ఓటు బ్యాంకు రాజకీయాలా.. పర్యావరణమా? దేన్నీ కాపాడుకోవాలి..
x

ఓటు బ్యాంకు రాజకీయాలా.. పర్యావరణమా? దేన్నీ కాపాడుకోవాలి..

పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతంగా ఉన్న పశ్చిమ కనుమల నుంచి ఆక్రమణదారులను తొలగించడానికి కస్తూరి రంగన్ కమిటి ఇచ్చిన నివేదికను అమలు చేయడానికి..


పశ్చిమ కనుమలు దేశంలో అత్యంత తీవ్ర స్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతంగా ఉంది. హిమాలయాలు తరువాత కొండచరియలు విరిగిపడటం ఇక్కడే అధికం. అంతేకాకుండా పర్యావరణపరంగా అత్యంత సున్నిత హాట్ స్పాట్ గా ఉంది.

2013 కస్తూరిరంగన్ కమిటీ నివేదిక ఆధారంగా 2014 లో పశ్చిమ కనుమలలోని కొన్ని ప్రాంతాలను “పర్యావరణ సున్నిత ప్రాంతాలు” (ESAs)గా వర్గీకరిస్తూ కేంద్రం జారీ చేసిన ఐదు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. శుక్రవారం (ఆగస్టు 2) కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులు చేసిన డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా ఉంది.
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సహాయ నిధుల విషయంలో గత కొన్నేళ్లుగా కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం మధ్య పదే పదే గొడవలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలు ఢిల్లీలో నిరసనలు చేయడం నుంచి సుప్రీం కోర్టును ఆశ్రయించడం వరకు కేంద్రం మరిన్ని నిధులు విడుదల చేసే వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో, ఈఎస్‌ఏలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోవడం కేంద్ర ప్రభుత్వానికి మేలు చేస్తుంది.
కఠినమైన ఎంపికలు
గత పదిహేను రోజులుగా కర్నాటకలోని పశ్చిమ కనుమ ప్రాంతాల్లో పదే పదే కొండచరియలు విరిగిపడటం, పొరుగున ఉన్న కేరళలోని వయనాడ్‌లో జరిగిన విధ్వంసాన్ని చూసిన తరువాత, సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో డ్రాప్ట్ అంగీకరించే పరిస్థితి. దీనివల్ల వెస్ట్రన్ ఘాట్ లను మరింత విధ్వంసం నుంచి రక్షించవచ్చు. లేకపోతే పర్యావరణ విధ్వంసం వలన మరిన్ని ప్రాణాలు ప్రమాదం పడే అవకాశం కూడా కనిపిస్తోంది.
విరిగిపడిన షిరాడీ ఘాట్ కొండచరియలు..
కేరళలోని వయనాడ్‌లో సంభవించిన భారీ నష్టం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో కర్నాటకలో ఘాట్ లపై కొండచరియలు విరిగిపడటం ప్రారంభించాయి. అంకోలా సమీపంలోని శిరూరు గ్రామంలో ఇవి విరిగిపడ్డాయి. ఇందులో కేరళకు చెందిన డ్రైవర్‌తో సహా 10 మంది మరణించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తన ట్రక్కుతో సహా అదృశ్యమయ్యాడు. ఇది చాలా రోజులుగా వార్తల్లో నానింది. అయితే అది ఒక్కటే కాదు.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, “మునుపటి కొండచరియలు విరిగిపడిన శిథిలాలను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, భారీ వర్షాల కారణంగా మళ్లీ అదే స్థలంలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. హసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలోని దొడ్డతప్పలే గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో షిరాడీ ఘాట్ మీదుగా మంగళూరు-బెంగళూరు హైవే (NH75)పై వాహనాల రాకపోకలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది.
'అభివృద్ధి' దారిలో..
కొండచరియలు విరిగిపడకుండా కొన్ని రక్షణాత్మక చర్యలు ప్రభుత్వం తీసుకుంది. అయితే అవి ఎంతవరకూ పనికి వస్తున్నాయో తేల్చడం కష్టం. అయితే ఆరో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటిక పశ్చిమ కనుమల నుంచి అక్కడ నివసిస్తున్న ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని ఇది ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ డ్రాప్ట్ నోటిఫికేషన్ అమలు చేస్తే అభివృద్దిపై ప్రభావం చూపుతుంది.
నోటిఫికేషన్‌పై సిద్దరామయ్య స్పందించడం సందేహాన్ని ధృవీకరిస్తోంది. శుక్రవారం ఆయన మైసూరులో మాట్లాడుతూ.. కస్తూరిరంగన్‌ కమిటీ నివేదిక అమలుకు ప్రభుత్వం వ్యతిరేకం అయితే అధికారులు, (కర్ణాటక) అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రేతో సమీక్షించి చర్చిస్తానని వ్యాఖ్యానించారు.
కొండచరియల ప్రభావం
2015 నుంచి అన్ని అటవీ ఆక్రమణలను తొలగించాలని, అటువంటి తొలగింపుల వివరాలతో సమ్మతి నివేదికను సమర్పించాలని తన అధికారులను ఆదేశిస్తూ ఖండ్రే జారీ చేసిన ఉత్తర్వులో కూడా కొండచరియల ప్రభావం కనిపిస్తుంది. నెలరోజుల్లోగా ఇలాంటి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
2015లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014కి ముందు జీవనోపాధి కోసం 3 ఎకరాల కంటే తక్కువ అటవీ భూమిని ఆక్రమించుకున్న వారిని ఆ శాఖ ఖాళీ చేయబోదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు “పెద్ద”గా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.



