రాజకీయాల్లోకి ‘ఇళయదళపతి’ విజయ్?
x
తమిళనటుడు విజయ్

రాజకీయాల్లోకి ‘ఇళయదళపతి’ విజయ్?

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ సినీ హీరో రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ, రాజకీయ వర్గాలు.


తమిళనాడు రాజకీయ సినీవర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టనున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలతో హోరెత్తిస్తోంది. విజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి కూడా చురుగ్గా ఏర్పాట్లు చేయనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. పార్టీ రిజిస్ట్రేషన్ పనుల కోసం ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎన్నికల సంఘం అధికారులను కలిసి పలు కీలక డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలిసింది.

పార్టీ రిజిస్ట్రేషన్ కు ముందు జరిగిన సమావేశానికి దాదాపు 200 మంది పార్టీ జనరల్ కౌన్సిల్ సభ్యులు హజరైయ్యారు. అందుతున్నసమాచారం ప్రకారం పార్టీ పేరును నిర్ణయించే అధికారంతో పాటు రిజిస్ట్రేషన్ చేసే పలు కీలక విషయాలను కూడా వీరంతా సినీ నటుడు విజయ్ కే అందించారు. ఇప్పుడు పార్టీ స్థాపించి 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల లోపు అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తమిళ రాజకీయానికి, సినిమాలకు విడదీయరాని సంబంధం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్,జయలలిత వీరంతా సినీ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. పైగా వీరంతా ద్రావిడ వాదాన్ని తమిళనాడులో వ్యాప్తి చేస్తున్నారు. విజయ్ సైతం వారి బాటలోనే నడుస్తున్నారు.

ఇళయ దళపతిగా అభిమానులచే ముద్దుగా పిలిపించుకునే ఆయన, ఇప్పటి వరకూ 68 సినిమాల్లో నటించాడు. దశాబ్దానికి పైగా రాజకీయాల్లోకి రావాలనే అనుకుంటున్నాడు. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఉచిత ఆహారం, విద్యాస్కాలర్ షిప్ లు అందించడం, లైబ్రరీల స్థాపన, ట్యూషన్ లు చెప్పించడం, న్యాయసహాయం అందించడం వంటి స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

ఇటీవల అతను పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాడు. తనకు అంబేడ్కర్, కామరాజ్, పెరియార్ వంటి నాయకులు ఆదర్శం అని, వారి నుంచి అనేక విషయాలను నేర్చుకోవాలని విద్యార్థులకు సలహ ఇచ్చాడు. నేే

Read More
Next Story