
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
‘‘కర్ణాటక ముఖ్యమంత్రిగా నేనే ఉంటా’’
సిద్ధరామయ్య సంకేతాలు
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ఊహగానాలను సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్పకనే చెప్పారు.
వచ్చే ఏడాది బడ్జెట్ ను రికార్డు స్థాయిలో 17వ సారి తానే ప్రవేశపెడతానని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా పనిచేస్తున్న సిద్ధరామయ్య మార్చిలో తన 16 వ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
వచ్చే ఏడాది తానే స్వయంగా 17వ బడ్జెట్ ను ప్రవేశపెడతానని విలేకరులతో అన్నారు. ఎల్జీ హవనూర్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మొదటి వెనకబడిన తరగతుల కమిషన్ నివేదిక అందుకున్నారు.
‘‘నేను మొదటిసారి ఆర్థిక మంత్రి అయినప్పుడూ ఒక వార్తా పత్రిక ఇలా రాసింది. ఈ సిద్ధరామయ్య కురుబుడు. వంద గొర్రెలను లెక్కించలేడు. అతను కర్ణాటక ఆర్థికమంత్రిగా ఎలా పనిచేస్తాడు.
నేను దీనిని ఒక సవాల్ గా స్వీకరించాను. నేను 16 బడ్జెట్ లను సమర్పించాను. వచ్చే ఏడాది బడ్జెట్ ను కూడా నేనే సమర్ఫిస్తాను’’ అని సిద్ధరామయ్య అన్నారు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ కు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని తెలిపారు.
రొటేషన్ ఫార్మూలా వర్తించదు..
నవంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం మార్క్ ను చేరుకుంది. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పు సాధ్యమవుతుందనే ఊహగానాల మధ్య సిద్ధరామయ్య వ్యాఖ్యలు వచ్చాయి.
మే 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఆయనను ఒప్పించి డిప్యూటీ సీఎంగా చేసింది.
‘‘రొటేషన్ ముఖ్యమంత్రి ఫార్ములా’’ ఆధారంగా రాజీ కుదిరిందని ఆ సమయంలో కొన్ని నివేదికలు వచ్చాయి. దీని ప్రకారం శివకుమార్ రెండున్నర సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి అవుతారు. కానీ వాటిని పార్టీని అధికారికంగా ధృవీకరించలేదు.
Next Story