పోల్ ఒత్తిడి
ముఖ్యంగా స్థానిక సంస్థలకు త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా, ఈఎస్‌ఏగా సిఫార్సు చేయబడిన జిల్లాల ఓటర్లను వ్యతిరేకించకూడదని కాంగ్రెస్ వర్గాలు అంగీకరించాయి. శివమొగ్గ, చిక్కమగళూరు, బెలగావి, కొడగు, దక్షిణ కన్నడ, ఉడిపి సహా ఈ జిల్లాలు ప్రత్యర్థి బీజేపీకి కంచుకోటలు. సరిగ్గా అందుకే ఆ పార్టీ 2022లో ఐదవ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తిరస్కరించింది.
బిఎస్ యడియూరప్ప, కెఎస్ ఈశ్వరప్ప, బెళగావికి చెందిన ప్రగాఢ శత్రువులు వీరితో పాటు బిఎల్ సంతోష్, సిటి రవి, కెజి బోపయ్య, అప్పచ్చురంజన్, ప్రతాప్ సింహా, శోభా కరంద్లాజె, విశ్వేశ్వర హెగ్డే కగ్రీ వంటి నాయకులు ఐదవ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు లేవనెత్తారు. నోటిఫికేషన్ ఆమోదం పొందితే తమ నియోజకవర్గాలను నిలబెట్టుకోవడం కష్టమని బీజేపీ హైకమాండ్‌కు నిస్సందేహంగా చెప్పారు.
ఒకే నాణెం వైపులా
ఈ జిల్లాల కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఇదే విధమైన ఒత్తిడి ఉంది. పర్యావరణ పరిరక్షణ కంటే పార్టీకి రాజకీయ సుస్థిరత ముఖ్యమని పార్టీ సీనియర్ నాయకుడు కన్నెర్ర చేయకుండా ఒప్పుకున్నారు. పొరుగున ఉన్న కేరళలోనూ ఇదే పరిస్థితి. వరుసగా వచ్చిన UDF, LDF ప్రభుత్వాలు ముసాయిదాలను తిరస్కరిస్తూనే ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని బిజెపి కూడా దాని అమలు కోసం ఒత్తిడి చేసే అవకాశం లేదు.
కేరళలో ESAలుగా నోటిఫై చేయబడే చాలా ప్రాంతాలు సెటిలర్ రైతులచే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీరితో కాథలిక్ చర్చి గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది - ఈ నియోజకవర్గాన్ని కమలదళం ఎన్నికల లాభాల కోసం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆరవ డ్రాఫ్ట్ ..
ఆరవ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం, కర్ణాటకలోని ESAలు 1,572 గ్రామాలతో కూడిన 20,668 చదరపు కి.మీ. 640 గ్రామాలతో ఉత్తర కన్నడ మొదటి స్థానంలో ఉంది. ఇందులో చామరాజనగర్‌లో అత్యల్ప గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం 21 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో ప్రభావితమయ్యే ఇతర జిల్లాలు శివమొగ్గ (475), చిక్కమగళూరు (142), బెలగావి (63), మైసూరు (56), కొడగు (55), దక్షిణ కన్నడ (48) , ఉడిపి (37), హసన్ (35) గ్రామాలు ఉన్నాయి.
2014, 2015, 2017, 2018, 2022లో పశ్చిమ కనుమలలో ESAల గుర్తింపు, ప్రకటనపై అభ్యంతరాలను ఆహ్వానిస్తూ MoEF&CC ఇలాంటి గెజిట్ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఇవి 2013 కస్తూరిరంగన్ కమిటీ నివేదిక ఆధారంగా 37 శాతం సిఫార్సు చేసింది. పశ్చిమ కనుమలు - 59,940 చ.కి.మీ.లు - ESAలుగా వర్గీకరించబడతాయి. ఊహించిన విధంగా, కర్ణాటకతో సహా చాలా రాష్ట్రాలు ముసాయిదాలను తిరస్కరిస్తూనే ఉన్నాయి. జూలై 31న వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ముసాయిదా 60 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి.
గాడ్గిల్ కమిటీ నివేదిక
కస్తూరిరంగన్ కమిటీకి ముందే, పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలోని ప్యానెల్ 2011లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఐదు రాష్ట్రాలలో 1,29,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతాన్ని ESAలుగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. అయితే పారిశ్రామికవేత్తలు స్థానికుల ఒత్తిడి కారణంగా రాష్ట్రాలు వెంటనే సిఫార్సులను తిరస్కరించాయి.
అందువల్ల, అప్పటి ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష శాస్త్రవేత్త కె. కస్తూరిరంగన్ నేతృత్వంలో రెండవ కమిటీని ఏర్పాటు చేశారు, అది 2013లో తన నివేదికను సమర్పించింది. “కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులు గాడ్గిల్ కమిటీ నివేదిక కంటే 'సాంకేతికత' పరంగా ఉన్నతమైనవి. అయితే వాయనాడ్ దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వాలకు ఏమైనా పర్యావరణ సంబంధిత సమస్యలు ఉంటే గాడ్గిల్ కమిటీ సిఫార్సులను ఆమోదించడం కాలపు అవసరం” అని నిపుణుడు, పశ్చిమ కనుమలపై డాక్యుమెంటరీ చిత్రనిర్మాత అయిన కేసరి హార్వో అన్నారు.


Read More
Next Story