నన్ను క్షమించండి.. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: కేంద్రమంత్రి
x

నన్ను క్షమించండి.. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: కేంద్రమంత్రి

తమిళనాడుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి శోభ కరంద్లాజే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పారు.


"బెంగళూరులో ఇటీవల జరిగిన పేలుళ్లకు తమిళులు కారణం" అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం కావడం, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడంతో ఆమె స్పందించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన కొన్ని గంటల తర్వాత, ఎక్స్ వేదికగా స్పందించారు.

“నేను మాట్లాడిన మాటలు బాధ కలిగించి ఉంటే క్షమించండని నా తమిళ సోదరులు & సోదరీమణులను వేడుకుంటున్నాను. రామేశ్వరం బాంబు దాడులకు పాల్పడిన వాళ్లకి కృష్ణగిరి అడవుల్లో శిక్షణ పొందినట్లు తెలిసన తరువాత నేను ఈ వ్యాఖ్యలు చేశాను. నేను కావాలని నిందలు వేయలేదు. నా మాటలు వెలుగులు తీసుకురావాలనే అనుకున్నాను కానీ, చీకట్లు అలముకోవడానికి కాదని మరోసారి మనవి చేస్తున్నాను” అని రెండు ట్వీట్లు చేశారు.

అయితే, ఈ ట్విట్ల కంటే ముందు, ఆమె మూడు X పోస్ట్‌లలో "హిందువులను, బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న రాడికల్ ఎలిమెంట్స్‌ను ప్రోత్సహించినందుకు" స్టాలిన్‌ మీద విమర్శలు గుప్పించింది.
"శ్రీ. స్టాలిన్, మీ పాలనలో తమిళనాడు ఎలా ఉంది? మీ బుజ్జగింపు రాజకీయాల వల్ల హిందువులు & BJP కార్యకర్తలపై పగలు రాత్రి నిరంతరం దాడులు జరుగుతున్నాయి. దాడులకు పాల్పడే రాడికల్ ఎలిమెంట్లను మీరే ప్రోత్సహిస్తున్నారు. మీరు ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే ఐసిస్ వంటి ఉగ్రవాద లక్షణాలు కలిగిన సంస్థలు ఇలాగే విధ్వంసాలు సృష్టిస్తాయి” అని ఆరోపించారు.
రెండో పోస్ట్‌లో, "FYI, రామేశ్వరం బాంబర్ మీ ఆధీనంలో ఉన్న కృష్ణగిరి అడవులలో శిక్షణ పొందారు " అని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనను ఆమె ప్రస్తావించారు.

“తమిళులు, కన్నడిగుల మధ్య ఉన్న సామసర్య సంబంధాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. వారు రాష్ట్రానికి విపరీతమైన సహకారం అందించారు. మేము సన్నిహిత సాంస్కృతిక బంధాలను కలిగి ఉన్నాము. చరిత్రను పంచుకున్నాము, ”అని సిరీస్‌లో ఆమె మూడవ పోస్ట్ లో వివరించారు.

అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి కేంద్రమంత్రి శోభ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామేశ్వరం బాంబు బ్లాస్ట్ విషయాలు చెబుతున్నారంటే మీరు ఎన్ఐఏ అధికారి అయిన కావాలి లేదా బాంబు పేలుళ్లకు పాల్పడిన నిందితులు మీకు తెలిసన వారైన ఉండాలని ట్వీట్ చేశారు. అంతే కాకుండా విద్వేష ప్రసంగాలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘం, ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు
మార్చి 13న కర్ణాటకలోని బళ్లారిలో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి షబ్బీర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరగగా, సీసీటీవీ ఫుటేజీలో ఉన్న నిందితుడిని గుర్తించడానికి ఫొటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. పేలుడు జరపడానికి టైమర్‌తో కూడిన IED పరికరాన్ని ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది.
Read More
Next Story