‘‘సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టినట్లు.. రికార్డు సృష్టించాను’’
x
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

‘‘సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టినట్లు.. రికార్డు సృష్టించాను’’

కర్ణాటకలో ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన ఘనత తన పేరు మీద ఉండబోతుందున్న సిద్ధరామయ్య


కర్ణాటకలో ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన డి దేవరాజ్ ఉర్స్ పేరు మీద ఉన్న రికార్డును తాజా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారంతో అధిగమించనున్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని ప్రజల ఆశీర్వాదాల వలనే సాధ్యమైందని ఆయన అన్నారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన ఘనతలను ప్రస్తావిస్తూ క్రికెట్ సారూప్యతను ఉపయోగించారు.

ఉర్స్ రికార్డ్
దేవరాజ్ ఉర్స్ మార్చి 1972 జనవరి 1980 మధ్య రెండుసార్లు 7.6 సంవత్సరాలు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా మొదటి పదవీకాలం మే 2013 నుంచి మే 2018 మధ్య ఉంది.
రెండో పదవీకాలంలో సిద్ధరామయ్య మే 20, 2023 నుంచి పదవిలో ఉన్నారు. తనకు ఉర్స్ కు మధ్య ఉన్న ముఖ్య తేడాలను ఆయన ఎత్తిచూపారు. ఉర్స్ పాలక వర్గానికి చెందినవాడని, కానీ నేను సామాజికంగా వెనకబడిన సమాజం( కురుబా లేదా గొర్రెల కాపరి) నుంచి వచ్చారని అన్నారు.
మైసూర్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజల ఆశీస్సులతో కర్ణాటకకు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత డీ. దేవరాజ్ ఉర్స్ రికార్డు రేపు సమం అవుతుంది.
గర్వించదగ్గ విషయం ఏంటంటే.. నేను ఉర్స్ మైసూర్ కు చెందిన వాళ్లమే’’ అని అన్నారు. ఆ రికార్డును ఎప్పుడైన బద్దలు కొడతానని ఎప్పుడైనా ఊహించారా అని అడిగినప్పుడూ ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం సంగతి ఎలా ఉన్నా మంత్రి అవుతానని కూడా ఎప్పుడూ ఊహించలేదని ఆయన చెప్పుకున్నారు.
‘‘తాలూక్ బోర్డు సభ్యుడిని అయిన తరువాత ఎమ్మెల్యే అవుతానని మాత్రమే అనుకున్నాను. నేను ఇప్పటి వరకూ ఎనిమిది ఎన్నికల్లో గెలిచాను. రెండు పార్లమెంట్ ఎన్నికలు, రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాను. నా జీవితంలో తాలూక్ ఎన్నికలు సహ 13 ఎన్నికల్లో పోటీ చేశాను’’ అని సిద్ధరామయ్య అన్నారు.
డీ. దేవరాజ్ తో పోల్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరాజ్ ఉర్స్ సామాజికంగా వెనకబడిన వ్యక్తి కాదు. నిజానికి ఆయన ఉన్నత వర్గానికి చెందినవారు.
పాలక వర్గం. ఆయన జనాభా తక్కువగా ఉన్న సమాజానికి చెందినవారు, కానీ ఆయన ప్రజాదరణ పొందిన నాయకుడు’’ అని అన్నారు. తనకు, ఉర్స్ కు ఎలాంటి పోలిక లేదని ముఖ్యమంత్రి అన్నారు.
ఆయనకు ప్రజలు డబ్బు, అధికారం ఇచ్చారు..
ఉర్స్ యుగం కంటే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సిద్ధరామయ్య అన్నారు. ఉర్స్ ప్రజల నుంచి నేరుగా డబ్బు వసూలు చేయడం ద్వారా ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు.
‘‘1962 లో ప్రజలు ఆయనకు డబ్బు, ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు కాలం మారిపోయింది’’ అని ఆయన అన్నారు. తన రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు రికార్డులు బద్దలు కొట్టడానికే అని సిద్ధరామయ్య అన్నారు.
సిద్దరామయ్య తన ఘనతను క్రికెట్ లో టెండూల్కర్ రికార్డ్ ను కోహ్లీ బద్దలు కొట్టడంతో పోల్చారు. ‘‘రికార్డులు బద్దలు కొట్టడానికి ఉన్నాయి. భవిష్యత్ లో ఎవరైనా వాటిని బద్దలు కొట్టవచ్చు.
క్రికెట్ లో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అదే విధంగా భవిష్యత్ లో నాకంటే ఎక్కువకాలం ముఖ్యమంత్రి అయ్యే, ఎక్కువ బడ్జెట్ లను ప్రవేశపెట్టే వ్యక్తి రావచ్చు’’ అని సిద్ధరామయ్య ఇప్పటి వరకూ 16 బడ్జెట్ లను ప్రవేశపెట్టారు.
Read More
Next Story