ్‌లో ఉద్యోగం కోసం జస్ట్ సెట్ జర్నీస్‌ను అప్రోచ్ అయ్యా. జాబ్ ఏజెన్సీ మూసివేయడానికి ముందు రోజు కూడా నేను వాళ్ల ఎగ్జిక్యూటివ్‌కు కాల్ చేశా. నా ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడా,’’ అని బాధితుల్లో ఒకరైన సీలన్ ది ఫెడరల్‌కు చెప్పారు. ‘‘డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ చేయడంలో నిజాయితీగా చేయడంతో గుడ్డిగా నమ్మి వాళ్లకు రూ. 1.5 లక్షలు చెల్లించాను.’’ అని వాపోయారు.

‘మంచి జీతం దొరుకుతుందని..’

‘‘నేను బికాం పూర్తి చేశా. ఉద్యోగం కోసం వెతుకుతున్నా. ఎక్కడా జాబ్ దొరకకపోవడంతో ‘జస్ట్ సెట్ జర్నీస్‌’ను కాంట్రాక్టు అయ్యా. ఆస్ట్రియా దేశంలో వేర్‌హౌస్ (warehouse) జాబ్ ఖాళీగా ఉందని, జీతం రూ. 1.5-2 లక్షలు ఇస్తారని ఏజెన్సీ వాళ్లు చెప్పడంతో బెంగళూరుకు బయలుదేరా. ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ మాటలు నమ్మి రూ. 1.5 లక్షలు చెల్లించా. ఆ మరుసటి రోజే ఆఫీసు మూతపడింది,’’ అని సైబర్ ఉద్యోగ మోసాల పట్ల అవగాహన ఉన్న ధర్మపురికి చెందిన 23 ఏళ్ల జయసూర్య ది ఫెడరల్‌తో అన్నారు.

‘రాజీనామా చేసి..డబ్బు పోగొట్టుకున్నాను’

"మీకు మంచి ఉద్యోగం చూపుతామని చెప్పారు. నేను వారి మాటలు నమ్మి నా జాబ్‌కు రిజైన్ చేశా. మొదట నేను పంపిన బయోడేటా ఫాం, వైద్య పరీక్షల రిపోర్టు రిజెక్టు అయ్యాయని, నాతో రూ. 1.5 లక్షలు కట్టించుకున్నారు, ’’ అని 35 ఏళ్ల ఇమ్రాన్ ఎస్ వాపోయారు. తన డబ్బు తిరిగి ఇప్పించాలని బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

‘అప్రమత్తతంగా ఉండాలి’..

తమిళనాడులో కార్మికుల కోసం వలస వనరుల కేంద్రం లేకపోవడంతో ఇలాంటి మోసాలు సాధారమైపోయాయి. ఈ సంఘటనల నేపథ్యంలో జాబ్ ఏజెన్సీలపై ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలంటున్నారు తమిళనాడు గృహ కార్మికుల సంక్షేమ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహకుడు ఎం. వలర్మతి. "నైపుణ్యం లేని కార్మికులు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. వారికి ఏ ఉద్యోగం దొరకకపోవడంతో ఇలాంటి ఏజెన్సీలను నమ్మి మోసపోతున్నారు." అని ఆమె ది ఫెడరల్‌తో అన్నారు.

తమిళనాడులో 18 లక్షల మంది..

తమిళనాడులో దాదాపు 18 లక్షల మంది నైపుణ్యం లేని కార్మికులు(unskilled workers) ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగ రేటు దాదాపు 2.5 శాతం ఉంది. నిరుద్యోగుల సంఖ్య పెరిగే కొద్దీ, విదేశీ నియామక కన్సల్టెన్సీ మోసాల సంఖ్య కూడా పెరిగింది. అయితే విదేశాల్లో ఉద్యోగాలకు అధికారిక మార్గంలో వెళ్లని వారు ఇలా మోసపోతున్నారని తమిళనాడులోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ రాజ్‌కుమార్ అన్నారు. నైపుణ్యం లేని కార్మికుల కోసం విదేశాల్లో ఉద్యోగాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అవగాహన కూడా కల్పిస్తోందని చెప్పారు.

తమిళనాడులో దాదాపు 200 రిజిస్టర్డ్ జాబ్ ఏజెన్సీలు ఉండగా.. దేశంలో దాదాపు 2,000 ఉన్నాయని అన్నారు. విదేశాల్లో ఉద్యోగాన్వేషణ కోసం ఉన్న వారు "emigrate.gov.in వెబ్‌సైట్ చూడాలని ఆయన కోరుతున్నారు.

ఫిర్యాదుల లెక్కలు..

2024లో ఫేక్ జాబ్ ఏజెన్సీలపై దాదాపు 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. 2023లో 25, 2022లో 22 అందాయి. 2025లో ఇప్పటివరకు తొమ్మిది మంది ఏజెంట్లపై ఫిర్యాదులు అందాయి.

విదేశాలల్లో ఉద్యోగం చూపుతామని నమ్మించి మోసగించే జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీలు చాలా ఉన్నాయి. కన్సల్టెన్సీ నిర్వాహకులు చెప్పే మాటలకు నమ్మి తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి, రాణిపేట వంటి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు అప్పు తెచ్చి వాళ్లకు చెల్లిస్తున్నారు. మోసపోయిన తర్వాత వారి పరిస్థితి మరింత దిగజారుతుంది.

Read More
Next Story