ప్రజ్వల్ రేవణ్ణపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయంటే?
x

ప్రజ్వల్ రేవణ్ణపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయంటే?

ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని యువతులపై లైంగిక దాడులకు పాల్పడిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. కేసును విచారిస్తున్న సిట్ బాధితుల నుంచి..


కర్నాటక ను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పరారీలో ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై దాదాపు తొమ్మిది ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడానికి అధికారులు సిద్దమయ్యారు. సిట్ అధికారులు అత్యాచారానికి గురైన ముప్పై మందికి పైగా బాధితులను సంప్రదించారు. వారిలో తొమ్మిది మంది ప్రజ్వల్ రేవణ్ణపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు, స్టేట్‌మెంట్‌లను ఇవ్వడానికి అంగీకరించారు.

33 ఏళ్ల హసన్ ఎంపీ చాలా మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి, వాటిని తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. అవి కర్నాటకలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో కర్నాటకలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది.
బాధితులు అనేకమంది..
జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అనేకమంది మహిళలను తన పదవిని అడ్డుపెట్టుకుని ట్రాప్ చేసినట్లు, బలవంతంగా వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని, వాటిని మొబైల్ ఫోన్లో చిత్రీకరించడం వంటి అనేక అభియోగాలు సిట్ నమోదు చేయనున్నట్లు కొన్ని వర్గాలు ఫెడరల్ కు తెలిపాయి. ఈ కేసులన్నింటిపై పోరాడేందుకు ఏళ్లు పడుతుందని, అయితే చట్టం నుంచి తప్పించుకోవడం ఎంపీకి అంత సులభం కాదని సిట్ అధికారి ఒకరు ఫెడరల్‌తో అన్నారు. ప్రజ్వల్ కూడా ఈ లోక్‌సభ ఎన్నికల్లో హాసన్ నియోజకవర్గంలో జేడీ(ఎస్)-బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు
అత్యాచారం ఆరోపణలతో అతనిపై ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఐదుగురు బాధితుల్లో ముగ్గురు ప్రజ్వల్ లైంగిక వేధింపుల వివరాలను సిట్ అధికారులకు అందించారు. ఒక బాధితురాలు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఓ కేసులో ప్రజ్వల్ మాత్రమే కాకుండా అతని తండ్రి హెచ్‌డి రేవణ్ణ కూడా ఓ మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తండ్రీకొడుకుల మీద నమోదవుతున్న కేసుల సంఖ్య వారిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుందని ఫెడరల్‌కి ఒక పోలీసు అధికారి తెలిపారు.
కిడ్నాప్ కేసు
మరోవైపు తన ఇంట్లో పని చేస్తున్న మహిళను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టయిన మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణను సిట్ పోలీసులు విచారించనున్నారు. బాధితురాలు సోమవారం (మే 6) సిట్‌కు వాంగ్మూలం ఇవ్వనుంది. జడ్జి ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని, కిడ్నాప్ కేసులో బెయిల్ విషయంలో రేవణ్ణ భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఈ కేసు కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
కిడ్నాప్‌కు గురై రేవణ్ణ కు నమ్మకస్తుడు అయిన సతీష్ బాబన్న ఫామ్‌హౌస్‌లో గృహనిర్బంధంలో ఉన్న బాధితురాలిని శనివారం (మే 4) సాయంత్రం సిట్ పోలీసులు రక్షించారు. అనంతరం ఆమెను సిట్‌ పోలీసులు బెంగళూరులోని కౌన్సెలింగ్‌ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం, మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
అయితే ఆమె పోలీసులకు వివాదాస్పద వాంగ్మూలాలు ఇస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఒకసారి తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనే రేవణ్ణ ఇంటిని విడిచిపెట్టి వచ్చానని, మరో సందర్భంలో తెలిసిన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అధికారులకు చెప్పినట్లు వినికిడి. అయితే తను కిడ్నాప్ కు గురైనట్లు అంగీకరించిందని, తనను ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారం కూడా ఇచ్చారని అన్నారు.
ఇలా రకరకాలుగా చెప్పడంతో దర్యాప్తులో అనుకున్నంత వేగం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. మరో సందర్భంలో మహిళా అధికారుల ముందు ఏడుస్తూ.. ప్రజ్వల్ రేవణ్ణ చేసిన లైంగిక వేధింపులు గురించి ఆమె సమాచారం ఇచ్చినట్లు వినికిడి.
సిట్ అధికారుల దగ్గరికి అనేక మంది బాధితులు వచ్చే అవకాశం ఉందని, వారిని మానసికంగా ధృడంగా చేసేందుకు వైద్యుల సాయం తీసుకుంటామని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
వివాదాస్పద ప్రకటనలు
సిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజ్వల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ దర్యాప్తు అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే తనను హెచ్‌డీ రేవణ్ణ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలను మాత్రం ఖండించింది. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా ప్రజ్వల్ రేవణ్ణ పై మరో కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. కాగా, రేవణ్ణ, ప్రజ్వల్ నుంచి తనకు ఎదురైన లైంగిక వేధింపులపై హోలెనరసీపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఇంటి పనిమనిషి సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చింది.
రేవణ్ణ సహకరించడం లేదు
హెచ్‌డీ రేవణ్ణ.. అధికారుల ప్రశ్నలపై స్పందించడం లేదని సమాచారం. సిట్ అధికారి ఒకరు మాట్లాడుతూ, "అతను మాకు వన్ లైన్ సమాధానాలు ఇస్తున్నాడు. మహిళ అపహరణతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరినీ అపహరించలేదని చెబుతున్నాడు, మా ఇళ్లలో వందలాది మంది పని చేస్తున్నారు. మీరు చెబుతున్న మహిళ ఎవరో నాకు తెలియదు." అని సమాధానాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
Read More
Next Story